నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశీయ పర్యాటకం పరివర్తన చెందుతున్న నేపథ్యంలో వెల్నెస్, ఇతర కార్యకలాపాలు కీలక తోడ్పాటుగా నూతన నైపుణ్యాలు అవసరంః ఎంఒఎస్ రాజీవ్ చంద్రశేఖర్
పట్నిటాప్‌ను ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా రూపొందించేందుకు రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయవలసిందిగా హోటల్ పరిశ్రమ నాయకులకు విజ్ఞప్తిః ఎంఒఎస్ చంద్రశేఖర్
సవ్చ్ఛ మిషన్‌ను ముందుకు తీసుకువెడుతూ పట్నిటాప్‌లో పారిశుద్ధ్య డ్రైవ్‌ను ప్రారంభించిన ఎంఒఎస్
Posted On:
08 NOV 2022 7:45PM by PIB Hyderabad
దేశీయ టూరిజం రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని, అవి సంక్షేమం, ఆరోగ్యసంక్షేమం సహా సాహసోపేత కార్యకలాపాలు, క్రీడల పై కేంద్రీకృతం అయ్యి వైవిధ్యభరితమైన నైపుణ్యాలు, అవకాశాలకు డిమాండ్‌ను ప్రేరేపిస్తోందని పట్నిటాప్‌లో హోటల్ పరిశ్రమ నాయకులతో మంగళవారం సమావేశమైన సందర్భంలో కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి, వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్& ఐటి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్థానిక వనరులను, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పట్నిటాప్‌ను సచేతనమైన పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు రోడ్‌మ్యాప్‌ను తయారుచేయవలసిందిగా మంత్రి వారికి విజ్ఞప్తి చేశారు.
రోడ్ ట్రిప్‌లు, తక్కువ జనం పర్యటించే ప్రాంతాలు, స్వల్పకాలిక కిరాయి లేదా స్టే ఎట్ హోం (ఇంట్లో ఉండే) సౌకర్యాలు ఇప్పుడు రివాజు అయ్యాయని , కనుక హోటల్ పరిశ్రమ ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రదేశానికి అవసరమైన ఇతివృత్తాన్నినిర్ణయించాలని ఆయన అన్నారు. పర్యాటకం అనేది మానవ అనుసంధానికి సంబంధించింది. పట్నిటాప్‌ను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి వనరులను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసి, అంచనా వేసి, అందుబాటులో ఉన్న లేదా అవసరమైన నైపుణ్యాలను పర్యాటక సోదరులు తప్పనిసరిగా కృషి చేయాలన్నారు.
స్థానిక ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి మోడీ ఉద్ఘాటనను నొక్కి చెప్తూ, స్థానిక హస్తకళాకారులను మార్కెట్ కు అనుసంధానం చేయడంలో స్వయం సహాయక బృందాలు భారీ పాత్రను పోషించగలవని శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
గత ఏడాది మనం ఎగుమతి చేసిన హస్తకళాఖండాలు 2 బిలియన్ డాలర్ల విలువైనవని, ఇందులో అత్యధికంగా ఇ-కామర్స్ వేదికల నుంచి జరిగినవేనన్నారు. హస్తకళాకారుడికి వ్యక్తిగతంగా సహాయం తోడ్పడేందుకు స్వయం సహాయక బృందాలు మార్కెట్ అందుబాటులోకి రావడానికి ఒక వారధిగా వ్యవహరించవచ్చని మంత్రి చెప్పారు.
పట్నిటాప్‌ను అభివృద్ధి చేసందుకు తమ భావనలను వ్యక్తీకరించిన విద్యార్ధులను, పర్యాటక క్లబ్బుల సభ్యులను మంత్రి కలిశారు. ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విద్యార్ధులతో మరొక సమావేశంలోప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూతన భారత దార్శనికత గురించి, ఎలక్ట్రానిక్స్/ సెమికాన్ మాన్యుఫాక్చరింగ్, డిజైన్ విభాగాలలో అందుబాటులో ఉన్న మహత్తరమైన అవకాశాల గురించి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడారు.
ఉదయం శ్రీ రాజీవ్ చంద్రశఖర్ పట్నిటాప్‌లో పారిశుద్ధ్య డ్రైవ్‌ను ప్రారంభించి, రమణీయమైన పర్యాటక పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా ఉంచవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆయన స్వయం సహాయక బృందాల ప్రతినిధులతో సమావేశమై, వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి, మార్కెట్ లంకెలకు, సామర్ధ్య నిర్మాణంకు అందుబాటులో ఉన్న అవకాశాలను గురించి చర్చించారు. ఆయన పిఆర్ఐల ప్రతినిధులను కూడా కలిసి, వారి సమస్యలను, సవాళ్ళను తెలుసుకున్నారు.
అనంతరం జమ్మూలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను, రీజియనల్ డైరెక్టొరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంట్రప్రెన్యూర్‌షిప్, జమ్మును సందర్శించారు. ఆయన ఆ సముదాయంలో ఉన్నకంప్యూటర్ సాఫ్ట్‌వర్ అప్లకేషన్ ప్రయోగశాల సహా విభిన్న విభాగాలకు వెళ్ళి, అక్కడ శిక్షణ పొందుతున్నవారు, సిబ్బందితో ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్, జమ్ముకాశ్మీర్ డైరెక్టర్ శ్రీ సుదర్శన్ కుమార్, ప్రాంతీయ డైరెక్టర్ శ్రీ ఎస్. సంతిమనలన్, ఎన్‌టిఎస్ఐ, శ్రీనగర్ ప్రిన్సిపల్ శ్రీ వి.కె. సక్సేనా కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 1874606)
Visitor Counter : 198