జల శక్తి మంత్రిత్వ శాఖ

యువ శక్తిని ప్రేరేపించడం, నదులను పునరుజ్జీవింపజేయడం కోసం ప్రజా భాగస్వామ్యం ఇతివృత్తంగా 12వ విడత వెబ్‌నార్ సిరీస్ ని నిర్వహించిన ఎన్ఎంసిజి

Posted On: 09 NOV 2022 4:31PM by PIB Hyderabad

యువ శక్తిని ప్రేరేపించడం, నదులను పునరుజ్జీవింపజేయడం కోసం జాతీయ గంగా ప్రక్షాళన మిషన్ (ఎన్ఎంసిజి) కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, ఏపీఏసి న్యూస్ నెట్వర్క్ సంయుక్తంగా  12వ విడత వెబినార్ సిరీస్ ని నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యం ఇతివృత్తం. 

  • 'జన్ భగీదారి' లేదా ప్రజల భాగస్వామ్యం నమామి గంగే మిషన్‌కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన స్తంభాలలో ఒకటి: డీజీ, ఎన్ఎంసిజి  
  • వెబ్‌నార్ సిరీస్‌లో నీటి సంరక్షణ, నదుల పునరుజ్జీవనం వంటి  ముఖ్యమైన సమస్యలపై యువ తరంతో అనుసంధానం అవ్వడం.
  • గంగా పునరుజ్జీవనంతో ప్రజల భాగస్వామ్యాన్ని అనుసంధానించడానికి  ఎన్ఎంసిజి   ప్రారంభించిన వివిధ కార్యక్రమాలు
  • అర్థ గంగ ప్రాజెక్ట్ ప్రారంభం, దీనిలో "ఆర్థిక వంతెన" ద్వారా ప్రజలు-నది మధ్య సంబంధాలు పటిష్టం 
  • స్వచ్ఛ్ భారత్ మిషన్, క్యాచ్ ద రెయిన్: వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్ మొదలైన ప్రచారాలు విజయవంతం అయ్యేలా  ప్రజాభాగస్వామ్యం కీలకం  
  • మొత్తం గంగా పరీవాహక ప్రాంతంలో సహజ వ్యవసాయం ప్రోత్సాహం 

 

సెషన్‌లో శ్రీ జి. అశోక్ కుమార్ ప్రసంగిస్తూ, నమామి గంగే మిషన్‌లో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమైన మూలస్తంభాలలో ఒకటి అని అన్నారు. "ప్రధానమంత్రి పునరుద్ఘాటించినట్లుగా, జల్ ఆందోళన్‌ను జన్ ఆందోళన్‌గా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు."స్వచ్ఛ్ భారత్ మిషన్, క్యాచ్ ద రెయిన్: ఎక్కడ పడుతుందో, ఎప్పుడు పడుతుందో అక్కడే అప్పుడే ఒడిసి పట్టడం... వంటి ప్రచారాలు విజయవంతమయ్యాయి. ప్రజల భాగస్వామ్యం కారణంగా మాత్రమే ఇది సాధ్యమయింది.. అని అశోక్ కుమార్ స్పష్టం చేశారు. 

నమామి గంగే కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గంగా ఉత్సవ్, గంగా క్వెస్ట్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల మంది గంగా క్వెస్ట్‌లో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, గంగా మిత్రలు, గంగా దూత్‌లు, గంగా ప్రహరీల వంటి వాలంటీర్ల వల్ల మనం గంగా పునరుజ్జీవనం కోసం సామాన్య ప్రజలను కనెక్ట్ చేయగలుగుతున్నామని తెలిపారు 

ప్రధానమంత్రి దృష్టికోణం అనుగుణంగా, గంగా పునరుజ్జీవనంతో ప్రజల భాగస్వామ్యాన్ని అనుసంధానించడానికి ఎన్ఎంసిజి వివిధ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ క్రమంలో, అర్థ గంగ ప్రాజెక్ట్ ఒకటి, దీనిలో "ఆర్థిక వంతెన" ద్వారా ప్రజలు-నదిని స్థాపించారు. “రైతులను ఈ ప్రయత్నానికి అనుసంధానం చేయడానికి, గంగా పరీవాహక ప్రాంతంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో, ఘట్ పర్ యోగా వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా, అవగాహన కల్పిస్తన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఘాట్ పార్ యోగా చొరవలో 10 లక్షలకు పైగా ప్రజల భాగస్వామ్యం మాకు సంతృప్తికరంగా ఉంది.” అని శ్రీ అశోక్ కుమార్ తెలిపారు. 

నాలుగు రోజుల క్రితమే జరుపుకున్న గంగా ఉత్సవ్ ద్వారా, పెద్ద సంఖ్యలో ప్రజలు నదుల పునరుజ్జీవన కార్యక్రమానికి అనుసంధానం చేయగలిగారు. ప్రతినెలా 4వ శనివారం ఢిల్లీలోని యమునా ఘాట్‌లపై నెలవారీ క్లీన్‌నెస్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారని, ఈ నెలలో మరో ముఖ్యమైన రోజుకి ప్రజలు, స్థానిక పట్టణ సంస్థల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఎన్ఎంసిజి సీనియర్ కమ్యూనికేషన్ మేనేజర్ శ్రీ నజీబ్ అహ్సన్ ప్రజల భాగస్వామ్యంపై తన అనుభవాలను పంచుకున్నారు. ఈ రంగంలో తన 25 సంవత్సరాల అపార అనుభవం నుండి మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల మద్దతుతో, ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి సమాజ భాగస్వామ్యం కూడా ఎలా అవసరమో ఆయన గుర్తు చేశారు.  పోలియో నిర్మూలన కార్యక్రమాల ఉదాహరణలను ఉటంకిస్తూ, ఈ కార్యక్రమాల  అధిక విజయవంతమైన రేటుకు ప్రజల భాగస్వామ్యం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. నమామి గంగే కార్యక్రమంలో జన్ గంగ ఒక ముఖ్యమైన భాగం అని ఆయన పేర్కొన్నారు. "జన్ గంగ చాలా ముఖ్యమైన అంశంగా మారింది, ఇది ప్రజలు-నదుల అనుసంధానానికి, మొట్టమొదటిసారిగా, అన్ని వర్గాల వ్యక్తులను ఒకే లక్ష్యంతో అనుసంధానం చేసింది," అని ఆయన అన్నారు, "ఎన్ఎంసిజి కేవలం ఒక నిర్దిష్ట వాలంటీర్‌ గ్రూపుతో  మాత్రమే పనిచేయడం లేదు. కానీ వివిధ సామాజిక సమూహాల అవసరాలను తీర్చడానికి మరియు ఆ స్ప్హూర్తిని ఇంకా పెంచడానికి వివిధ సమూహాలతో వివిధ స్థాయిలలో పని చేస్తుంది. అని ఆయన తెలిపారు. 

నదుల పునరుజ్జీవనం పట్ల ప్రజల భాగస్వామ్యం, అవగాహన పెరగడానికి ప్రజల నుంచే ఆరంభమైన కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఘాట్ పర్ యోగా, గంగా  యమునా హారతి వంటి కార్యకలాపాల ద్వారా, ఈ కార్యక్రమానికి విస్తృతంగా ప్రజల మద్దతు లభించినందున, స్థానిక సంఘాలలో ఒక పరివర్తన తీసుకురాగలిగిందని అన్నారు. నదుల పునరుజ్జీవనం కాలపరిమితితో కూడిన ప్రాజెక్ట్ కాదు, ఎక్కువ కాలం కొనసాగించాల్సిన అవసరం ఉన్నందున నిరంతర భాగస్వామ్యం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. దీనికి నిరంతర సామాజిక మద్దతు అవసరం, వ్యక్తులు, కమ్యూనిటీలు వారి స్థానిక నీటి వనరుల బాధ్యతలను తీసుకోవాలని పిలుపునిచ్చారు  దీని ద్వారా మాత్రమే ఈ ప్రయత్నాన్ని ఎక్కువ కాలం కొనసాగించగలుగుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, భవిష్యత్తు కోసం సానుకూల మార్పు కోసం కృషి చేయాలని ఆయన కోరారు. 

పానిపట్‌లోని గీతా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వికాస్ సింగ్ నీటి నిర్వహణ ప్రాముఖ్యత గురించి వివరించారు. నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి నీటిపారుదల కొత్త మార్గాలను ఆయన ప్రస్తావించారు. రీసైకిల్ చేసిన నీటి వినియోగాన్ని పెంచాలి, తద్వారా పోర్టబుల్ వాటర్‌పై మన ఆధారపడటం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక నీటిపై 5-7% ఆధారపడటాన్ని దేశీయ నీటి ద్వారా భర్తీ చేయవచ్చని ఆయన అన్నారు. రీసైకిల్ చేసిన నీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో, పోర్టబుల్ నీటి నికర అవసరం తగ్గుతుంది. గంగను విజయవంతంగా ప్రక్షాళన చేసేందుకు దాని ఉపనదులపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పారిశ్రామిక, గృహ వ్యర్థాలు నదులను ఎలా కలుషితం చేస్తున్నాయో, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా మన నీటి వనరులలోకి వెళ్లే వ్యర్థాలను మ్యాప్ చేయవచ్చని తెలిపారు. 

 

యువ శక్తిని ప్రేరేపించడం, నదులను పునరుజ్జీవింపజేయడం కోసం ప్రజా భాగస్వామ్యం ఇతివృత్తంగా
 
12వ విడత  వెబ్‌నార్   సిరీస్ కి అధ్యక్షత వహించిన ఎన్ఎంసిజి డైరెక్టర్ జనరల్ శ్రీ జి. అశోక్ కుమారు  

****



(Release ID: 1874852) Visitor Counter : 95


Read this release in: English , Urdu , Hindi