విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం 2.0లో పాలుపంచుకున్న విద్యుత్ మంత్రిత్వ శాఖ


● విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సిపిఎస్ఇ కార్యాలయాలు, సంస్థలు ప్రత్యేక ప్రచారం కింద ప్రచార ప్రాంతాలుగా జోడింపు
● పరిష్కృతమైన 213 ప్రజా ఫిర్యాదులు, సమస్యలు
● 24854 ఫైళ్ళ తొలగింపు
● 2824 చదరపు అడుగల జాగా ఖాళీ

Posted On: 02 NOV 2022 11:36AM by PIB Hyderabad

తన పరిధిలోని సిపిఎస్ఇలు, సంస్థలతో కలిసి విద్యుత్ మంత్రిత్వ శాఖ 2 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ 2022 వరకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ప్రచారం 2.0లో పాల్గొంది. పెండింగ్ లో ఉన్న వ్యవహారాలను పరిష్కరించడం, అంతర్గత పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడం, మెరుగ్గా రికార్డుల నిర్వహణ, పని ప్రదేశంలో పరిశుభ్రత అన్న ప్రధాన లక్ష్యాలను సాధించడం ప్రచారం ఉద్దేశ్యం. 
ప్రత్యేక ప్రచారం 2.0 కింద వారాంతపు సమీక్షలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ & నూతన పునరావృత ఇంధన శాఖ కార్యదర్శి,   విద్యుత్ మమంత్రిత్వ శాఖ, సంబంధిత సంస్థల అధికారులతో కలిసి  చేపడుతున్నారు. 
విద్యుత్ మంత్రిత్వ శాఖలో ప్రత్యేక ప్రచారం 2.0 కింద చేపట్టిన కార్యకలాపాల ప్రోగ్రెస్ రిపోర్ట్ దిగువన పేర్కొన్న విధంగా ఉంది –
పరిష్కరించిన ప్రజా సమస్యల సంఖ్య : 213
తొలగించిన ఫైళ్ళ సంఖ్య: 24854
పారిశుద్ధ్య డ్రైవ్ తరువాత ఖాళీ అయిన జాగా (చదరపు అడుగులలో: 2820
పారిశుద్ధ్య ప్రచారం చేపట్టిన ప్రదేశాలు:  534

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MUJM.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002JCC6.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003GGYU.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004D1IX.jpg


న్యూఢిల్లీలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యాలయమైన శ్రమ శక్తి భవన్ లో స్వచ్ఛత కోసం ప్రత్యేక ప్రచారం 2.0 చేపట్టిన దృశ్యాలు 

 

***


(Release ID: 1872996) Visitor Counter : 127


Read this release in: English , Urdu , Hindi , Tamil