సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
దిశ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన డాక్టర్ జితేంద్ర సింగ్ రాంబన్ జిల్లాలో లావెండర్ సాగు త్వరలో ప్రారంభం
Posted On:
13 NOV 2022 6:55PM by PIB Hyderabad
సుగంధ ద్రవ్యాల మిషన్ కింద త్వరలో జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో లావెండర్ సాగు ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.రాంబన్ జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి పనులను ఈరోజు జరిగిన దిశ సమావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. పొరుగున ఉన్న ధోడా జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన లావెండర్ సాగు విజయవంతం అయ్యిందని పేర్కొన్న డాక్టర్ జితేంద్ర సింగ్ త్వరలో రాంబన్ జిల్లాలో కూడా వీటి పెంపకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఇదివరకు ధోడా జిల్లాలో భాగంగా ప్రస్తుత రాంబన్ జిల్లా ఉండేది. రెండు ప్రాంతాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. దీంతో దోడాలో విజయవంతంగా సాగుతున్న లావెండర్ పెంపకాన్ని రాంబన్ జిల్లాకు సులువుగా విస్తరించవచ్చు. లావెండర్ సాగు వల్ల యువతకు ప్రత్యామ్నాయ, ఆకర్షణీయ ఉపాధి అవకాశాలు లభిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులతో జిల్లాలో వివిధ అభివృద్ధి పథకాలు అమలు జరుగుతున్న తీరును డాక్టర్ జితేంద్ర సింగ్ సమావేశంలో సమీక్షించారు. జిల్లా సీనియర్ అధికారులు పథకాల కింద సాధించిన ప్రగతి, పనులు జరుగుతున్న తీరును మంత్రికి వివరించారు.కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విడుదల అయిన నిధులు ఖర్చు వివరాలు మంత్రికి తెలిపారు.
ప్రాజెక్టుల అమలులో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం ఉండాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేసినప్పుడు మాత్రమే పథకాలు విజయవంతంగా అమలు జరుగుతాయని మంత్రి అన్నారు.
శాఖల వారీగా పథకాలు అమలు జరుగుతున్న తీరును డాక్టర్ జితేంద్ర సింగ్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో వివిధ అంశాలను మంత్రి దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకు వచ్చారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు.
పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, అన్ని పథకాల కింద 100 శాతం అర్హులైన లబ్ధిదారులకు లబ్ది కలిగేలా చూడడానికి అధికారులు రెట్టించిన ఉత్సాహంతో మరియు అంకితభావంతో పని చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సంబంధిత విభాగాలను ఆదేశించారు.
అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్నది ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ లక్ష్యమని ఆయన అన్నారు. క్షేత్ర స్థాయిలో పథకాలు విజయవంతం అయ్యేలా చూసేందుకు సంబంధితులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తమ ప్రాంతానికి వచ్చే ప్రజాప్రతినిధులతో అధికారులు కలిసి పనిచేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. పథకాల ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లాలో వివిధ సీఎస్‌ఎస్‌లను విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగాన్ని డాక్టర్ సింగ్ అభినందించారు.
డీడీసీ చైర్‌పర్సన్ డాక్టర్ శంషాద్, డీసీ రాంబన్ ముస్సరత్ ఇస్లాం, డీడీసీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు
***
(Release ID: 1875689)
Visitor Counter : 199