నీతి ఆయోగ్
మార్పుకు ఆదర్శప్రాయులైన మార్గదర్శకులను గౌరవించుకునేందుకు మెంటార్ ఇండియా రౌండ్ టేబుల్‌ను నిర్వహించిన అటల్ ఇన్నొవేషన్ మిషన్
Posted On:
09 NOV 2022 5:26PM by PIB Hyderabad
మార్పు కోసం మార్గదర్శకులు (మెంటార్స్ ఆఫ్ ఛేంజ్ - ఎంఒసి)గా అగ్రశ్రేణిలో ఉన్న 35 ఆదర్శప్రాయులు చేసిన కృషిని గుర్తించేందుకు అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం), నీతీ ఆయోగ్, మెంటార్ ఇండియా రౌండ్ టేబుల్ సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా దేశం నలుమూలల నుంచి అగ్ర మార్గరద్శకులను ఆహ్వానించారు.
అటల్ టింకరింగ్ లాబ్స్‌లో (ఎటిఎల్)లోని విద్యార్ధులను, స్టార్టప్ లకు మార్గదర్శకం చేసేందుకు వృత్తి నిపుణులు, విద్యావేత్తలు, పారిశ్రామిక నిపుణులను కలుపుకుపోయేందుకు ఎఐఎం, నీతీ ఆయోగ చేపట్టిన వ్యూహాత్మక జాతీయ నిర్మాణ చొరవ మెంటార్ ఇండియా. ఈ వృత్తినిపుణులు ఎటిఎల్‌లలో ఆవిష్కరణను, వ్యవస్థాపకత కార్యకలాపాలకు సౌలభ్యం కల్పిస్తూ, భారతదేశంలో నవీనమైన ఆవిష్కర్తలుగా కొత్త తరాన్ని మలుస్తారు.
నీతిఆయోగ్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా జెమ్స్ ఆఫ్ మెంటార్ ఇండియా అనే లఘుపుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం, పాఠశాల విద్యార్ధులలో దిద్దుబాటును పెంపొందించడానికి మార్గదర్శకులు అనుసరిస్తున్న ఉత్తమ ఆచరణలను వివరిస్తుంది.
మెంటార్ ఇండియా సమాజ తోడ్పాటుతో, అటల్ టింకరింగ్ లాబ్ ప్రతిష్ఠాత్మక టింకర్‌ప్రెన్యూర్ అన్న బూట్‌క్యాంప్ (కఠిన క్రమశిక్షణతో కూడిన శిబిరం) కింద విద్యార్ధులు ప్రతి ఏడాది తమ డిజిటల్ ఉత్పత్తిని అభివృద్ధి చేసేందుకు సాంకేతిక, వ్యవస్థాపకత నైపుణ్యాలను ఆర్జిస్తారు.
టింకర్ ప్రెన్యూర్ కింద ప్రతిఏడాది అత్యుత్తమ 100మంది విద్యార్ధులు ప్రతిష్థాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) నుంచి ఎఐఎం సహకారంతో నిర్వహించే అటల్ కాటలిస్ట్ కార్యక్రమంలో 8 నెలల పాటు మార్గదర్శకత్వాన్ని, సలహాలను అందుకుంటారు. గత ఏడాది, అగ్ర శ్రేణి 20మంది విద్యార్ధులకు తమ ఐడియాలను పెట్టుబడిదారుల ముందు ఉంచే అవకాశం రాగా, అందులో 10మంది ప్రోటోటైప్ (మూలరూపం/ నమూనా)ను అభివృద్ధి చేసేందుకు నిధులు అందుకున్నారు. ఈ 20మంది విద్యార్ధుల విజయాన్ని గుర్తించేందుకు సూక్ష్మబుద్ధిగల టింకర్‌ప్రెన్యూర్స్ పేరుతో ఒక కాఫీ టేబుల్ పుస్తకాన్ని మెంటార్ ఇండియా రౌండ్ టేబుల్ సందర్భంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎఐఎం టింకర్‌ప్రెన్యూర్ చొరవ గురించి మాట్లాడుతూ, ఈ నిర్ధిష్ట ప్రచారంలో ఆడపిల్లలు ముందు వరుసలో ఉండటం అద్భుతంగా ఉందని నీతీ ఆయోగ్ సిఇఒ శ్రీ పరమేశ్వరన్ అయ్యర్ అన్నారు. వారు ఇతర రంగాలలో కూడా ఇలాగే ముందంజలో ఉన్నారని భావిస్తున్నానని పేర్కొన్నారు.
మెంటార్ ఇండియా కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం పట్ల సంతోషిస్తున్నాను, మా అగ్రజాబితాలో చేరిన మార్గదర్శకులందరినీ నేడు అభినందిస్తున్నాను, అని ఆయన అన్నారు.
మా మార్గదర్శకులు విద్యార్ధులకు మార్గదర్శకత్వం చేసేందుకు, ముఖ్యంగా గత 12 నెలల్లో మహమ్మారి నుంచి పాఠశాలలు బయిటపడేందుకు, సాధారణ పరిస్థితులకు వచ్చాక భౌతికంగానూ, దృశ్యమాధ్యమం ద్వారాను టింకరింగ్, అధ్యయనం కొనసాగేందుకు విశిష్టమై నిబద్ధతను చూపారని అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం), నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మేం వారికి కృతజ్క్షతలు చెప్పగలగడమే కాక, వారిని మరింతగా తెలుసుకునే అవకాశాన్ని పొంది, టింకరింగ్, ఆవిష్కరణ, వ్యవస్థాపకత స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళే గొప్ప పనిని చేసేందుకు ప్రేరణ కలిగించగలుగుతున్నాం.
ఈ కార్యక్రమంలో ప్రముఖ భారతీయ అథ్లీట్ అంజు బాబీ జార్జ్, ఐ-వెంచర్ ఫ్యాకల్టీ డైరెక్టర్, ఐఎస్‌బి ప్రొఫెసర్ భగవాన్ చౌదరి పాలుపంచుకున్నారు. వారు మార్గదర్శకులను, విద్యార్ధులను అభినందించి, తమ స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఎప్పుడూ ముందంజలో ఉండాలని అన్నారు.
అదనంగా, 5ఐఆర్ఇ- బ్లాక్ చెయిన్ యూనికార్న్ సిఇఒ ప్రతీక్ గౌరి, 5ఐఆర్ఇ సిఎంఒ, నెట్‌వర్క్ కాపిటల్ సిఇఒ ఉత్కర్ష్ అమితాబ్, ఆస్పైర్ ఫర్ హర్ వ్యవస్థాపకురాలు మధురా దాస్ గుప్తా సిన్హా, ఓపెన్ సీక్రెట్ సిపిఒ అభిలాష సిన్హా, ఒన్నివేషన్ వెంచర్స్ వ్యవస్థాపకులు, సిఇఒ సాకేత్ అగర్వాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై, పలు వర్క్‌షాప్‌లను నిర్వహించారు.
***
(Release ID: 1874849)
Visitor Counter : 152