శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఒక శక్తివంతమైన విశాలమైన డి.ఎస్.టి. ప్రాంగణాన్ని సృష్టించిన - పరిశుభ్రత డ్రైవ్, పునరుద్ధరించిన రికార్డు గది
Posted On:
02 NOV 2022 3:33PM by PIB Hyderabad
స్వచ్ఛత ప్రచారం కింద ప్రత్యేక ప్రచారం 2.0 లో భాగంగా శాస్త్ర, సాంకేతిక విభాగం (డి.ఎస్.టి), దాని ఆధీనం లోని కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు అనేక ప్రాంతాల్లో 2022 అక్టోబర్, 2వ తేదీ నుంచి 2022 అక్టోబర్, 31వ తేదీ వరకు స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టాయి.
ఇందులో భాగంగా బలమైన శుభ్రపరిచే దశలను అమలుచేయడంలో, ఇది 140 లక్ష్య ప్రాంతాలను అధిగమించి 180 ప్రాంతాలను శుభ్రపరచడానికి దారితీసింది. పెండింగ్ లో ఉన్న ఎనిమిది పార్లమెంటరీ హామీలలో ఏడు నెరవేర్చబడ్డాయి, వాటిలో ఒకటి 2016 మార్చి నెల నుంచి పెండింగ్‌లో ఉంది.
డి.ఎస్.టి. లోని రికార్డుల గదిని పునరుద్ధరించి, ఇప్పుడు కొత్త భవనంలోకి మార్చడం జరిగింది. రికార్డులు వేరు చేసి, వర్గీకరించి, భద్రపరచడం జరిగింది. డి.ఎస్.టి., దాని అనుబంధ, స్వయంప్రతిపత్తి సంస్థలు దాదాపు 1,16,000 ఫైళ్లను సమీక్షించి, సుమారు 48,500 ఫైళ్లను తొలగించాయి. సమర్థవంతమైన స్థల నిర్వహణ కోసం, పాత, పనికిరాని రికార్డులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. 1719 ఈ-ఫైళ్లను సమీక్షించిన అనంతరం, మొత్తం 596 ఈ-ఫైళ్లను పరిష్కరించి, మూసివేయడం జరిగింది.
పనికిరాని చెత్తను తొలగించడం ద్వారా డి.ఎస్.టి. దాని అధీనంలో ఉన్న మరియు స్వయం ప్రతిపత్తి సంస్థలకు 23,10,826 రూపాయల ఆదాయం సమకూరింది. అదేవిధంగా 68,514 చదరపు అడుగుల ఖాళీ స్థలం వినియోగంలోకి వచ్చింది.
డి.ఎస్.టి. గ్రంధాలయంలో రికార్డులను సులభంగా గుర్తించి తీసుకోడానికి వీలుగా మొత్తం వస్తువుల వివరాలను కంప్యూటర్ లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా, దాదాపు 12,000 రికార్డులను కూడా కంప్యూటర్ లో నిక్షిప్తం చేయడం జరిగింది. ఇ-జర్నల్స్ మరియు పుస్తకాలను సులువుగా గుర్తించి, ఉపయోగించుకోడానికి వీలుగా తగిన మౌలిక సదుపాయాలతో గ్రంథాలయాన్ని ఇప్పుడు నూతన భవనంలోకి మార్చడం జరిగింది.
స్వచ్ఛత ప్రచారం 2.0 ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషించాయి.
*****
(Release ID: 1873251)
Visitor Counter : 147