నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

గత 8 ఏళ్ళలో భారతదేశ సంస్కరణల కథనంపై నీతి ఆయోగ్ రెండవ అంతర్గత సమావేశం

Posted On: 31 OCT 2022 6:56PM by PIB Hyderabad

భారతీయ సంస్కరణల కథ - గత 8 ఏళ్ళు అన్న ఇతివృత్తం పై నీతి ఆయోగ్  రెండవ శ్రేణి అంతర్గత ఉపన్యసాన్ని న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో సోమవారం నిర్వహించారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఒఆర్ఎఫ్) ఉపాధ్యక్షుడు గౌతం చికర్మానె కీలకోపన్యాసం ఇచ్చారు. అనంతరం నీతీ ఆయోగ్ సిఇఒ పరమేశ్వరన్ అయ్యర్ ప్యానెల్ చర్చను నిర్వహించారు. చర్చను పాఠశాల విద్య &  అక్షరాస్యత కార్యదర్శి అనిత కార్వాల్, ఒఆర్ఎఫ్ ఉపాధ్యక్షుడు గౌతం చికరహమానె, పిక్కీ సీనియర్ ఉపాధ్యక్షుడు సుభ్రకాంత్ పాండా మధ్య జరిగింది. 
ఒక ఆర్థిక వ్యవస్థలో మనం ఎప్పుడూ వృద్ధిని గురించి ఆలోచించడమే కాదు మన దేశం వంటి డాటా ఆధారిత దేశంలో పంపిణీ పరిమాణాల గురించి కూడా ఆలోచించాలని తన ముగింపు వ్యాఖ్యాలలో నీతీ ఆయోగ్ వైస్ ఛైర్ సుమన్ బేరీ అన్నారు. 2014 - 2022 మధ్య చోటు చేసుకున్న అతిపెద్ద మార్పు ఏమిటంటే స్థాయీ నైపుణ్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, అనేక స్వతంత్ర చొరవలు ఉన్నాయి.  ఇప్పుడు యుపిఎ, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ ల విషయంలో మనం చూస్తున్నది అద్భుతమైన బట్వాడా చేయగల సామర్ధ్యం. 
ఈ శ్రేణిలో ప్రారంభ ఉపన్యాసం కోవిడ్ -19 వాక్సినేషన్ : ఇండియా కథను 30 సెప్టెంబర్ 2022న నిర్వహించారు. భారత అభివృద్ధి వ్యూహాల ఉపన్యాస శ్రేణిని ప్రతి నెల నిర్వహిస్తారు. ఈ ఉపన్యాసాలు జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలు, కలుపుకుపోయే వృద్ధికి సంబంధించిన విధానాలు, వివిధ రంగాలలో ఉత్తమ ఆచరణలు, సహకార, పోటీతత్వ ఫెడరలిజంకు సంబంధించిన చొరవలను ప్రోత్సహిస్తోంది. 
నేటి ఉపన్యాసానికి సీనియర్ నాయకత్వం, సంయుక్త కార్యదర్శులు, సలహాదారులు, లేటరల్ ఎంట్రెంట్స్ సహా 300మంది వ్యక్తులు హాజరయ్యారు. 
దిగువ లింక్ ను క్లిక్ చేసి ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు : 


 


(Release ID: 1872566) Visitor Counter : 169