ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

'పెండింగ్ అంశాల విషయాల పరిష్కార ప్రత్యేక ప్రచారం' (ఎస్ సి డి పి ఎం 2.0) పని పురోగతి , ఉత్తమ విధానాలపై కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమీక్ష


1100కు పైగా పరిశుభ్రత క్యాంపెయిన్ కార్యక్రమాలు విజయవంతం; ఉత్పాదక ఉపయోగం కోసం అందుబాటు లోకి 21000 చదరపు అడుగులకు పైగా స్థలం

8416 ప్రజా ఫిర్యాదులు, అప్పీళ్లు పరిష్కారం; 21,695 ఫైళ్ల సమీక్ష; వ్యర్థాల అమ్మకం ద్వారా రూ.4 లక్షలకు పైగా ఆదాయం

Posted On: 01 NOV 2022 4:00PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ , ఆరోగ్య పరిశోధనా విభాగం నిర్వహించిన 'స్పెషల్ క్యాంపెయిన్ 2.0 ఫర్ డిస్పోజల్ ఆఫ్ పెండింగ్ మ్యాటర్స్ (ఎస్ సిడిపిఎమ్) , స్వచ్ఛతా డ్రైవ్  కింద పని పురోగతిని , ఉత్తమ విధానాలను సమీక్షించారు. స్పెషల్ క్యాంపెయిన్ 2.0ను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించారు.

 

2022 అక్టోబర్ 31న జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ 'స్పెషల్ క్యాంపెయిన్ 2.0 ఫర్ డిస్పోజల్ ఆఫ్ పెండింగ్ మ్యాటర్స్ (ఎస్సీడీపీఎం),  స్వచ్ఛతా డ్రైవ్' పురోగతిని సమీక్షించారు.

 

పెండింగును తగ్గించడం, స్వచ్ఛతను సంస్థాగతీకరించడం, అంతర్గత పర్యవేక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, రికార్డుల నిర్వహణలో అధికారులకు శిక్షణ ఇవ్వడం, మెరుగైన రికార్డుల నిర్వహణ కోసం భౌతిక రికార్డులను డిజిటలైజ్ చేయడం ఇంకా అన్ని మంత్రిత్వ శాఖలు / విభాగాలను ఒకే డిజిటల్ ప్లాట్ ఫాం పైకి తీసుకురావడం ఈ ప్రచారం లక్ష్యాలు: www.pgportal.gov.in/scdpm22.

 

ఎస్ సిడిపిఎమ్ , స్వచ్ఛతా డ్రైవ్ లను 2022 అక్టోబర్ 1 న ప్రారంభించారు. 2022 అక్టోబర్ 2 నుండి 2022 అక్టోబర్ 31 వరకు అమలు చేశారు. 2022 నవంబర్ 14 నుంచి 30 వరకు థర్డ్ పార్టీ మదింపులు జరుగుతాయి, దీని తరువాత 2022 డిసెంబర్ 24 , 25 తేదీల్లో సుపరిపాలన దినోత్సవం నాడు అత్యుత్తమ విధానాల ప్రజంటేషన్ లు ఉంటాయి. ఈ క్యాంపెయిన్ నెలవారీ పురోగతిని డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియెన్స్ (డి ఎ పి ఆర్ జి) సెక్రటరీ సమీక్షిస్తున్నారు.

 

డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఎమ్ ఓ హెచ్ ఎఫ్ డబ్ల్యు) ఆధ్వర్యం లో దాని ప్రధాన కార్యాలయం,దాని అనుబంధ కార్యాలయాలు (డిటిఇజిహెచ్ ఎస్ & ఎన్ హెచ్ ఎ), 128 సబార్డినేట్ ఆఫీసులు, 50 అటానమస్ బాడీస్ మరియు 1 సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాయి. అలాగే, ఈ ప్రచారం MoHFW యొక్క క్షేత్ర కార్యాలయాలకు విస్తరించబడింది. (డిటిఇజిహెచ్ఎస్ అండ్ ఎన్ హెచ్ ఎ), 128 సబార్డినేట్ ఆఫీసులు, 50 అటానమస్ సంస్థలు, ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాయి. అలాగే, ఈ ప్రచారం ఎమ్ ఓ హెచ్ ఎఫ్ డబ్ల్యు క్షేత్ర కార్యాలయాలకు విస్తరించబడింది.

 

తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ లో గౌరవ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీమతి (డాక్టర్) భారతి ప్రవీణ్ పవార్ చేతుల మీదుగా ఆయుష్ హెర్బల్ ప్లాంటేషన్ ప్రారంభోత్సవం

 

స్వచ్ఛతా అభియాన్ అమలును తనిఖీ చేయడం కోసం నిర్మాణ్ భవన్ లోని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని గౌరవ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ సందర్శించారు.

 

ప్రచార కాలంలో, 21600 ఫైళ్లు సమీక్షించబడ్డాయి, 8416 ప్రజా

ఫిర్యాదులు , వాటి అప్పీళ్లు

పరిష్కారమయ్యాయి. 1100కు పైగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. పనికిరానివి తొలగించడంతో సుమారు 21000 చదరపు అడుగుల స్థలం ఉపయోగం లోకి వచ్చింది. అలాగే వ్యర్ధాలను పాత, పనికి రానివి అమ్మడం వల్ల రూ. 4,06,315/- ఆదాయం లభించింది.

 

డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, దాని అనుబంధ, సబార్డినేట్ కార్యాలయాలు , స్వయంప్రతిపత్తి సంస్థల్లో స్వచ్ఛతను సంస్థాగతీకరించడానికి, పెండింగ్ ను తగ్గించడానికి ఎంతో స్పందన కనిపిస్తోందని అన్నారు.ఈ సంవత్సరం ప్రత్యేక ప్రచారం 2.0 ను రిమోట్ అవుట్ స్టేషన్ కార్యాలయాలు, అటాచ్డ్ , సబార్డినేట్ కార్యాలయాలు,  అటానమస్ సంస్థలలో కూడా అమలు చేశారు, దీనితో పాటు పౌర కేంద్రిత స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా అమలు జరిగాయి.

ముందు-తరువాత

స్వచ్ఛతా ఛాయాచిత్రాలు (వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ అండ్ సఫ్దర్ జంగ్ హాస్పిటల్, న్యూఢిల్లీ)

ముందు-తరువాత

స్వచ్ఛతా ఛాయాచిత్రాలు (ఎయిమ్స్, పాట్నా)

ఆరోగ్య పరిశోధన విభాగానికి చెందిన అన్ని విభాగాలు అదేవిధంగా క్షేత్రస్థాయి యూనిట్లు ,ఎస్టాబ్లిష్ మెంట్ ల ద్వారా పరిశుభ్రత డ్రైవ్ ను పూర్తి చిత్తశుద్ధితో చేపట్టారు. 143 ఫీల్డ్ యూనిట్ లు/డిహెచ్ ఆర్ ఎస్టాబ్లిష్ మెంట్ లలో అవుట్ డోర్ పరిశుభ్రత క్యాంపెయిన్ లను ల విజయవంతంగా నిర్వహించారు. డీహెచ్ఆర్, దాని ఫీల్డ్ యూనిట్ల క్రియాశీల భాగస్వామ్యాన్ని వివరిస్తూ 28 ట్వీట్లు, 27 రీట్వీట్లు డీహెచ్ఆర్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి నమోదు అయ్యాయి. 

స్వచ్ఛతా క్యాంపెయిన్ 2.0 .ను అన్ని ఐసిఎంఆర్ సంస్థలలో నిర్వహించారు చిత్రాలు , వీడియోలను వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఉంచారు.

పరిశుభ్రత ప్రాముఖ్యత , మంచి ఆరోగ్యంతో దాని సంబంధాన్ని వివరిస్తూ ఢిల్లీలోని పాఠశాలల్లో ఐసిఎంఆర్ ప్రధాన కార్యాలయం ద్వారా పాఠశాల సెన్సిటైజేషన్ కార్యక్రమాలు

నిర్వహించారు. ఆరోగ్య అక్షరాస్యత.. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఐసీఎంఆర్-ఎన్ ఐఆర్ ఈహెచ్ (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్ మెంటల్ హెల్త్)లో 'హెర్బల్ వాటిక ' కార్యక్రమం చేపట్టారు. పరిశుభ్రత డ్రైవ్, అవగాహన ప్రచారాలు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై ఉపన్యాసాలు , పోస్టర్/మోడల్ పోటీలు వంటి కార్యకలాపాలను ఐసిఎంఆర్-ఎన్ఐపి (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ) లో నిర్వహించారు. ఐసిఎంఆర్-ఎన్ఐటిఎమ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్) ద్వారా "చేతులు కడుక్కోవడం" టెక్నిక్ డెమోతో పాటు ప్రభుత్వ పాఠశాలలో "బయో మెడికల్ వేస్ట్ మేనేజ్ మెంట్" అవగాహన , ఆరోగ్య పరిశుభ్రత అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. "స్వచ్ఛతా హీ సేవ" అనే థీమ్ పై సిబ్బంది వారి కుటుంబ సభ్యులు, విద్యార్థుల మధ్య డ్రాయింగ్, వ్యాస రచన పోటీని న కూడా

ఇన్ స్టిట్యూట్ నిర్వహించింది.

దేశవ్యాప్తంగా అవలంబించిన స్వచ్ఛతా పద్ధతుల్లో అనేక పౌర కేంద్రిత ఆవిష్కరణలుఉన్నాయి. రికార్డ్ ల నిర్వహణ ను మరింత సమర్థవంతంగా చేయడానికి అన్ని ఆర్కైవల్ రూమ్ లు , రికార్డ్ రూమ్ లకు కాంపాక్టర్ లు అందించారు. తద్వారా ఫైళ్లు/డాక్యుమెంట్ లను క్రమబద్ధంగా నిర్వహించడానికి సురక్షితంగా ఉంచడానికి వీలవుతుంది.

అనేక సంస్థలు స్వచ్ఛతను పెంపొందించడానికి వారి క్యాంపస్ లలో పరిశుభ్రమైన , పచ్చటి వాతావరణాన్ని అందించడానికి ఉత్తమ పద్ధతులను చేపట్టాయి. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్ క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ (ఎన్ ఐ టి ఆర్ డి) వాటర్ జెన్ ను ఇన్ స్టాల్ చేసింది, ఇది గాలిలోని తేమను తాగునీరుగా మార్చే ఒక వినూత్న సాంకేతిక పరిజ్ఞానం.ఎయిమ్స్, బీబీనగర్, తెలంగాణ ఆయుష్ హెర్బల్ ప్లాంటేషన్ నిర్వహించింది. ఎ.ఐ.ఐ.పి.ఎం.ఆర్, ముంబై, ఈ క్యాంపెయిన్ సమయంలో . "స్వచ్ఛతా హీ సేవ" ఆలోచన స్ఫూర్తి తో వంటింటి వ్యర్థాలను డీ కంపోజింగ్ తరువాత మొక్కలకు మట్టిగా ఉపయోగించే అత్యుత్తమ వ్యర్థాల నిర్వహణ విధానాలను అవలంబించింది ఎయిమ్స్, రిషికేశ్, జంక్ మెటీరియల్, రస్ట్డ్ బెంచీలు, కోబ్ వెబ్ లు/బర్డ్ నెస్ట్/ గోడ పై సీపేజ్ లను లక్ష్యాలు గా గుర్తించి క్యాంపెయిన్ సమయంలో వాటిని శుభ్రం చేసి, వ్యర్థ పదార్థాలు లేకుండా చేశారు.

పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నియంత్రించడం కోసం/సంబంధిత ప్రాంతంలో వేహికల్ పార్కింగ్ ని నిషేధించడం కోసం సెక్యూరిటీ గార్డును ఉంచారు. భువనేశ్వర్ లోని ఎయిమ్స్ ప్లాస్టిక్ ఫ్రీ, టొబాకో ఫ్రీ , మెర్క్యురీ ఫ్రీగా మార్చే ప్రక్రియను చేపట్టింది.ఆర్ ఎమ్ ఎల్ హాస్పిటల్ లో, కాయకల్ప మార్గదర్శకాల కింద క్లీనింగ్ కార్యకలాపాల కోసం మొదటిసారిగా మూడు బకెట్ సిస్టమ్ లు అవలంబించబడ్డాయి. ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ కు వచ్చే వారి కోసం ముంబైలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (ఎన్ ఐ పి హెచ్ టి ఆర్) స్వచ్ఛతపై ఒక ఎగ్జిబిషన్ ను నిర్వహించింది. సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీ (సి డి టి ఎల్), ముంబై, జోనల్ ఎఫ్ డి ఏ ఆవరణను రెండు వైపులా చెట్ల వరుసతో విశాలమైన తోటతో నీడ అందాన్ని ఇచ్చేలా సుందరంగా తీర్చిదిద్దింది,

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ (ఏఐఐ పిఎమ్ఆర్), ముంబై.

ఎయిమ్స్, బీబీనగర్ (ఫోటో)            

ఎయిమ్స్, రిషికేశ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబి అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ (ఎన్ ఐ టి ఆర్ డి), న్యూఢిల్లీ           

ఎయిమ్స్, భువనేశ్వర్

ఎయిమ్స్, మంగళగిరి                               

ఛాయాచిత్రాలు , డేటాను అప్ లోడ్ చేయడం ద్వారా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మార్గదర్శకత్వంలో రూపొందించిన ప్రత్యేక స్వచ్ఛతా పోర్టల్ (https://cd.nhp.gov.in),  డీఏఆర్ పిజి పోర్టల్ (www.pgportal.gov.in/scdpm22). పై ఈ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు .                                               

02.10.2022-31.10.2022 నుంచి స్పెషల్ క్యాంపెయిన్ 2.0 సమయంలో, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దాని అనుబంధ, సబార్డినేట్, స్యయం ప్రతిపత్తి సంస్థలలో దిగువ పేర్కొన్న పురోగతి సాధించబడింది:

(ఎ) స్వచ్ఛతా ప్రచార ప్రదేశాలు - 1107 (బి) రికార్డుల నిర్వహణ: సమీక్షించబడిన ఫైళ్లు (భౌతిక ఫైళ్లు+ఇ-ఫైల్స్)-21695 (సి) పరిష్కరించిన పబ్లిక్ గ్రీవియెన్స్ లు +అప్పీల్స్ - 8416 (డి) సంపాదించిన ఆదాయం (రూ.ల్లో) – 406315 (ఇ) లభించిన స్పేస్ ఫ్రీడ్ (చదరపు అడుగులలో) – 21073

 

 

****



(Release ID: 1872878) Visitor Counter : 111


Read this release in: English , Urdu , Hindi