ఆయుష్

ఆగ్నేయాసియా ప్రాంతంలో సాంప్రదాయ/మూలికా ఉత్పత్తుల నాణ్యత నియంత్రణ కోసం ప్రయోగశాల సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి ఒక ముఖ్యమైన అడుగు


సాంప్రదాయ/మూలికా ఉత్పత్తుల ల్యాబ్ ఆధారిత నాణ్యత నియంత్రణపై శిక్షణ పొందడానికి 9 దేశాల నుంచి ప్రతినిధులు

ఫార్మకోపోయియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ & హోమియోపతి (పిసిఐఎం&హెచ్) సహకారంతో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న డబ్ల్యూహెచ్‌ఓ సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్

Posted On: 01 NOV 2022 4:33PM by PIB Hyderabad

డబ్ల్యూహెచ్‌ఓ సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్ (డబ్ల్యూహెచ్‌ఓ-ఎస్‌ఈఏఆర్‌ఓ) సహకారంతో ఫార్మాకోపోయియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ & హోమియోపతి (పిసిఐఎం&హెచ్), ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆగ్నేయాసియా ప్రాంతంలోని సంప్రదాయం/మూలికా ఉత్పత్తుల నాణ్యత నియంత్రణ కోసం ప్రయోగశాల సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి ఒక ప్రధాన కార్యక్రమం చేపట్టింది. ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ ప్రమోద్ కుమార్ పాఠక్.. డబ్ల్యుహెచ్‌ఓ సౌత్-ఈస్ట్ ఆసియా ప్రాంతీయ కార్యాలయ సాంప్రదాయ వైద్యం ప్రాంతీయ సలహాదారు డాక్టర్ కిమ్ సుంగ్‌చోల్, పిసిఐఎం&హెచ్ డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు.  దేశంలోనే తొలిసారిగా ఇలాంటి కసరత్తు జరుగుతోంది.

ఈ శిక్షణా కార్యక్రమంలో 9 దేశాల నుండి (భూటాన్, ఇండోనేషియా, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, మాల్దీవులు, తైమూర్ లెస్టె మరియు బంగ్లాదేశ్) మొత్తం 23 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.  సాంప్రదాయ/మూలికా ఉత్పత్తుల నాణ్యతను నిర్వహించడానికి ప్రయోగశాల ఆధారిత పద్ధతులకు నైపుణ్యాలను అందించడం ఈ శిక్షణ కార్యక్రమ లక్ష్యం.

 

image.png

 

ఈ సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ ప్రమోద్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ "అభివృద్ధి చెందుతున్న దేశాల పరిశోధన మరియు సమాచార వ్యవస్థ కేంద్ర నివేదిక ప్రకారం ఈ పరిశ్రమ 2022 నాటికి యూఎస్‌ $ 23.3 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. మార్కెట్‌ విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో కల్తీ కారణంగా మూలికా పదార్థాల నాణ్యత సమస్యలు కూడా ఆందోళనకరంగా మారుతున్నాయి. ల్యాబ్ ఆధారిత నాణ్యత నియంత్రణలోని  వివిధ భౌతిక, రసాయన మరియు భౌగోళిక అంశాల ద్వారా మూలికల నాణ్యతను అంచనా వేయగలదు." అని తెలిపారు.

డబ్ల్యూహెచ్‌ఓ సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతీయ కార్యాలయ సాంప్రదాయ వైద్య ప్రాంతీయ సలహాదారు డాక్టర్ కిమ్ సుంగ్‌చోల్ మాట్లాడుతూ, “డబ్ల్యూహెచ్‌ఓ-ఎస్‌ఈఏఆర్‌ఓ ఇతర దేశాలకు ప్రాంతీయ వర్క్‌షాప్‌లు మరియు శిక్షణను విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రాంతీయ వర్క్‌షాప్‌ల సమయంలో సభ్య దేశాలు చేసిన ముఖ్య సిఫార్సులలో రెగ్యులేటరీ సామర్థ్యాన్ని నిర్ధారించడం ఒకటి. అందుకే మేము ఆయుష్ మంత్రిత్వ శాఖ పిసిఐఎం&హెచ్ సహకారంతో ఈ మొదటి శిక్షణా సమావేశాన్ని నిర్వహిస్తున్నాము." అని తెలిపారు.

నాణ్యత నియంత్రణ చర్యలలో ముడి మూలికా పదార్థం, నాణ్యమైన పద్ధతులు (వ్యవసాయం, సాగు, సేకరణ, నిల్వ, తయారీ, ప్రయోగశాల మరియు క్లినికల్ మొదలైనవి) ప్రమాణాలు ఉంటాయి. తయారీ, దిగుమతి, ఎగుమతి మరియు మార్కెటింగ్‌లో నిర్దిష్ట మరియు ఏకరీతి లైసెన్సింగ్ పథకాలను అమలు చేయాలి. ఇవి భద్రత మరియు సమర్థతను నిర్ధారించడానికి కీలకమైనవి.

పెరుగుతున్న మార్కెట్ మూలికా ఔషధాల సరైన నాణ్యత, సమర్థత మరియు ప్రభావాన్ని నిర్వహించడానికి సవాలును ఇస్తోంది. సాంప్రదాయ/మూలికా ఉత్పత్తుల నాణ్యత నియంత్రణకు ప్రయోగశాల సామర్థ్యాని సంబంధించిన నెట్‌వర్క్ ద్వారా దీనిని బలోపేతం చేయాలి. సాంప్రదాయ/మూలికా ఉత్పత్తుల నాణ్యత నియంత్రణ కోసం మాక్రోస్కోపీ, ఫార్మాకోగ్నోసీ, ఫైటోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీలో మైక్రోస్కోపీ, ఇతర అధునాతన పరికరం/టెక్నాలజీలు అంటే హై-పెర్ఫార్మెన్స్ థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ (HPTLC), గ్యాస్ క్రోమాటోగ్రఫీ మొదలైన ప్రయోగశాల పద్ధతులపై ఈ ప్రత్యేక కార్యక్రమం శిక్షణను అందిస్తుంది.


 

****



(Release ID: 1872850) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi