కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఇ ఎస్ ఐ సి ఆన్ లైన్ మెటర్నిటీ బెనిఫిట్ క్లెయిం పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర కార్మిక , ఉపాధి కల్పన మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్
Posted On:
11 NOV 2022 6:20PM by PIB Hyderabad
హైలైట్స్:
ఈ పోర్టల్ లబ్ధిదారులకు వారి సౌలభ్యం మేరకు ప్రయోజనాలను సులభంగా అందుబాటులో ఉంచుతుంది: శ్రీ భూపేందర్ యాదవ్
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన శ్రీ దత్తోపంత్ తేంగాడి 102వ జయంతి
కేంద్ర కార్మిక , ఉపాధి , పర్యావరణం, అటవీ , వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఇ ఎస్ ఐ సి) ఆన్ లైన్ ప్రసూతి బెనిఫిట్ క్లెయిం ఫెసిలిటీని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో శ్రీ దత్తోపంత్ తెంగాడి 102వ జయంతి సందర్భంగా ప్రారంభించారు
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కార్మిక , ఉపాధి పెట్రోలియం , సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇ ఎస్ ఐ సి డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ తో పాటు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, ఈఎస్ఐసీకి చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా శ్రీ భూపేంద్ర యాదవ్
ప్రసంగిస్తూ, బీమా చేసిన మహిళల జీవితాలను సులభతరం చేయడం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కోవడానికి ఇ ఎస్ ఐ సి తీసుకున్న
ప్రయత్నాలను శ్రీ భూపేంద్ర యాదవ్
ప్రశంసించారు. ఈ పోర్టల్ ప్రయోజనాల ను లబ్దిదారులకు సులువుగా అందుబాటులో ఉంచుతుందని ఆయన అన్నారు. శ్రీ రామేశ్వర్ తేలీ, ఈ పోర్టల్ ను ప్రశంసిస్తూ, మ హిళల సాధికారిత
లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా సాకారం చేసుకోవడానికి ఈ చర్య
తోడ్పడుతుందని అన్నారు.
కొత్తగా ప్రవేశపెట్టిన సదుపాయం బీమా చేయబడిన మహిళలకు ప్రసూతి ప్రయోజనాలను క్లెయిం చేసుకునే ప్రక్రియను సులభతరం చేస్తుంది, ఈ ప్రక్రియ ఇప్పుడు ఆన్ లైన్ కావడం చేత , లబ్ధిదారులు, వారి సౌలభ్యం మేరకు, ఇప్పుడు ఎక్కడి నుంచైనా ప్రసూతి ప్రయోజనాలను క్లెయిం చేసుకోవచ్చు.
ఇంతకు ముందు, మెటర్నిటీ బెనిఫిట్ లను క్లెయిం చేసుకోవడం కోసం లబ్ధిదారులు సంబంధిత బ్రాంచీ ఆఫీసులను భౌతికంగా సందర్శించాల్సి వచ్చేది, అయితే ఇప్పుడు ఈ కొత్త ఫెసిలిటీని ప్రవేశపెట్టడం ద్వారా, వారి సౌలభ్యం మేరకు బెనిఫిట్ లను పొందవచ్చు.
గర్భధారణ అడ్వాన్స్ దశ లో, డెలివరీ తరువాత/ప్రసవం లేదా దురదృష్టకరమైన గర్భస్రావం సందర్భంలో అర్హత కలిగిన బీమా కలిగిన మహిళలకు మాతృత్వ ప్రయోజనాన్ని నగదు రూపంలో అందిస్తారు. ప్రసవ సమయంలో ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఇ ఎస్ ఎస్ ఐ సి ద్వారా బీమా చేయబడ్డ మహిళకు ప్రసూతి బెనిఫిట్ వలే 26 వారాలపాటు 100% వేతనాలు చెల్లించబడతాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 18.69 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు రూ.37.37 కోట్ల ప్రసూతి ప్రయోజనాన్ని అందించారు.
****
(Release ID: 1875555)
Visitor Counter : 158