రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెండింగ్‌లో ఉన్న వారెంట్ల అమలు కోసం 01.10.2022 నుంచి 31.10.2022 వరకు నెల రోజుల దేశవ్యాప్త కార్యక్రమం నిర్వహించిన ఆర్‌పీఎఫ్‌


289 కేసుల్లో ప్రమేయం ఉన్న 319 మంది నేరస్థులను అరెస్టు చేసి సంబంధిత కోర్టుల ఎదుట హాజరు పరిచిన ఆర్‌పీఎఫ్‌

10-15 ఏళ్లుగా పరారీలో ఉన్న 52 మంది నేరస్థులు కూడా వీరిలో ఉన్నారు

Posted On: 04 NOV 2022 3:55PM by PIB Hyderabad

రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) బాధ్యత రైల్వే ఆస్తులను రక్షించడం. ఇందుకోసం ఆర్‌పీఎఫ్‌ అనేక చర్యలు తీసుకుంటోంది. రైల్వే ఆస్తుల దొంగతనానికి సంబంధించిన కేసులను ఆర్‌పీ (యూపీ) చట్టంలోని నిబంధనల ప్రకారం ఆర్‌పీఎఫ్‌ నమోదు చేసి, విచారణ చేస్తుంది.దొంగిలించిన రైల్వే ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకుంటుంది. నేరస్థులను అరెస్టు చేయడం/విచారణ చేయడం కూడా ఇందులో భాగం. రైల్వే చట్టం 1989 ప్రకారం ఈ దళం ప్రాసిక్యూషన్‌ కూడా ప్రారంభించింది. విచారణ సమయంలో అరెస్టులను, కోర్టు ఎదుట హాజరు కాకుండా తప్పించుకునే నేరస్తులు/నిందితులపై ట్రయల్ న్యాయస్థానాలు అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తాయి. వారెంట్ల అమలులో జాప్యం వల్ల,లేదా, పేరున్న నిందితులను అరెస్టు చేయడం వల్ల కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతుంది. ఫలితంగా, న్యాయ వ్యవస్థ & న్యాయ సాధికార సంస్థల మీద అదనపు ఒత్తిడి పడుతుంది. న్యాయ నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వారెంట్లను త్వరగా అమలు చేయడానికి, పరారీలో ఉన్నవాళ్లు/నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచడానికి భారతీయ రైల్వే చర్యలు తీసుకుంది. వారెంట్ల అమలు కోసం 01.10.2022 నుంచి 31.10.2022 వరకు నెల రోజుల దేశవ్యాప్త కార్యక్రమం చేపట్టింది.

ఈ కార్యక్రమంలో భాగంగా, 289 కేసుల్లో ప్రమేయం ఉండి, న్యాయ ప్రక్రియ నుంచి తప్పించుకున్న 319 మంది నేరస్థులను అరెస్టు చేసి సంబంధిత కోర్టుల ఎదుట ఆర్‌పీఎఫ్‌ హాజరు పరిచింది. 10-15 ఏళ్లుగా పరారీలో ఉన్న 52 మంది నేరస్థులు కూడా వీరిలో ఉన్నారు.

ఆర్‌పీఎఫ్‌ క్షేత్ర స్థాయి బృందాలు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో వారెంట్ల అమలును కొనసాగిస్తాయి.

***

 


(Release ID: 1873968)
Read this release in: English , Urdu , Hindi , Marathi