పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఇంటర్నేషనల్ పెట్రోలియం ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ ప్రారంభించడానికి అక్టోబర్ 31, 2022న యుఎఇ
సందర్శించనున్నపెట్రోలియం, సహజవాయువు , గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి
నాడు పోస్టు చేయడమైనది:
30 OCT 2022 6:44PM by PIB Hyderabad
భారత పెట్రోలియం, సహజవాయువు , గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి
యుఎఇ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి హెచ్.ఇ. సుహైల్ మొహమ్మద్ ఫరాజ్ అల్ మజ్రూయీ , పరిశ్రమ అధునాతన సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్ , అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్ఒసి) మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సిఈఓఓల ఆహ్వానం మేరకు.
అబుదాబి ఇంటర్నేషనల్ పెట్రోలియం ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ (ఎడిఐపిఇసి-2022) ప్రారంభోత్సవానికి హాజరు కావడానికి 2022 అక్టోబర్ 31 నుండి యుఎఇ ని సందర్శిస్తారు.
ఈ పర్యటనలో భాగంగా, యుఎఇ పరిశ్రమలు, అధునాతన సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జబెర్, ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి హెచ్.ఇ. సుహైల్ మొహమ్మద్ ఫరాజ్ అల్ మజ్రూయీ , ఎడిఎన్ఒసి ఎండి అండ్ గ్రూప్ సిఇఒ , ఇంకా కొందరు ఎంపిక చేసిన ఇతర మంత్రులు: అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ అల్ సౌద్ - సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి. హైథమ్ అల్ ఘైస్ - సెక్రటరీ జనరల్ ఒపెక్, తారెక్ ఎల్ మొల్లా - ఈజిప్ట్ పెట్రోలియం మరియు ఖనిజ వనరుల మంత్రి తో కలసి శ్రీ హర్దీప్ ఎస్. పూరి ఎడిఐపిఇసి-2022 ప్రారంభోత్సవ కార్యక్రమం లో ప్రసంగిస్తారు.
భారత్ - యుఎఇ వ్యూహాత్మక భాగ స్వామ్య మొత్తం పరిధిలో ఇంధన
సహకారాన్ని బలోపేతం చేయడం పై యుఎఇ ఇంధన, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మంత్రి సుహైల్ మొహమ్మద్ ఫరజ్ అల్ మజ్రూయి, యు ఎ ఇ
పారిశ్రామిక, అత్యాధునిక సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జబెర్, ఎడిఎన్ఒసి ఎండి అండ్ గ్రూప్ సిఈవో లతో శ్రీ హర్దీప్ ఎస్. పూరి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
ఎడిపెక్-2022 కార్యక్రమానికి హాజరయ్యే వివిధ దేశాలకు చెందిన తన సహచరులు, అంతర్జాతీయ ఇంధన సంస్థల అధిపతులు, గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల సీఈఓలతో మంత్రి సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (ఎఫ్ ఐపిఐ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియ న్ ఇండస్ట్రీ (సిఐఐ) సంయుక్తంగా ఏర్పాటు చేసే ఇండియా పెవిలియన్ ను కూడా మంత్రి ప్రారంభిస్తారు.
ఎడిఎన్ఒసి ఆధ్వర్యం లో జరిగే ఎడిఐపిఇసి ఇంధన రంగానికి సంబంధించిన ప్రముఖ ఈవెంట్లలో ఒకటి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన సరఫరా , భద్రతా సవాళ్లు, అలాగే తదుపరి తరం ఇంధన పరిష్కారాలతో సహా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఇంధన వ్యవస్థను ప్రభావితం చేసే తాజా పోకడలపై అంతర్దృష్టులను అందించాలని ఎడిఎన్ఒసి లక్ష్యంగా పెట్టుకుంది.
***
(రిలీజ్ ఐడి: 1872117)
సందర్శకుల సూచీ సంఖ్య : : 179