శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సూక్ష్మ కణాలు : మానవ ఆరోగ్యం మరియు పర్యావరణం లో ఉద్భవిస్తున్న పోకడలు
Posted On:
04 NOV 2022 3:46PM by PIB Hyderabad
ప్రస్తుతం కొనసాగుతున్న భారత ప్రభుత్వ కార్యక్రమం “ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" లో భాగంగా, న్యూఢిల్లీ లోని ఇండియన్ జర్నల్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ బయోఫిజిక్స్ (ఐ.జె.బి.బి) మరియు సి.ఎస్.ఐ.ఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్.ఐ.ఎస్.సి.పి.ఆర్); తమ నవంబర్, 2022 సంచికను, భారతదేశానికి సంబంధించి "సూక్ష్మ కణాలు : మానవ ఆరోగ్యం మరియు పర్యావరణం లో ఉద్భవిస్తున్న పోకడలు" అనే ఇతివృత్తంతో ఒక ప్రత్యేక సంచికగా విడుదల చేసింది. భారతదేశానికి చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ సైన్స్ కమ్యూనికేషన్ మరియు పాలసీ రీసెర్చ్ సంస్థ, సి.ఎస్.ఐ.ఆర్-ఎన్.ఐ.ఎస్.సి.పి.ఆర్, వివిధ ఎస్.టి.ఐ. విభాగాలలో 16 పత్రికలను ప్రచురిస్తుంది. ఈ పత్రికలన్నీ సైన్స్ సైటేషన్ ఇండెక్స్ (వెబ్ ఆఫ్ సైన్స్); స్కోపస్; ఎన్.ఏ.ఏ.ఎస్; యు.జి.సి. కేర్ వంటి ప్రఖ్యాత జాతీయ / అంతర్జాతీయ సంస్థల గుర్తింపు పొందాయి.
జీవ రసాయన శాస్త్రం (బయోకెమిస్ట్రీ), జీవ భౌతిక శాస్త్రం (బయోఫిజిక్స్), జీవ సాంకేతిక విజ్ఞానం (బయోటెక్నాలజీ) సబ్జెక్టులకు సంబంధించిన సూక్ష్మ పరిశీలనాత్మక, పరిశోధనాత్మక మాస పత్రిక - ఐ.జె.బి.బి., 1.472 జె.ఐ.ఎఫ్. స్కోర్ తో, సి.ఎస్.ఐ.ఆర్-ఎన్.ఐ.ఎస్.సి.పి.ఆర్. కు చెందిన అన్ని విభాగాలలోని అన్ని పత్రికల్లో మొదటి స్థానంలో ఉంది. సుప్రసిద్ధ జాతీయ / అంతర్జాతీయ నిపుణులతో ఇటీవల కొత్తగా ఏర్పాటైన సంపాదకీయ మండలి యొక్క సమర్థమైన మార్గదర్శకత్వం, చురుకైన మద్దతుతో ఈ పత్రిక ప్రపంచవ్యాప్తంగా జీవరసాయన శాస్త్రం, జీవ భౌతిక శాస్త్రం, జీవ సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన పరిశోధకులు, విద్యావేత్తల నుండి గణనీయమైన ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్రత్యేక సంచిక, 106 పేజీలలో నాణ్యమైన విషయాలతో, 4 ఆహ్వానించబడిన సమీక్షా కథనాలతో పాటు, 5 అసలైన పరిశోధనా పత్రాలను కలిగి ఉంది. ఇది భారతదేశానికి సంబంధించి మానవ ఆరోగ్యం, పర్యావరణం పై సూక్ష్మ కణాల పరిశోధనలో ఉద్భవిస్తున్న ధోరణుల గురించి విస్తృతంగా తెలియజేసింది.
జన్యు చికిత్స వ్యవస్థలు; పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ( పి.సి.ఓ.ఎస్); పురుష పునరుత్పత్తి వ్యవస్థ పై సూక్ష్మ కణాల ప్రభావం; స్థిరమైన వ్యవసాయ రంగంలో సూక్ష్మ సాంకేతిక అప్లికేషన్ల పాత్ర వంటి నిర్దిష్ట విషయ రంగాల్లో విజయాలు, భవిష్యత్తు సవాళ్ల గురించి, ఈ సమీక్ష కథనాల్లో క్లుప్తంగా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా, ఫంగల్ బ్లైట్ రైస్, సార్స్-కోవ్-2, హ్యూమన్ ఏ.సి.ఈ-2 రిసెప్టర్ లోని ప్రోటీన్ లక్ష్యాలకు వ్యతిరేకంగా ఫైటోకెమికల్స్, జింక్ ఆక్సైడ్ నానోపార్టికల్స్ యొక్క యాంటీమైక్రోబయల్ సంభావ్యత, నాన్-ఇంజనీరింగ్ ల్యాండ్-ఫిల్ వల్ల కలిగే పర్యావరణ ప్రమాదంతో పాటు, కౌమారదశ లోని వ్యక్తుల ఆందోళనల గురించి ఒరిజినల్ పరిశోధనా కథనాలు చర్చించాయి.
న్యూ ఢిల్లీ లోని సి.ఎస్.ఐ.ఆర్-ఎన్.ఐ.ఎస్.సి.పి.ఆర్. డైరెక్టర్, ప్రొఫెసర్ రంజన అగర్వాల్; ఐ.జె.బి.బి. చీఫ్ ఎడిటర్, డాక్టర్ స్టీఫెన్ డిమిత్రోవ్; ఐ.జె.బి.బి. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, డాక్టర్ డి.ఎన్. రావు; సీనియర్ సహోద్యోగులు శ్రీ ఆర్.ఎస్. జయ సోము, డా. జి మహేష్ తో పాటు, సీనియర్ శాస్త్రవేత్త, ఐ.జె.బి.బి.సైంటిఫిక్ ఎడిటర్ డాక్టర్ ఎన్.కె. ప్రసన్న తీసుకున్న చొరవ, ప్రోత్సాహం, మద్దతుతో మాత్రమే ఈ ప్రత్యేక సంచిక ప్రచురణ సాధ్యమైంది. ఈ పత్రిక (జర్నల్) ప్రచురణ సకాలంలో విజయవంతంగా పూర్తి కావడానికి రచయితలు, సమీక్షకుల సహకారం తో పాటు, సి.ఎస్.ఐ.ఆర్-ఎన్.ఐ.ఎస్.సి.పి.ఆర్. కు చెందిన ముద్రణ విభాగం అందించిన సాంకేతిక సహకారానికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
<><><>
(Release ID: 1873974)