ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పొడిగించిన గడువు తేదీ 31.03.2022 లోగా ఫారం నెం.10 A దాఖలు దాఖలు చేయడంలో జరిగిన జాప్యాన్ని పరిగణన లోకి తీసుకోరాదని నిర్ణయించిన సీబీడీటీ

Posted On: 01 NOV 2022 6:35PM by PIB Hyderabad

ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని నిబంధనల ప్రకారం   ఫారం నెం.10 Aని    ఎలక్ట్రానిక్‌ విధానంలో 30.06.2021 లోపు దాఖలు చేయాల్సి ఉంది, గడువును తొలుత  31.08.2021 వరకు ఆ తర్వాత  సర్క్యులర్ నంబర్. 16/2021 ద్వారా 31.03.2022 వరకు సీబీడీటీ పొడిగించింది. 

తనకు అందిన అభ్యర్థనలు, పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్న  ఉద్దేశ్యంతో  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ( సీబీడీటీ ) ఫారం 10A దాఖలు చేయడంలో 2022  నవంబర్ 25 వరకు జరిగిన జాప్యాన్ని   ఆదాయపు పన్ను చట్టం  1961 సెక్షన్ 12A లోని కొన్ని నిబంధనలు / సెక్షన్ 10(23C) / సెక్షన్ 80G /  సెక్షన్ 35 నిబంధనల ప్రకారం పరిగణన లోకి  తీసుకోరాదని నిర్ణయించింది. 

దీనికి సంబంధించి సీబీడీటీ సర్క్యులర్ నం.22/2022 తేదీ 01.11.2022 జారీ చేయబడింది. ఈ సర్క్యులర్  www.incometaxindia.gov.in.  లో అందుబాటులో ఉంది  .  

***

 


(Release ID: 1872880) Visitor Counter : 173


Read this release in: English , Urdu , Hindi