పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ప్రతికూల గాలి నాణ్యతా పరిస్థితిని ఎదుర్కోవడానికి జి ఆర్ ఎ పి ఆర్ సవరణ
వాయు కాలుష్యానికి ప్రధాన, స్థిరమైన వనరుగా ఉన్న సి అండ్ డి కార్యకలాపాల నుండి వెలువడే ధూళి
ఎన్ సి ఆర్ లోని అన్ని సి అండ్ డి
ప్రాజెక్ట్లు తగిన సంఖ్యలో యాంటీ స్మాగ్ గన్ లను మోహరించాలని సి ఎ క్యు ఎం ఆదేశం
స్టేజ్ I నుంచి సి అండ్ డి సైట్ ల వద్ద యాంటీ స్మాగ్ గన్ లను ఉపయోగించాలని రివైజ్డ్ జి ఆర్ ఎ పి పిలుపు
Posted On:
07 NOV 2022 6:15PM by PIB Hyderabad
కన్ స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్(సి అండ్ డి ) కార్యకలాపాల ప్రదేశాల నుంచి ఉత్పన్నమయ్యే ధూళిని తగ్గించడానికి, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సి ఆర్) మొత్తం గాలి నాణ్యతను మరింత మెరుగుపరచడానికి చర్యలను తీవ్రతరం చేయడం లో భాగంగా ఎన్ సిఆర్ , దాని పరిసర ప్రాంతాల్లో అన్ని సి అండ్ డి ప్రాజెక్టులు, ప్రాజెక్ట్ మొత్తం నిర్మాణ విస్తీర్ణానికి అనుగుణంగా తగిన సంఖ్యలో యాంటీ-స్మోగ్ గన్ లను మోహరించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ (సిఎక్యూఎమ్) ఆదేశించింది. ఆయా జిల్లాల్లోని వివిధ సి అండ్ డి ప్రదేశాలలో ఏర్పాటు చేసిన యాంటీ స్మోగ్ గన్ లను నిరంతరం, సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చూడాలని ఎన్ సి ఆర్ కు చెందిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు (ఎస్పీసీబీలు), ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ)లను కూడా ఆదేశించారు.
కమిషన్ ఇటీవలి చట్టబద్ధమైన నిర్దేశం ప్రకారం , అన్నిసి అండ్ డి సైట్ లు కూడా నిర్మాణ ప్రాంతం ఆధారంగా దిగువ పేర్కొన్న కొలమానం ప్రకారం, తగిన సంఖ్యలో యాంటీ స్మోగ్ గన్ లను మోహరించాలి:
*5000 – 10,000 చదరపు మీటర్ల మధ్య మొత్తం నిర్మాణ ప్రాంతానికి కనీసం 1.
*10,001 – 15,000 చదరపు మీటర్ల మధ్య మొత్తం నిర్మాణ ప్రాంతానికి కనీసం 2.
*15,001 – 20,000 చదరపు మీటర్ల మధ్య మొత్తం నిర్మాణ ప్రాంతానికి కనీసం 3.
*20,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ మొత్తం నిర్మాణ ప్రాంతానికి కనీసం 4.
సి అండ్ డి కార్యకలాపాల నుండి వచ్చే ధూళి వాయు కాలుష్యానికి ప్రధానమైన స్థిరమైన వనరు గా ఉంది. ఎన్ సి ఆర్ లో పి ఎం 2.5 , పి ఎం 10 స్థాయిలలో స్పైక్ కు ఇది ప్రతికూలంగా దోహదపడుతోంది.
నిర్దేశిత వెట్ సప్రెషన్ , విండ్ బ్రోకర్ లు, డస్ట్ బారియర్ స్క్రీన్ లు, నిర్మాణ సామగ్రి, సి అండ్ డి శకలాల కవరింగ్, కవర్ చేయబడ్డ వాహనాల ద్వారా రవాణాతో సహా సి అండ్ డి వ్యర్థాలను సరిగ్గా పారవేయడం ద్వారా సి అండ్ డి సైట్ ల వద్ద ఉత్పత్తి అయ్యే ధూళిని తగ్గించడం కోసం శుద్ధి చేయబడ్డ నీటిని ఉపయోగించడం అనేది ఎన్ సిఆర్ లోని సి అండ్ డి ప్రాజెక్ట్ లు తప్పనిసరిగా అనుసరించాల్సిన కొన్ని చర్యలు.
ఎన్ సి ఆర్ లో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి కమిషన్ 2022 జూలైలో సమగ్ర విధానం రూపొందించింది.
ధూళిని తగ్గించడానికి సి అండ్ డి కార్యకలాపాల నిర్వహణ దిశగా, సి అండ్ డి ప్రాజెక్ట్ సైట్ లలో తగిన సంఖ్యలో యాంటీ స్మోగ్ గన్ లను మోహరించడాన్ని ఈ విధానం నిర్దేశించింది.ఇది కాకుండా, మొత్తం ఎన్ సి ఆర్ లో శీతాకాలంలో సాధారణంగా ప్రబలంగా ఉండే ప్రతికూల గాలి నాణ్యత పరిస్థితిని ఎదుర్కోవటానికి సవరించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్ఎపి) నిర్మాణ సైట్లలో యాంటీ-స్మోగ్ గన్స్ ఉపయోగించడానికి మార్గదర్శకాలను అమలు చేయాలని కూడా స్పష్టం చేసింది.
*****
(Release ID: 1874583)
Visitor Counter : 227