వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
తప్పనిసరి బి.ఐ.ఎస్. ప్రమాణాలను ఉల్లంఘించి దేశీయ ప్రెషర్ కుక్కర్లను విక్రయించినందుకు క్లౌడ్ టైల్ కు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసిన - సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ
వినియోగదారులకు విక్రయించిన అటువంటి 1,033 ప్రెషర్ కుక్కర్లను వెనక్కి తీసుకుని, వాటి ధరలను తిరిగి చెల్లించి, 45 రోజుల్లో సమ్మతి నివేదికను సమర్పించాలని క్లౌడ్ టైల్ ని ఆదేశించిన - సి.సి.పి.ఏ.
క్యూ.సి.ఓ. ని, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించి, ప్రెషర్ కుక్కర్లను విక్రయించినందుకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని క్లౌడ్ టైల్ ని ఆదేశించిన - సి.సి.పి.ఏ.
Posted On:
05 NOV 2022 1:11PM by PIB Hyderabad
డొమెస్టిక్ ప్రెజర్ కుక్కర్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2020 ప్రకారం నిర్దేశించబడిన తప్పనిసరి ప్రమాణాలకు విరుద్ధంగా దేశీయ ప్రెజర్ కుక్కర్ లను విక్రయించడం ద్వారా వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అనుచిత వాణిజ్య విధానాలకు పాల్పడిన క్లౌడ్ టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు వ్యతిరేకంగా చీఫ్ కమీషనర్ శ్రీమతి నిధి ఖరే నేతృత్వంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, ఉత్తర్వులు జారీ చేసింది.
తమ ఇ-కామర్స్ ప్లాట్-ఫారమ్‌ల ద్వారా నిర్బంధ ప్రమాణాలను ఉల్లంఘించి దేశీయ ప్రెషర్ కుక్కర్లను విక్రయించినందుకు ఇ-కామర్స్ ప్లాట్-ఫారమ్ లపై తనకు తానుగా చర్య తీసుకోవాలని సి.సి.పి.ఏ. నిర్ణయించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, షాప్-క్లూస్, స్నాప్-డీల్ తో పాటు ఈ ప్లాట్-ఫారమ్ లలో నమోదు చేసుకున్న విక్రయదారులతో సహా ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్-ఫారమ్ లకు సి.సి.పి.ఏ. నోటీసులు జారీ చేసింది.
క్లౌడ్‌టైల్ ఇండియా ప్రై. లిమిటడ్, ప్రెజర్ కుక్కర్ ను విక్రయిస్తుంది. అవి “అమెజాన్ బేసిక్స్ స్టెయిన్-లెస్ స్టీల్ ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్, 4 లీటర్లు (విజిల్ ద్వారా ప్రెజర్ అలర్ట్ ఇవ్వదు)”. అమెజాన్ ఇ-కామర్స్ ప్లాట్-ఫారమ్ లో యు.ఆర్.ఎల్. https://www.amazon.in/AmazonBasics-Stainless-Steel-Pressure-Cooker/dp/B071G5KNXK ద్వారా వినియోగదారులకు ప్రెజర్ కుక్కర్ అమ్మకాలను కొనసాగిస్తోంది.
క్యు.సి.ఓ. అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రెజర్ కుక్కర్ దిగుమతిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు క్లౌడ్-టైల్ సంస్థ తన ప్రత్యుత్తరంలో సి.సి.పి.ఏ. కి తెలియజేసింది. అయితే, దిగుమతిని నిలిపివేసినప్పటికీ, అటువంటి ప్రెషర్ కుక్కర్లను వినియోగదారులకు విక్రయించడాన్ని కంపెనీ ఆపకుండా కొనసాగించినట్లు సి.సి.పి.ఏ. గమనించింది. వాస్తవానికి, క్యూ.సి.ఓ. గురించి తెలిసినప్పటికీ, కంపెనీ ఇప్పటికీ అటువంటి ప్రెజర్ కుక్కర్లను వినియోగదారులకు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నట్లు ఈ సమాధానం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. క్యూ.సి.ఓ. నోటిఫికేషన్ తర్వాత కూడా క్లౌడ్-టైల్ సంస్థ తప్పనిసరి ప్రమాణాలకు అనుగుణంగా లేని మొత్తం 1,033 యూనిట్ల ప్రెజర్ కుక్కర్‌లను అమెజాన్ ఇ-కామర్స్ ప్లాట్-ఫారమ్ ద్వారా విక్రయించారు.
క్లౌడ్-టైల్ సంస్థ విక్రయించిన 1,033 యూనిట్ల ప్రెషర్ కుక్కర్లను తిరిగి తీసుకుని, అలా వచ్చిన ప్రెషర్ కుక్కర్ల ధరలను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని, 45 రోజుల లోపు సమ్మతి నివేదిక సమర్పించాలని, సి.సి.పి.ఏ. తన ఆదేశాల్లో పేర్కొంది. క్యూ.సి.ఓ. కింద నిర్దేశించిన తప్పనిసరి ప్రమాణాలను, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించి, దేశీయ ప్రెషర్ కుక్కర్లను వినియోగదారులకు విక్రయించినందుకుగాను లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని కూడా సి.సి.పి ఆదేశించింది.
క్యూ.సి.ఓ. నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించడం ద్వారా, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడమే కాకుండా, వినియోగదారులను ప్రాణ నష్టంతో సహా తీవ్ర గాయాలకు గురి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సమీపంలో ఉండే, చాలా ఇళ్లలో ఉపయోగించే గృహోపకరణమైన ప్రెషర్ కుక్కర్ విషయంలో ఇది ఆందోళన కలిగించే ముఖ్యమైన అంశం.
చెల్లుబాటు అయ్యే ఐ.ఎస్.ఐ. మార్క్ లేని, నిర్బంధ బి.ఎస్.ఐ. ప్రమాణాలను ఉల్లంఘించే వస్తువులను కొనుగోలు చేయకుండా వినియోగదారులను అప్రమత్తం చేయడానికి, హెచ్చరించడానికి, సి.సి.పి.ఏ. చట్టంలోని సెక్షన్ 18(2)(j) కింద భద్రతా నోటీసులను కూడా జారీ చేసింది. హెల్మెట్లు, ప్రెషర్ కుక్కర్లు, వంట గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మొదటి భద్రతా నోటీసు జారీ చేయగా, విద్యుత్ ఇమ్మర్షన్ వాటర్ హీటర్లు, కుట్టు మిషన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఎల్.పి.జి. తో కూడిన గ్యాస్ స్టౌ వంటి గృహోపకరణాలకు సంబంధించి రెండో భద్రతా నోటీసు జారీ చేయడం జరిగింది.
సి.సి.పి.ఏ. దేశంలో వినియోగదారుల రక్షణ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నియమాల షెడ్యూల్ ఈ(1) లో పేర్కొన్న జాబితాలోని పదార్థాలతో కూడిన ఆయుర్వేద, సిద్ధ, యునాని ఔషధాల విక్రయానికి సంబంధించి, ఇటీవల, సి.సి.పి.ఏ. అన్ని ఇ-కామర్స్ ప్లాట్-ఫారమ్ లకు ఒక సలహాను జారీ చేసింది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ రాసి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ను ఈ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు అప్-లోడ్ చేసిన తర్వాత మాత్రమే ఆ మందులు ఇవ్వడం జరుగుతుంది.
*****
(Release ID: 1874047)
Visitor Counter : 164