పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
అరుణాచల్ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈటానగర్ లోని హోలోంగీ గ్రీన్ ఫీల్డ్ ఎయర్ పోర్టు కు ‘‘డోనీ పోలో ఎయర్ పోర్ట్, ఈటానగర్’’ అనే పేరు నుపెట్టేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
ఈ పేరుసూర్యుడు (డోనీ) మరియు చంద్రుడు (పోలో) లంటే అరుణాచల్ ప్రదేశ్ ప్రపజల కు ఉన్న భక్తి,శ్రద్ధల ను ప్రతిబింబిస్తుంది
Posted On:
02 NOV 2022 3:06PM by PIB Hyderabad
ఈటానగర్ లోని హోలోంగీ లో గ్రీన్ ఫీల్డ్ ఎయర్ పోర్టు కు ‘డోనీ పోలో ఎయర్ పోర్ట్, ఈటానగర్’ అనే పేరు ను పెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ విమానాశ్రయానికి ‘డోనీ పోలో ఎయర్ పోర్ట్, ఈటానగర్’ అనే పేరు ను పెట్టాలనే తీర్మానాన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. సూర్యుడు (డోనీ) మరియు చంద్రుడు (పోలో) అంటే ప్రజల కు ఉన్న భక్తి, శ్రద్ధల కు ఈ పేరు అద్దం పడుతుంది. అంతేకాక రాష్ట్ర సంప్రదాయాలకు మరియు రాష్ట్రానికి సాంస్కృతికం గా ఉన్న సంపన్న వారసత్వాని కి సైతం ఇది ప్రతీకాత్మకం గా ఉంది.
ఒక కొత్త విమానాశ్రయాన్ని హోలోంగి లో అభివృద్ధిపరచడానికి భారతదేశం ప్రభుత్వం 2019 జనవరి లో ‘సూత్ర ప్రాయ ఆమోదాన్ని’ తెలిపింది. ఈ ప్రాజెక్టు ను ఎయర్ పోర్ట్ స్ ఆథారిటి ఆఫ్ ఇండియా (ఎఎఐ) 646 కోట్ల రూపాయల వ్యయం తో కేంద్ర ప్రభుత్వం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల సహాయం తో అభివృద్ధి పరుస్తున్నది.
**
(Release ID: 1873043)