గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

అందరికీ రవాణా సవాల్ రెండవ దశ ట్రాన్స్ పోర్ట్ స్టేజ్-2 , సిటిజన్ పర్సెప్షన్ సర్వే-2022 లను ప్రారంభించిన ఎం ఓ హెచ్ యు ఎ


46 భాగస్వామ్య నగరాల్లో రవాణా సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ట్రాన్స్ పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ రెండవ దశలో స్స్టార్టప్ లకు అవకాశం .

తమ నగరం గురించి పౌరుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించేందుకు 264 నగరాల కోసం ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2022 కింద సిటిజన్ పర్సెప్షన్ సర్వే ప్రారంభం

Posted On: 09 NOV 2022 4:15PM by PIB Hyderabad

గృహ నిర్మాణ , పట్టణ వ్యవహారాల శాఖ (ఎం ఓ హెచ్ యు ఎ) మంత్రి  శ్రీ హర్దీప్ ఎస్ పూరి ఈ రోజు ఒక ఆన్ లైన్ కార్యక్రమంలో  - అందరికీ రవాణా సవాల్ రెండవ దశ, సిటిజెన్ పర్సెప్షన్ సర్వే 2022 ను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి శ్రీ. మనోజ్ జోషి, కార్యదర్శి, ఎం ఓ హెచ్ యు ఎ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, కేంద్ర, రాష్ట్ర , నగర పాలక సంస్థల ఇతర అధికారులు , భాగస్వామ్య సంస్థలు ఇతర భాగస్వాములకు చెందిన ముఖ్య కీలక అధికారులు హాజరయ్యారు. భాగస్వామ్య సంస్థల ద్వారా ఛాలెంజ్ ప్రక్రియ , సిటిజన్ పర్సెప్షన్ సర్వే విధివిధానాల గురించి ప్రజంటేషన్ లు ఇచ్చారు.

 

ట్రాన్స్ పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ స్టేజ్-2

 

ట్రాన్స్ పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ అనేది భారత ప్రభుత్వ గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చొరవ, ఇది పౌరులకు రవాణా సౌలభ్యం పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఛాలెంజ్ డిజిటల్ సృజనాత్మకతపై దృష్టి సారిస్తుంది.  పౌరులందరి రవాణా అవసరాలను మెరుగ్గా నెరవేర్చడానికి సంప్రదాయ , అనధికారిక ప్రజా రవాణాను మెరుగుపరచడానికి సందర్భోచిత డిజిటల్ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో చేతులు కలపడానికి నగరాలు, పౌరులు , ఆవిష్కర్తలను ఆహ్వానిస్తుంది.

 

మూడు దశల ఛాలెంజ్

 

ట్రాన్స్ పోర్ట్ ఫర్ ఆల్ త్రూ డిజిటల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో మూడు దశలుంటాయి:

 

● మొదటి దశ - సమస్యను గుర్తించడం: నగరాలు, స్వచ్ఛంద సంస్థల మద్దతుతో, పౌరులు , ప్రజా రవాణా ఆపరేటర్లు ఎదుర్కొంటున్న కీలక పునరావృత సమస్యలను గుర్తిస్తాయి.

 

 

● రెండవ దశ- పరిష్కారాల అభివృద్ధి (సొల్యూషన్ జనరేషన్): నగరాలు,  స్వచ్ఛంద సంస్థల నుంచి ఇన్ పుట్ లతో ప్రజా రవాణాను మెరుగుపరచడానికి స్టార్టప్ లు పరిష్కారాల ప్రోటోటైప్ లను అభివృద్ధి చేస్తాయి.

 

 

● మూడవ దశ-స్ పైలట్ టెస్టింగ్: నగరాలు పెద్ద ఎత్తున ప్రయోగాత్మకాల (పైలట్ల) కోసం స్టార్టప్ లను నిమగ్నం చేస్తాయి.  పౌరుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా పరిష్కారాలను మెరుగు పరుస్తాయి.

 

మరింత సమాచారం కోసం సందర్శించండి: www.transport4all.in

For more information visit: www.transport4all.in

 

ఛాలెంజ్ లో భాగంగా అభివృద్ధి చేయబడ్డ పరిష్కారాలు సాధ్యమైన, వాంఛనీయమైన చోట ప్రజా రవాణా సాధారణ , అనధికారిక విధానాలను ఇంటిగ్రేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ పరిస్థితులు ఉన్న నగరాల్లో నివసిస్తున్న పౌరుల అవసరాలను తీర్చే సామర్థ్యాన్ని ప్రదర్శి౦చే పరిష్కారాలు దేశమ౦తటా ఎ౦పిక చేయబడిన నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబడతాయి.

 

ఏప్రిల్ 15, 2021 న ప్రారంభించిన ఈ ఛాలెంజ్ స్టేజ్ 1 కోసం 130 కి పైగా నగరాలు నమోదు చేసుకున్నాయి. 100 నగరాలు ప్రధాన ప్రభుత్వ భాగస్వాములు రవాణా రంగంలో పనిచేస్తున్న సంస్థలతో పాటు విద్యా సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు , ఐపిటి యూనియన్లతో ఒక ట్రాన్స్ పోర్ట్ ఫర్ ఆల్ టాస్క్ ఫోర్స్ (టిటిఎఫ్) ను ఏర్పాటు చేశాయి.

 

ఈ నగరాలు  రెండు లక్షలకు పైగా పౌరులు, 15,000 మంది బస్సు డ్రైవర్లు,  కండక్టర్లు , 22,000 మంది అనధికారిక ప్రజా రవాణా (ఆటోలు మొదలైనవి) డ్రైవర్లతో సర్వేలను విజయవంతంగా నిర్వహించాయి, ఇది దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా డేటా ప్రక్రియగా నిలిచింది.

ఛాలెంజ్ స్టేజ్ 2కు అర్హత సాధించిన 46 నగరాలు 165 కంటే ఎక్కువ సమస్యా ప్రకటనలను అభివృద్ధి చేయడానికి సర్వే లో కనుగొన్న వాటిని ఉపయోగించాయి, ఇది ఇప్పుడు ఛాలెంజ్ బృందం ద్వారా 8 సమస్యా ప్రకటనల తుది జాబితాలో (అనుబంధం-1 వద్ద నగరాల జాబితా) చేర్చబడింది.

 

నగరాలు గుర్తించిన సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి స్టార్టప్ లకు ఛాలెంజ్ స్టేజ్ -2 తెరిచి ఉంది. ఆసక్తిగల స్టార్టప్ లు స్టార్టప్ ఇండియా పోర్టల్ లో తమ ఐడియా పిచ్ లతో రిజిస్టర్ చేసుకోవచ్చు.

 

ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ పోర్టేషన్ అండ్ డెవలప్ మెంట్ పాలసీ (ఐటిడిపి) సహ-హోస్ట్ , ఛాలెంజ్ కోఆర్డినేటర్ గా, వర్డ్ బ్యాంక్ నాలెడ్జ్ పార్టనర్ గా, స్టార్టప్ ఇండియా , సిటీ ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్ టెక్నాలజీ భాగస్వాములుగా , అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్ (ఎఎస్ ఆర్ టియు) సిటీ ఎంగేజ్మెంట్ భాగస్వామి గా ట్రాన్స్ పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ ను నిర్వహిస్తున్నారు.

 

సిటిజన్ పర్సెప్షన్ సర్వే 2022 (ఈజ్ ఆఫ్ లివింగ్ అసెస్ మెంట్ లో భాగంగా)

 

ప్రధాన రంగాలలో క్రాస్-సిటీ ఫలితాల ఆధారంగా నగరాల పారదర్శక , సమగ్ర మదింపును చేపట్టడానికి చొరవగా ఎం ఓ హెచ్ యు ఎ ఏప్రిల్, 2022 లో పట్టణ ఫలితాల ఫ్రేమ్ వర్క్ 2022 ను ప్రారంభించింది. ఈ ఫ్రేమ్ వర్క్ లో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మూడవ రౌండ్ కూడా ఉంది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, 360-డిగ్రీల మదింపుగా, జీవన నాణ్యత, ఆర్థిక సామర్థ్యం , సుస్థిరత ఆధారంగా భారతదేశం అంతటా నగరాలను మదింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో భాగంగా సిటిజన్ పర్సెప్షన్ సర్వే (ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కింద 30% మార్కులను కలిగి ఉంటుంది) నిర్వహిస్తున్నారు. ఇది మదింపు అభ్యాసంలో చాలా ముఖ్యమైన భాగం, ఎందుకంటే ఇది నగర జీవన సామర్థ్యానికి సంబంధించి పౌరుల ఫీడ్ బ్యాక్ ని నేరుగా సంగ్రహించడంలో సహాయపడుతుంది. ప్రజారవాణా, విద్యా సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ సేవలు, నీటి లభ్యత, జీవన వ్యయం, ఉపాధి అవకాశాలు సహా తమ నగరాల్లోని వివిధ అంశాల గురించి పౌరులు ఎలా భావిస్తారో ఈ అభిప్రాయాలు ప్రధానంగా వివరిస్తాయి. ఆన్ లైన్ , ఆఫ్ లైన్ రెండింటిలోనూ నిర్వహించబడుతున్న ఈ సర్వే, 2022 నవంబర్ 9 నుంచి ప్రారంభమైంది.  23 డిసెంబర్ 2022 వరకు కొనసాగుతుంది. ముఖాముఖి ఇంటర్వ్యూలతో కూడిన ఆఫ్ లైన్ వెర్షన్ ను ఆన్ లైన్ సర్వేతో సమాంతరంగా నిర్వహిస్తారు. సిటిజన్ పర్సెప్షన్ సర్వే 2020 లో మొదటిసారి నిర్వహించబడింది.  ఇది 16 లక్షల ప్రతిస్పందనలను కలిగి ఉంది, సర్వేలో పాల్గొన్న 111 నగరాల్లో నివసిస్తున్న 32 లక్షల మందికి పైగా పౌరుల నుండి ప్రతిస్పందనను పొందగలిగారు. దేశ వ్యాప్తంగా 21 లక్షల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను పరిశీలించి,

ప్రతిబింబించే లక్ష్యంతో ఈ సంవత్సరం 264 నగరాలలో ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనే 264 నగరాలకు చెందిన పౌరులు (అనుబంధం II) ఈ క్రింది లింక్ పై తమ ఫీడ్ బ్యాక్ ను సమర్పించాలని అభ్యర్థించారు: https://eol2022.org/

 

నగరాలు సిటిజెన్ పర్సెప్షన్ సర్వేను చురుకుగా ప్రోత్సహిస్తాయి.  సృజనాత్మక వ్యూహాలను అవలంబించడం ద్వారా తమ నగర ఫీడ్ బ్యాక్ ను పంచుకోవడానికి గరిష్ట పౌరులను నిమగ్నం చేస్తాయి. అత్యుత్తమ నిర్వహణ కనబరిచిన నగరాలకు 'సిటీ ఎంగేజ్ మెంట్ అవార్డు' కింద రివార్డులు ఇవ్వబడతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయుఎ) తన ఏజెన్సీ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ) తో కలిసి ఈ కార్యక్రమాన్ని యాంకరింగ్ చేస్తోంది, వారు ఈ అభ్యాసాన్ని చేపట్టడంలో ఎం ఓ హెచ్ యు ఎ కు మద్దతు ఇస్తున్నారు.

 

*****



(Release ID: 1874840) Visitor Counter : 139


Read this release in: English , Urdu , Hindi