వ్యవసాయ మంత్రిత్వ శాఖ

2022 నవంబర్ 1న పూణేలో జరిగే జాతీయ స్థాయి హార్టికల్చర్ వాల్యూ చైన్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్


హార్టికల్చర్ రంగంలో సేవలకు గాను రైతులు, ఎఫ్.పి.ఒలు, అగ్రి స్టార్టప్ లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు మొదలైన వారిని సన్మానించనున్న శ్రీ తోమర్

Posted On: 31 OCT 2022 9:16AM by PIB Hyderabad

భారత ప్రభుత్వ వ్యవసాయ , రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ  మహారాష్ట్ర  పూణే లోని వామ్నికామ్ లో 2022 నవంబర్ 1 తేదీన "భారతదేశంలో ఉద్యాన విలువ గొలుసు విస్తరణ - సామర్ధ్యం - అవకాశాలు" అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర

వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ముఖ్య  అతిధి గా హాజరవుతారుఆయన ఎగ్జిబిషన్ ను ప్రారంభించి, ఉద్యానవన పంటల (హార్టికల్చర్) రంగంలో సేవలు అందిస్తున్న రైతులు, ఎఫ్ పిఒ లు, అగ్రి స్టార్టప్ లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, బ్యాంకర్లు మొదలైన వారిని సన్మానించనున్నారు.

అలాగే,ఉద్యానరంగ విజయగాధల సంకలన పుస్తకం - "ఆర్గానిక్ ప్యాకేజింగ్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ హార్టికల్చర్ క్రాప్స్" ను , మిషన్ ఆర్గానిక్ వాల్యూ ఛైయిన్ పై మరో పుస్తకాన్ని కూడా ఆయన ఆవిష్కరిస్తారు.

భారతదేశంలో ఉద్యాన విలువ గొలుసు విస్తరణ - సామర్ధ్యం- అవకాశాలు" అనే కార్యక్రమం aneka మంది రైతులు, అగ్రి స్టార్ట్-అప్ లు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు, బ్యాంకర్లు ఇతర భాగస్వాముల కు వేదిక అవుతుంది. రైతులు, ఎఫ్.పి..లు, వివిధ పంటలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఒఇ), ఐసిఎఆర్ క్రాప్ స్పెసిఫిక్ నేషనల్ రీసెర్చ్ సెంటర్లు, ప్రెసిషన్ ఫార్మింగ్ డెవలప్ మెంట్ సెంటర్లు వంటి సంబంధిత భాగస్వాములను కార్యక్రమం ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.

 

కార్యక్రమం లో ప్రతిపాదించబడుతున్న ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల భాగస్వాముల టెక్నికల్ సెషన్ వివరాలు దిగువ పేర్కొన్న విధంగా ఉంటాయి:

 

అన్యదేశ, స్వదేశీ , అధిక విలువ కలిగిన ఉద్యాన పంటలలో కార్యక్రమాలు ,అవకాశాలు:

 

సెషన్ లో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రతినిధి ద్వారా అన్యదేశ, స్వదేశీఅధిక విలువ కలిగిన ఉద్యాన పంటలలో అవకాశాల గురించి చర్చిస్తారు. అలాగే, అన్యదేశ పండ్లపై రైతు విజయగాథతో

సేంద్రియ వ్యవసాయం లో హార్టికల్చర్ వాల్యూ ఛైయిన్ ని ఆప్టిమైజ్ చేయడం గురించి కూడా వక్తలు మాట్లాడుతారు,

 

పూల తోటల సాగు లో కార్యక్రమాలు- అవకాశాలు;

 

సెషన్ లో ఐసిఎఆర్-డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ రీసెర్చ్ ప్రతినిధి పూల సాగు (ఫ్లోరికల్చర్) లో అవకాశాలు, సవాళ్లు,దశ / దిశ గురించి మాట్లాడతారు. అలాగే, ఫ్లోరికల్చర్ -కామర్స్ , వేస్ట్ టూ వెల్త్ స్టార్టప్ పై గ్రోత్ అండ్ సక్సెస్ స్టోరీ గురించి వక్తలు మాట్లాడతారు.

 

హార్టికల్చర్ లో జి పి , పొడిగింపు ఆవిష్కరణలు

 

ఐసిఎఆర్- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ ప్రతినిధి భారతదేశంలో హార్టికల్చర్ లో టెక్నాలజీ , ఇన్నోవేషన్ పాత్ర గురించి సెషన్ లో మాట్లాడతారు. అలాగే, వక్తలు తాజా వ్యవసాయ ఉత్పత్తులు ,హార్టికల్చర్ కోసం విజయవంతమైన ఎఫ్ పి లలో టెక్నాలజీ పాత్ర గురించి మాట్లాడతారు.

 

కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానాలు, మౌలిక సదుపాయాలు, సంస్థలుసవాళ్లు

 

సెషన్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ మేనేజ్ మెంట్ (నిఫ్టెమ్) ప్రతినిధి హార్టికల్చర్ లో పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడతారు. అలాగే, హార్టికల్చర్ లో ఇన్నోవేషన్ ద్వారా ఫుడ్ టెక్నాలజీకి నాయకత్వం వహించడంలో సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సిఎఫ్ టిఆర్ఐ) పాత్ర గురించి వారి ప్రతినిధి ద్వారా చర్చిస్తారు.

 

ఉద్యాన ఉత్పత్తులు , అగ్రి/ హార్టి స్టార్టప్ మార్కెటింగ్ , ఎగుమతి

 

సెషన్ లో అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ (అపెడా) ప్రతినిధి భారతీయ హార్టికల్చర్ ఎగుమతి అవకాశాల గురించి మాట్లాడతారు. హార్టికల్చర్ వాల్యూ ఛైయిన్ యాక్టివిటీలో నిమగ్నమైన మార్కెట్/ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ లతో హార్టికల్చర్ కమాడిటీస్ , అగ్రి/హార్టీ స్టార్టప్ మార్కెటింగ్ ఎగుమతిపై ప్యానెల్ డిస్కషన్ నిర్వహిస్తారు.

 

హార్టికల్చర్ కోసం యాంత్రీకరణలో సృజనాత్మకత అభివృద్ధి

 

సెషన్ లో హార్టికల్చర్ లో యాంత్రీకరణఅవలోకనం , ఐసిఎఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ పాత్ర గురించి చర్చిస్తారు. అదేవిధంగా, గ్రామీణ భారతదేశం లో హార్టికల్చర్ , సుస్థిర వ్యవసాయం కోసం సృజనాత్మక సమస్య ఆధారిత పరిష్కారాల గురించి కూడా వక్తలు మాట్లాడతారు.

 

చీడపీడలు లేని ప్రాంతం: హార్టికల్చర్ ప్రొడక్ట్ ఎగుమతి కోసం సిస్టమ్ అప్రోచ్

 

డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ క్వారంటైన్ అండ్ స్టోరేజీ ప్రతినిధి సెషన్ లో చీడపీడలు లేని హార్టికల్చర్ ప్రొడక్ట్ గురించి మాట్లాడతారు.. అదేవిధంగా, హార్టికల్చర్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు , సేంద్రియ హార్టికల్చర్ ఎగుమతులపై మహిళా పారిశ్రామికవేత్తల విజయ గాథ గురించి వక్తలు మాట్లాడతారు.

 

***



(Release ID: 1872232) Visitor Counter : 140