శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

లైఫ్ సైన్స్ డేటాకు తొలి కేంద్రం ‘ఐ.బి.డి.సి.’ జాతికి అంకితం హర్యానాలోని ఫరీదాబాద్‌లో ప్రారంభించిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్.దేశవ్యాప్తంగా 50కి పైగా లేబరేటరీలనుంచి 200 బిలియన్లకు పైగా జీవాధార ప్రాతిపదికలను సేకరించిన ఐ.బి.డి.సి.
కస్టమైజ్డ్ డేటా సమర్పణ, యాక్సెస్, డేటా విశ్లేషణ సేవలు, ఎప్పటికప్పుడు సార్స్ సి.ఒ.వి.-2 వేరియంట్లపై దేశవ్యాప్త పర్యవేక్షణ.
ప్రభుత్వ నిధులతో నడిచే పరిశోధనా ప్రక్రియలో రూపొందిన మొత్తం దేశవ్యాప్త లైఫ్ సైన్స్ డేటాను ఐ.బి.డి.సి.లో నిక్షిప్తం చేయడం తప్పనిసరి.
అభ్యర్థనల సమర్పణకు వినియోగదారులు support@ibdc.rcb.res.in‌ పోర్టల్ ద్వారా డేటా కేంద్రాన్ని సంప్రదించే అవకాశం.

Posted On: 10 NOV 2022 5:33PM by PIB Hyderabad

   జీవశాస్త్రాల వైజ్ఞానిక సమాచారం (లైఫ్‌సైన్స్ డేటా) కోసం హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్టమొదటి జాతీయ స్థాయి భాండాగారాన్ని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్’ (ఐ.బి.డి.సి.) పేరిట ఈ రిపాజిటరీని ఏర్పాటు చేశారు. కేంద్ర ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ, ప్రధాని కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అంతరిక్ష శాఖ, అణు ఇంధన శాఖలను కూడా జితేంద్ర సింగ్ స్వతంత్ర హోదా సహాయమంత్రిగా పర్యవేక్షిస్తున్నారు.

  https://ci3.googleusercontent.com/proxy/2CcTD6SritHzK0etOeztgtvDSSyruneWmC5KUJyP4unnaLnW_1avhdGkKNgEBj-0yBugHaxiyRWIUTwy0zA0yZPqyvLFax8c3QsMXQXSno8dTIXAPBsitsVVQQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001IK8H.jpg

    ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సమాచార మార్పిడి ద్వారా పరిశోధనను, సృజనాత్మక ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు బయోటెక్-ప్రైడ్ పేరిట ప్రభుత్వం వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం, భారతదేశంలో ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పరిశోధనల్లో రూపొందిన మొత్తం జీవవిజ్ఞాన శాస్త్ర సమాచారాన్ని ఐ.బి.డి.సి. ద్వారా నిక్షిప్తం చేయడం తప్పనిసరి అని అన్నారు. కేంద్ర బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.) మద్దతుతో, ఫరీదాబాద్‌లోని బయోటెక్నాలజీ ప్రాంతీయ కేంద్రం (ఆర్.సి.బి.)లో దీన్ని స్థాపించారు. దీనికి అనుబంధంగా భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్.ఐ.సి.) వద్ద డేటా ‘డిజాస్టర్ రికవరీ’ సైట్‌ను నెలకొల్పారు.

  దాదాపు 4 పెటాబైట్ల సమాచారాన్ని (డేటాను) నిల్వచేయగల సామర్థ్యాన్ని ఐ.బి.డి.సి. కలిగి ఉంది. 'బ్రహ్మ' హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్.పి.సి.) సదుపాయం కూడా ఉంది. గణన-ఇంటెన్సివ్ విశ్లేషణా నిర్వహణలో ఆసక్తి ఉన్న పరిశోధకుల కోసం ఐ.బి.డి.సి. వద్ద గణన మౌలిక సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచారు. వినియోగదారులు తమ అభ్యర్థనలను support@ibdc.rcb.res.in అనే పోర్టల్‌లో సమర్పించడం ద్వారా ఈ డేటా కేంద్రాన్ని సంప్రదించవచ్చు.

  రెండు డేటా పోర్టల్స్ ద్వారా న్యూక్లియోటైడ్ డేటా అందించే సేవలను ఐ.బి.డి.సి.  ప్రారంభించిందని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. 'ఇండియన్ న్యూక్లియోటైడ్ డేటా ఆర్కైవ్ (ఐ.ఎన్.డి.ఎ.)' 'ఇండియన్ న్యూక్లియోటైడ్ డేటా ఆర్కైవ్ - కంట్రోల్డ్ యాక్సెస్ (ఐ.ఎన్.డి.ఎ.-సి.ఎ.)' పోర్టల్ ద్వారా డాటా సేవలను సమర్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. భారతదేశం అంతటా ఉన్న 50కి పైగా ఉన్న పరిశోధనాగారాలనుంచి (రీసెర్చ్ ల్యాబ్‌ల నుంచి) 2,08,055 సమర్పణల ద్వారా 200 బిలియన్ల జీవాధార ప్రాతిపదికలను ఈ  కేంద్రం సేకరించిందని చెప్పారు.

 https://ci6.googleusercontent.com/proxy/Wwjgac3MpRNxmgmv3T45dszbO9Xg5U6jI7s9nwttdLq0hGxAVyrw_HT7-q-ACyV8_cC8Dmss1FJr5o9yGy8ti_8HFTL5OiIQMKjEXFRA8ROANZRJMtT0CmOBVw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00209VP.jpg

    ఇండియన్ సార్స్ సి.ఒ.2 జెనెటిక్స్ కన్షార్షియం (ఇన్‌సాకాగ్) లేబరేటరీలు (https://inda.rcb.ac.in/insacog/statisticsinsacog)  ద్వారా రూపొందిన జన్యుపరమైన నిఘా డేటా కోసం ఆన్‌లైన్‌లో 'డ్యాష్‌బోర్డ్'ను కూడా ఇది అందుబాటులో ఉంచుతుంది. కస్టమైజ్డ్ డేటా సమర్పణ, యాక్సెస్, డేటా విశ్లేషణ సేవలు, భారతదేశం అంతటా ఎప్పటికప్పుడు కోవిడ్ వేరియంట్లపై పర్యవేక్షణను ఈ డాష్‌బోర్డ్ అందిస్తుంది. ఇతర రకాల సమాచారం కోసం, డేటా సమర్పణ, యాక్సెస్ పోర్టల్‌లు ఇంకా రూపకల్పన దశలో ఉన్నాయి. ఇవి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి.

   ప్రాథమికంగా కనుగొనదగిన, యాక్సెస్ చేయగలగిన, అంతర్గతంగా నిర్వహణా సాధ్యమైన పునర్వినియోగం చేయదగిన సూత్రాల ప్రకారం డేటా  మార్పిడి చేసుకోవాలన్న స్ఫూర్తికి ఐ.బి.డి.సి. చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. ఐ.బి.డి.సి.ని మాడ్యులర్ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు.                  కంప్యూటేషనల్ మౌలిక సదుపాయాల గణన తీవ్ర విశ్లేషణ ప్రక్రియలో ఆసక్తి  కలిగిన పరిశోధకుల కోసం కూడా ఐ.బి.డి.సి. మౌలిక సదపాయాలను అందుబాటులో ఉంచారు.  వినియోగదారులు తమ అభ్యర్థనలను support@ibdc.rcb.res.in అనే పోర్టల్‌లో సమర్పించడం ద్వారా  ఈ డేటా కేంద్రాన్ని సంప్రదించవచ్చు.  డేటాను పొందుపరచడంలో వినియోగదారుల సహాయంకోసం ఎప్పటికప్పుడు చర్చాగోష్టులను, పునశ్చరణ కార్యక్రమాలను (https://ibdc.rcb.res.in/news-and-announcement/) ఐ.బి.డి.సి. నిర్వహిస్తుంది.

ఐ.బి.డి.సి.కి సమాచార సమర్పణ కోసం వీడియో ట్యుటోరియల్స్ కూడా డేటా సెంటర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. డేటా సమర్పణ/విశ్లేషణపై ఏదైనా చర్చాగోష్టిని ఏర్పాటు చేయాలంటే డేటా కేంద్రం బృందాన్ని support@ibdc.rcb.res.in పోర్టల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

https://ci4.googleusercontent.com/proxy/Mhpof4YVfq1yEPb6KGFsXO6Tw9u9tp7SsEn5zVZYHx8Bwg_jn_NsCpP_KHkz6mWM8QsZu49abIoV_dNSDVwQagj_RjQbJy7mRbGYaIodavVtNwW_nMF3CDyhsQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003DZI1.jpg

<><><><><>(Release ID: 1875083) Visitor Counter : 239