రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భార‌తీయ నావికాద‌ళ సోనార్ వ్య‌వ‌స్థ‌ల కోసం ప‌రీక్ష‌& మూల్యాంక‌న స‌దుపాయాన్ని ప్రారంభించిన డిఆర్‌డిఒ


కొచ్చిలోని ఎన్‌పిఒఎల్ లో హ‌ల్ మాడ్యూల్ ఆఫ్ స‌బ్‌మెర్సిబుల్ ప్లాట్‌ఫాం ఫ‌ర్ అకాస్టిక్ క్యారెక్ట‌రైజేష‌న్‌& మూల్యాంక‌నం కోసం స‌దుపాయం పేరుతో ప్రారంభమైన కార్య‌క‌లాపాలు

Posted On: 07 NOV 2022 6:06PM by PIB Hyderabad

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌, మేక్ ఇన్ ఇండియా నిబ‌ద్ధ‌త‌కు ప్రోత్సాహాన్ని ఇస్తూ డిఫెన్స్ రీసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డిఆర్‌డిఒ)  ఇటీవ‌లే కొచ్చిలోని నావ‌ల్ ఫిజిక‌ల్ & ఓష‌నోగ్రాఫిక్ లాబొరేట‌రీ అకాస్టిక్ కారెక్ట‌రైజేష‌న్ (ధ్వ‌ని సంబంధ‌) & ఎవాల్యుయేష‌న్ (మూల్యాంక‌నం) (ఎస్‌పిఎసిఇ) సౌక‌ర్యం కోసం హ‌ల్ మాడ్యూల్ ఆఫ్ స‌బ్‌మెర్సిబుల్ ప్లాట్ (నౌకా సంబంధ నిమ‌జ్జ‌క వేదిక‌) ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. ఇది ఓడ‌లు, జ‌లంత‌ర్గాములు, హెలికాప్ట‌ర్ల‌తో స‌హా వివిధ వేదిక‌ల‌లో భార‌తదేశ నౌకాద‌ళం ఉప‌యోగించేందుకు అభివృద్ధి చేసిన సోనార్ వ్య‌వ‌స్థ‌ల కోసం అత్యాధునిక ప‌రీక్ష‌, మూల్యాంక‌న సౌక‌ర్యం.
ఎస్‌పిఎసిఇ సౌకర్యం ఎం/ ఎఎస్ ఎల్‌&టి షిప్ బిల్డింగ్‌, చెన్నై నిర్మించిన ఎన్‌పిఒఎల్ అంచ‌నా వేసిన కాన్సెప్ట్ డిజైన్, అవ‌స‌రాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. దీనిని ప్ర‌ధానంగా సోనార్ వ్య‌వ‌స్థ‌లను మూల్యాంక‌నం చేసేందుకు ఉప‌యోగించ‌డ‌మే కాక సెన్సార్లు, ట్రాన్స్‌డ్యూస‌ర్ల (ఇత‌ర రూపంలోని శ‌క్తిని ఉప‌యోగించి ఎల‌క్ట్రిక‌ల్ సిగ్న‌ళ్ళ‌ను ఉత్ప‌త్తి చేయ‌డం) వంటి శాస్త్రీయ ప్యాకేజీల‌ను, శాస్త్రీయ ప్యాకేజీల‌ను త్వ‌రిత‌గ‌తంగా మోహ‌రించ‌డం, సుల‌భంగా పున‌రుద్ధ‌రించ‌డానికి అనుమ‌తిస్తుంది. 
ప్ర‌పంచంలోనే ఏకైక కేంద్రం ఎస్‌పిఎసిఇ. 
స‌మ‌కాలికంగా నిర్వ‌హించగ‌ల వించ్‌ల శ్రేణిని ఉప‌యోగించి 100 మీట‌ర్ల లోతుల‌కు దించందుకు వీలుగా ప్ర‌త్యేకంగా రూపొందించిన స‌బ్‌మెర్సిబుల్ ప్లాట్‌ఫాం ఈ స‌దుపాయం ప్ర‌త్యేక‌త‌. ఈ వేదిక రూప‌క‌ల్ప‌న‌, నిర్మాణం ఇండియ‌న్ రిజిస్ట‌ర్ ఆఫ్ షిప్పింగ్, నౌక‌ల వ‌ర్గీక‌ర‌ణ అథారిటీ చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన అవ‌స‌రాల‌ను తీర్చ‌డ‌మే కాక కేర‌ళ లోత‌ట్టు నౌక‌ల నిబంధ‌న‌లకు అనుగుణంగా త‌నిఖీ, రిజిస్ట్రేష‌న్ ప్ర‌మాణాల‌కు ఖ‌చ్చితంగా క‌ట్టుబ‌డి ఉంటుంది. 

***
 (Release ID: 1874580) Visitor Counter : 119


Read this release in: English , Urdu , Hindi