మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేషనల్ స్కాలర్ షిప్ లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పథకం (ఎన్ఎంఎంఎస్ఎస్) కోసం దరఖాస్తులు (తాజా/ పునరుద్ధరణ) సమర్పణకు ఆఖరు తేదీ 15 నవంబర్, 2022

నాడు పోస్టు చేయడమైనది: 03 NOV 2022 11:00AM by PIB Hyderabad

2022‌-2023 సంవత్సరానికిగాను ఎన్ఎంఎంఎస్ఎస్ కు దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరు తేదీ 15 నవంబర్ 2022. నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్ కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రతిభావంతులైన విద్యార్ధులు 8వ తరగతిలో డ్రాప్ అవడాన్ని నిరోధించడానికి స్కాలర్షిప్ లు అందచేయడమే కాక ద్వితీయ శ్రేణి విద్యను కొనసాగించడాన్ని ప్రోత్సహించడం పథకం లక్ష్యం.  పాఠశాలల్లో చదువుతున్న IX తరగతి విద్యార్ధులకు  ప్రతి ఏడాదీలక్ష తాజా స్కాలర్ షిప్ లను అందించేందుకు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న, స్థానిక సంస్థల బడులలో  10 నుంచి 12 తరగతులలో వారి చదువును కొనసాగించేందుకు/పునరుద్ధరణ కోసం ఏడాదికి రూ. 12000/- మొత్తాన్నిస్కాలర్ షిప్ గా అందించారు.  
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీం (ఎన్ఎంఎంఎస్ఎస్)ను విద్యార్ధులకు అందించే స్కాలర్ షిప్ పథకాల కోసం ఉద్దేశించిన సమగ్ర వేదిక అయిన  నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ (ఎన్ ఎస్ పి)లో చేర్చింది. ఎన్ఎంఎంఎస్ఎస్ స్కాలర్ షిప్లను ఎంపిక చేసిన విద్యార్ధులకు డిబిటి మోడ్ ను అనుసరించి ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (పిఎఫ్ఎంఎస్) ద్వారా వారి బ్యాంకు అకౌంట్లలోకి ఎలక్ట్రానిక్ బదలాయింపు ద్వారా చెల్లిస్తారు. ఇది 100% కేంద్ర  ప్రాయోజిత పథకం. 

***


(రిలీజ్ ఐడి: 1873579) సందర్శకుల సూచీ సంఖ్య : : 326
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Tamil , Malayalam