ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డయేరియా వ్యాధి , పోషకాహారం పై 16వ ఆసియా సదస్సు (ఎ ఎస్ సి ఓ డి డి ) లో ప్రసంగించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
గతంలో నేర్చుకున్న పాఠాలు అంటువ్యాధులతో పోరాడటానికి ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం తప్పనిసరి అని సూచిస్తున్నాయి: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
Posted On:
11 NOV 2022 1:22PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈ రోజు కోల్ కతాలో డయేరియా వ్యాధి ,పోషకాహారంపై 16వ ఆసియా సదస్సులో ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్ ఆరోగ్య కార్యదర్శి శ్రీ నారాయణ స్వరూప్ నిగమ్ , డిజిహెచ్ఎస్ డైరెక్టర్
జనరల్ డాక్టర్ అతుల్ గోయెల్ కూడా హాజరయ్యారు. భారతదేశం , ఇతర ఆగ్నేయాసియా దేశాలు, ఆఫ్రికా దేశాలు, యుఎస్, యూరోపియన్ దేశాల నుండి ప్రతినిధులు వర్చువల్ గా ఈ సదస్సులో పాల్గొన్నారు. "కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా తక్కువ , మధ్య-ఆదాయ దేశాలలో కలరా, టైఫాయిడ్ ఇతర ఎంటరిక్ వ్యాధుల నివారణ , నియంత్రణ: సార్స్-కోవ్-2 మహమ్మారికి అతీతంగా" అనేది ఈ సదస్సు ఇతివృత్తం.
కోల్కతాలో డయేరియా వ్యాధి , పోషణపై 16 వ ఆసియా సదస్సును ఏర్పాటు చేసినందుకు ఐసిఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ డైరెక్టర్ ను, బృందాన్ని అభినందించిన డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, "కొన్నేళ్లుగా, కలరా , టైఫాయిడ్ ఎపిడెమియాలజీపై మాత్రమే కాకుండా, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్, నీరు, పర్యావరణ పారిశుధ్య అంశాలు, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మొదలైన ఎంటరిక్, వ్యాక్సిన్ చొరవలపై కూడా ఎ ఎస్ సి ఓ డి డి అనేక కోణాల్లో చర్చలను విస్తరించింది‘‘ అని అన్నారు.
గత రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అనేక ప్రజారోగ్య కార్యక్రమాలను కోవిడ్-19 మహమ్మారి ఎలా ప్రభావితం చేసిందో డాక్టర్ భారతి పవార్ ప్రస్తావించారు. "గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత
ప్రభుత్వం మన ప్రజలందరికీ చౌక గా, నాణ్య మైన ఆరోగ్యాన్ని అందించేలా చూసుకుంది. చివరి వ్యక్తిని చేరుకోవడానికి ప్రత్యేక దృష్టి సారించి పౌరుల ప్రయోజనాల కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టాము. ప్రజా ప్రతినిధులుగా, సేవలు అవసరమైన వారికి చేరుకోవాలనేది మన నైతిక బాధ్యత అని ప్రభుత్వం ఎల్లప్పుడూ నొక్కి చెప్పింది. అవసరమైనవారు సేవలను వెతుక్కుంటూ . దేశ ఆరోగ్య మౌలిక స దుపాయాలను
భవిష్యత్తు లో సంసిద్ధం చేయడానికి
మనం సమయం ఇదే అని గౌరవ ప్రధాన మంత్రి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. భారతీయ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు పెరుగుతున్న తీరు ప్రశంసనీయమని, రాబోయే సంవత్సరాల్లో ఇది తీసుకువచ్చే మార్పులను ప్రపంచం చూస్తుందని‘‘ అన్నారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, ఆసుపత్రి నిర్వహణ కోసం ఈ హాస్పిటల్, ఈ సంజీవని టెలిమెడిసిన్ యాప్ వంటి డిజిటల్ ఇండియా చొరవ కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. తద్వారా ప్రజలు తమ ఇళ్ల నుండి సౌకర్యవంతంగా చికిత్స పొందవచ్చునని అన్నారు.
"వసుధైక కుటుంబం " సూత్రాన్ని అనుసరించి భారతదేశం 219 కోట్లకు పైగా రికార్డ్ బ్రేక్ వ్యాక్సినేషన్ తో మన విస్తారమైన జనాభాకు ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా ఎలా నిర్వహించిందో ప్రపంచం చూసింది. "ప్రపంచం పట్ల కూడా బాధ్యతను భుజాన వేసుకొని, మనం ఇతర దేశాలకు టీకాలను అందించాము, తద్వారా మనం అంతా కలిసి మహమ్మారిని జయించగలము. సురక్షితమైన , సరసమైన ధర లో వ్యాక్సిన్ లు, డయాగ్నోస్టిక్స్ , పరికరాలను సమర్థవంతంగా ఉపయోగించడంతోపాటుగా సురక్షితమైన తాగునీరు , ఆరోగ్యవంతమైన పరిశుభ్రతను పాటించడం అనేవి సార్వత్రిక ఆరోగ్య కవరేజీ , సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు. గతంలో నేర్చుకున్న పాఠాలు అంటువ్యాధులు , అంటువ్యాధులు కాని వ్యాధులతో పోరాడటానికి ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం తప్పనిసరి అని సూచించాయి "అని ఆమె పేర్కొన్నారు.
కాన్ఫరెన్స్ కార్యక్రమం 2030 నాటికి కలరాను అంతం చేయడానికి రోడ్ మ్యాప్, కలరా వ్యాక్సిన్ అభివృద్ధి , వేగవంతమైన రోగనిర్ధారణ, ఎంటరిక్ బ్యాక్టీరియా యాంటీమైక్రోబయల్ నిరోధకత సమకాలీన దృక్పథాలు: కొత్త చొరవలు సవాళ్లు, సిగెల్లా ఎస్ పి పి, ఎపిడెమియాలజీ, భారం, ఇంకా హెపటైటిస్ తో సహా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ లతో సహా ఎంటరిక్ బాక్టీరియా సంక్రామ్యతలతో సహా ఎంటరిక్ ఇన్ఫెక్షన్లు, పోషకాహారం, పాలసీ, ప్రాక్టీస్ లో తాజా సమస్యలపైన , కోవిడ్ మహమ్మారి సమయంలో డయేరియా పరిశోధన గురించి నేర్చుకున్న పాఠాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది.
ఈ సదస్సులో ఆరోగ్య పరిశోధన విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీమతి అను నగర్, పశ్చిమ బెంగాల్ వైద్య విద్య సంచాలకులు ప్రొఫెసర్ (డాక్టర్) దేబాసిస్ భట్టాచార్య, పశ్చిమ బెంగాల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సిద్ధార్థ నియోగి, ఐసిఎంఆర్- ఎన్ ఐసిఇడి డైరెక్టర్ డాక్టర్ శాంతా దత్తా, ఎ ఎస్ సి ఓ డి డి ప్రెసిడెంట్ డాక్టర్ ఫిర్దౌసి ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.
****
(Release ID: 1875375)
Visitor Counter : 204