మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

‘బాలల హక్కులు: తెలంగాణలో సమకాలీన సవాళ్లు’ అనే అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించిన ఎన్ సిపీసీర్ .


"చట్టాలు మాత్రమే బాలల హక్కులు రక్షించలేవు, సమాజ ఆలోచనా విధానం మారాలి": తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్

Posted On: 09 NOV 2022 5:16PM by PIB Hyderabad

బాలల హక్కుల అక్షరాస్యతను వ్యాప్తి చేయడం కోసం 'బాలల హక్కులు: తెలంగాణలో సమకాలీన సవాళ్లు' అనే అంశంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈరోజు హైదరాబాద్‌లో ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమాన్ని దీనిని తెలంగాణ గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.

కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పూల లాంటి పిల్లలను ప్రేమగా, శ్రద్ధగా చూడాలని అన్నారు. “పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు హృదయాన్ని కలచి వేస్తున్నాయి. కేవలం చట్టాల ద్వారా మాత్రమే పిల్లలను రక్షణ లభించదు. సమాజపు ఆలోచనా విధానం మారినప్పుడు మాత్రమే రక్షణ కలుగుతుంది." అని , డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఆంక్షలు, విధించకుండా స్వేచ్ఛగా జీవించడానికి పిల్లలకు అవకాశం ఇచ్చి వారిని తీర్చిదిద్దాలని సూచించారు. "సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ప్రగతిశీల సమాజానికి పునాది" అని గవర్నర్ వ్యాఖ్యానించారు. 

వర్క్‌షాప్‌లో ఈ క్రింది అంశాలు చర్చకు వచ్చాయి. :

• పిల్లలకు సంబంధించిన సమస్యలను సకాలంలో గుర్తించడం.

• ఇళ్లలో పిల్లలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం.

• సంబంధిత వర్గాలతో కలిసి పనిచేసి సమాచారాన్ని పంచుకోవడం 

• ఎంఏఎస్ఐ పోర్టల్ ను సమర్ధంగా ఉపయోగించుకోవడం 

• పిల్లలకు సైబర్ భద్రత కల్పించే అంశానికి సంబంధించిన కొత్తగా ఎదురవుతున్న సమస్యలు.

• పిల్లల అక్రమ రవాణా కేసులు, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, అవసరమైన చర్యలు అమలు జరిగేలా చూడడం 

ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికతను పిల్లలు పాఠశాల ఆన్‌లైన్ తరగతులకు మాత్రమే కాకుండా వినోదం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పిల్లలకు సురక్షితమైన అభ్యాస వాతావరణాన్ని అందించాల్సి ఉన్న భాద్యత కలిగి ఉన్న ప్రభుత్వం డిజిటల్ రంగంలో కూడా బాధ్యత స్వీకరించాల్సి ఉంటుంది. ఎన్‌సిఆర్‌బి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) 2021 సమాచారం ప్రకారం భారతదేశంలో పిల్లలపై సైబర్ నేరాలకు సంబంధించి మొత్తం 1081 కేసులు నమోదయ్యాయి.వీటిలో కర్ణాటకలో 164 కేసులు నమోదయ్యాయి. కేరళలో 138, ఆంధ్రప్రదేశ్ లో 40, తమిళనాడులో 15, తెలంగాణలో 3 కేసులు నమోదయ్యాయి.పాఠశాలల్లో పిల్లల సంరక్షణ మరియు భద్రతపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాలు సిద్ధం చేసింది.పాఠశాలలు/విద్యా సంస్థలు అమలు చేయాల్సి ఉన్న భద్రతా ప్రమాణాలను అర్థం చేసుకోవడానికి రాష్ట్ర/జిల్లా అధికారులు, పాఠశాల నిర్వహణ సంస్థలు , ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వంటి వివిధ వర్గాల నుంచి తరచుగా వినిపిస్తున్న ప్రశ్నలు మరియు చెక్‌లిస్ట్ కు సంబంధించిన వివరణ కూడా మార్గదర్శకాల్లో పొందుపరచడం జరిగింది. పిల్లల సంరక్షణ సంస్థలను (CCI) పర్యవేక్షించడానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యాప్ ఆధారిత ‘మానిటరింగ్ యాప్ ఫర్ సీమ్‌లెస్ ఇన్‌స్పెక్షన్’ (MASI) అనే పరికరాన్ని అభివృద్ధి చేసింది.ఈ యాప్ ను ఉపయోగించి అధికారులు తమ అధికార పరిధిలో ఉన్న పిల్లల సంరక్షణ సంస్థలు పనితీరును సులువుగా తనిఖీ చేయడానికి అవకాశం కలుగుతుంది. ఈ సాధనం ద్వారా పిల్లల సంరక్షణ సంస్థల తనిఖీకి సంబంధించిన ఆన్‌లైన్ లైవ్ డేటా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా పిల్లలను వారి ఇళ్లకు తిరిగి పంపించడానికి వారి కదలికల ఆధారంగా తదుపరి సందర్శనకు మొదటి తనిఖీ సందర్శన తర్వాత చేసిన మెరుగుదల ట్రాక్ చేయడానికి వీలవుతుంది . వర్క్‌షాప్‌లో పిల్లల అక్రమ రవాణా అంశం కూడా చర్చకు వచ్చింది.

ముందుగా సభకు స్వాగతం పలికిన ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి మరియు కమిషనర్ శ్రీమతి. డి. దివ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన పిల్లల ఎదగడానికి సురక్షితమైన మరియు పోషకమైన వాతావరణం కల్పించేలా చూడడానికి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో సంబంధిత వర్గాలు సహకరించాలని అన్నారు.హింసకు గురవుతున్న మహిళలు మరియు పిల్లలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బాల రక్షక వాహనాలు, భరోసా సెంటర్లు, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు (ఎఫ్‌టిఎస్‌సి), పోక్సో కోర్టులు మొదలైన కార్యక్రమాలను ఆమె వివరించారు. 

వర్క్‌షాప్‌ నిర్వహణకు స్వచ్చంద సేవా సంస్థ భారత్ నీతి సహకారం అందించింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు, న్యాయవాదులు, బాలల హక్కుల రంగంలో పనిచేస్తున్న ఎన్‌జిఓలు, పాఠశాల ప్రిన్సిపాల్స్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సైబర్ నేరాలు మరియు నివారణపై ఓరియంటేషన్, చైల్డ్ ట్రాఫికింగ్‌పై సదస్సు మరియు MASI యాప్ ఓరియంటేషన్ కార్యక్రమం వంటి కార్యకలాపాలు రోజంతా వర్క్‌షాప్‌లో నిర్వహించారు. 

 

***



(Release ID: 1874800) Visitor Counter : 218


Read this release in: English , Urdu , Hindi