సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
రాజా రామ్మోహన్ రాయ్ జీవితంపై ఉత్సాహభరితంగా రూపొందిన రెండు రోజుల నృత్య ప్రదర్శన ఈ రోజు ముగిసింది
Posted On:
06 NOV 2022 8:48PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
* నారీ సమ్మాన్ నేపథ్యం ఆధారంగా 'యుగపురుష్ రాజా రామ్మోహన్ రాయ్' శీర్షికతో రూపొందించిన నృత్య నాటకం ఈరోజు ముగిసింది
* ప్రతి వారం సెంట్రల్ విస్టాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన ప్రచారంలో ఈ ప్రదర్శన కూడా ఒక భాగం
* రాజా రామ్ మోహన్ రాయ్ 250వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఆధునిక భారతీయ సమాజ పితామహుడిగా పిలువబడే రాజా రామ్మోహన్ రాయ్ జీవితం ఆధారంగా రెండు రోజుల మనోహరమైన, సంపన్నమైన నృత్య నాటకం ఈరోజు ముగిసింది. ఈ రోజు కర్తవ్య పథ్ మరియు ఇండియా గేట్ (సెంట్రల్ విస్టా) వద్ద నృత్య నాటక ప్రదర్శన జరిగింది. 'యుగ్ పురుష్ రాజా రామ్మోహన్ రాయ్' శీర్షికతో 'నారీ సమ్మాన్' ఇతివృత్తం ఆధారంగా రూపొందిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది.
నృత్య నాటకం పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించింది. పాత్రల రూపకల్పన, ప్రదర్శనలను ప్రేక్షకులు ఆస్వాదించారు.
రాజా రామ్మోహన్ రాయ్ జన్మదిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పొడవునా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా రామ్మోహన్ రాయ్ ఆదర్శాల ఆధారంగా 'యుగపురుష్' అనే ఈ నృత్య నాటక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. #AmritMahotsav #Yugpurush
(2/2)
— కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (@MinOfCultureGoI) November 6, 2022
ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్ లో భాగంగా రాజా రామ్మోహన్ రాయ్ 250వ జయంతి సందర్భంగా, 2022 మే, 22వ తేదీన భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక సంవత్సరం పాటు సుదీర్ఘ వేడుకను ప్రారంభించింది.
ఈ దృశ్య,శ్రవణ ప్రదర్శన కూడా ప్రచారంలో ఒక భాగం. దీని కింద ప్రతి వారం సెంట్రల్ విస్టా లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రముఖ నృత్య దర్శకుడు నీలయ్ సేన్ గుప్తా ఈ నృత్య నాటకానికి దర్శకత్వం వహించారు.
రాజా రామ్ మోహన్ రాయ్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ నృత్య నాటకం ద్వారా ఆయన గొప్ప రచనలు, ఉన్నత ఆదర్శాలు, జీవిత తత్వం గురించి ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రవేశం అందరికీ పూర్తిగా ఉచితం.
1771 మే, 22వ తేదీన బెంగాల్ లోని రాధానగర్ లో జన్మించిన రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలోని మత, సామాజిక, రాజకీయ సంస్కరణల్లో విశేషమైన పాత్ర పోషించారు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆయన ఎల్లప్పుడూ ఆధునిక, శాస్త్రీయ విధానాలను సమానంగా ప్రోత్సహించేవారు.
*****
(Release ID: 1874225)
Visitor Counter : 177