జల శక్తి మంత్రిత్వ శాఖ
ఇండియా వాటర్ వీక్ 3వ రోజున జలవనరుల సుస్థిర అభివృద్ధికి హామీపై స్థిరమైన దృష్టి కేంద్రీకరణ
Posted On:
03 NOV 2022 6:23PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఇండియా ఎక్స్ పో సెంటర్ లో జరుగుతున్న ఇండియా వాటర్ వీక్ 2022 మూడో రోజున జల వనరుల సుస్థిర అభివృద్ధి కోసం చేపట్టవలసిన కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం అవకాశాలు, సవాళ్లపై మరింతగా చర్చించే వివిధ కార్యకలాపాలు చేపట్టాలని నిర్ణయించారు. “సమర్థవంతమైన జనవనరుల నిర్వహణకు అందుబాటులోని టెక్నలాజికల్ సొల్యూషన్లు” అనే అంశంపై టెక్నికల్ సెషన్ నిర్వహించారు. వాటర్ ఎడ్యుకేషన్, ప్రజా చైతన్యం- మీడియా పాత్ర; జల నిర్వహణ సొల్యూషన్ల వికేంద్రీకరణ, పౌర సమాజం అనే మూడు అంశాలపై ప్యానెల్ చర్చ నిర్వహించారు. వీటికి తోడు పాఠశాల విద్యార్థులు, యువ వృత్తి నిపుణులు, ఐడబ్ల్యుఆర్ఎస్ అనుబంధ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
- జలశక్తి శాఖ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు బాలలకు బహుమతులు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
- వాణిజ్యపరమైన అవకాశాలపై దృష్టి సారించి దాని ప్రయోజనాలు, సత్వర చెల్లింపు ప్రయోజనాల గురించి సమాచారం అందచేశారు.
- వాటర్ ఎడ్యుకేషన్, ప్రజాచైతన్యం-మీడియా పాత్ర, జలవనరుల నిర్వహణ సొల్యూషన్ల వికేంద్రీకరణ అనే అంశాలపై ప్యానెల్ చర్చ నిర్వహించారు.
- నీటి పారుదల ప్రాజెక్టుల కమాండ్ ఏరియాలో ఉన్న ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించే వాతావరణం ప్రభుత్వం అధికారులు కల్పిస్తారు.
- ఆహార, ఇంధన సరఫరాలను స్తంభింపచేయడం ద్వారా ఆర్థిక వృద్ధికి విఘాతం కల్పించే నీటి కొరత అంశంపై చర్చలు నిర్వహించారు.
- ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన యువ వృత్తినిపుణులు, రీసెర్చ్ స్కాలర్లు నీటి వనరుల నిర్వహణ, తమ పరిశోధనలకు సంబంధించిన భిన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
- ఆసక్తి గల ప్రతినిధుల కోసం ఆగ్రాకు స్టడీ టూర్ నిర్వహించారు.
సమర్థవంతమైన జలవనరుల నిర్వహణలో పౌర సమాజం పాత్రపై ఇండియా వాటర్ పార్టనర్ షిప్ (ఐడబ్ల్యుపి) ఆధ్వర్యంలో ఆలోచనాత్మకమైన, ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఐసిఐడి సెక్రటరీ-జనరల్ శ్రీ ఎ.బి.పాండ్య సెషన్ కు అధ్యక్షత వహించారు. డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా రివర్ బేసిన్ అండ్ వాటర్ పాలసీ డైరెక్టర్ ఎస్.వి.సురేష్ బాబు; వాటర్ ఎయిడ్ ఇండియా సిఇఓ శ్రీ వి.కె.మాధవన్; ఎన్ఎంసిజి-టెరి సిఓఇ-వాటర్ రీయూజ్ సీనియర్ ఫెలో అండ్ హెడ్ డాక్టర్ నూపుర్ బహదూర్; ఆగా ఖాన్ ఫౌండేషన్ వాష్ అండ్ హెల్త్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అసద్ ఉమర్; ధన్ ఫౌండేషన్ సుహమ్ డైరెక్టర్ సిఇఓ శ్రీ ఆర్.రాజపాండ్యన్; ఐఇఎల్ఓ ఫౌండింగ్ పార్టనర్, పర్యావరణ చట్టాల నిపుణుడు శ్రీ షవాహిక్ సిద్ధికి తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
వాటర్ ఎడ్యుకేషన్, ప్రజా చైతన్యం, మీడియా పాత్ర, జలవనరుల నిర్వహణలో వికేంద్రీకరణ సొల్యూషన్లు వంటి విభిన్న అంశాలపై ప్యానెల్ చర్చలు నిర్వహించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కమాండ్ ఏరియాలో నివశిస్తున్న ప్రజల్లో విశ్వాసం ఏర్పరచేందుకు సాధారణ ప్రజలు, భాగస్వామ్య పక్షాలు, ప్రభుత్వ అధికారుల మధ్య సంభాషణలు నిర్వహించారు. జల వనరుల ప్రాజెక్టుల మౌలిక వసతులపై యాజమాన్యం నీటి వినియోగదారుల చేతిలోనే ఉంటుంది, వారే వాటి నిర్వహణకు బాధ్యులు. నీటి మౌలిక వసతులు లేని వర్గాలకు నీటిని అందించే విషయంలో కేంద్రీయ వ్యవస్థపై వికేంద్రీకృత ట్రీట్ మెంట్ వ్యవస్థ ప్రయోజనాలపై కూడా చర్చ జరిగింది.
జలవనరుల సమర్థవంతమైన నిర్వహణకు టెక్నాలజీ సొల్యూషన్లు, పౌర సమాజం పాత్రపై సెమినార్లు నిర్వహించారు. ఫ్రాగ్మెంటేషన్, సమగ్ర దృక్పథం లేదా ఇంటిగ్రేషన్ లోపం; టెక్నాలజీ ప్రామాణీకరణ వంటి సమస్యల నిర్వహణలో డిజిటైజేషన్ సవాళ్ల కారణంగా నీటికి సంబంధించిన వ్యవహారాలు పరిణత స్థితికి చేరకపోవడం పట్ల ఆందోళన ప్రకటించారు. నీటి కొరత ఆహార భద్రతకు, ఇంధన సరఫరాలకు అంతరాయంగా మారి ఆర్థిక వృద్ధిని కూడా కుంటుపరుస్తుందన్న అంశం ప్రస్తావించారు. డిజిటల్ అజెండాను బలవంతంగా రుద్దడం కన్నా దాని వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కార్యాచరణతో కూడిన డిజిటల్ వ్యూహం, దానికి కట్టుబడడం; వాణిజ్యపరమైన అంశాలు; ప్రయోజనాలు అందరికీ అందించడం; మద్దతు వ్యవస్థలు సాధించే ఫలితాలకు డిజిటల్ టెక్నాలజీలో పెట్టుబడులు అనుసంధానం చేయడం వంటి అంశాలను కూడా చర్చించారు. అలాగే భూగర్భ జలాల మోడలింగ్, నీటి వినియోగంలో సమర్థనీయత, పంపింగ్ సామర్థ్యాలు, స్కాడా లీకేజిలు గుర్తించడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. వివిధ జల వనరుల నిర్వహణ విధానాలపై తమ పరిశోధనాంశాలను యువ వృత్తినిపుణులు, ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన రీసెర్చ్ స్కాలర్లు పంచుకున్నారు.
250 మంది విద్యార్థులు, 30 మంది ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చిత్ర లేఖన పోటీలో 90 మంది బాలలు పాల్గొన్నారు. 150 మంది పాఠశాల విద్యార్థులతో జలవనరుల నిర్వహణపై నుక్కడ్ నాటకం ప్రదర్శించారు. నీటి సంబంధిత అంశాలపై పాఠశాల విద్యార్థులతో ఒక గోష్ఠి నిర్వహించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు ఈ కార్యక్రమంలో పాల్గొని బాలలకు బహుమతులు అందచేశారు. ఎన్ డబ్ల్యుడిఏ డైరెక్టర్ జనరల్, ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆసక్తి గల ప్రతినిధుల కోసం ఆగ్రాకు స్టడీ టూర్ నిర్వహించారు. మధ్యాహ్నం సెషన్ లో ఎగ్జిబిటర్లు తమ సంస్థల గురించి, ఉత్పత్తుల గురించి తెలియచేసే ప్రదర్శన నిర్వహించారు.
***
(Release ID: 1873614)