వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధానమంత్రి పంచప్రాణాలు
మీరే నవభారత మార్గదర్శులు : శ్రీ పీయూష్ గోయెల్
Posted On:
28 OCT 2022 10:45PM by PIB Hyderabad
తమ అభిరుచులను అనుసరిస్తూనే దేశం ప్రథమం అన్న విషయం కూడా ఆలోచించాలని యువతకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు; వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రభుత్వం పంపిణీ; టెక్స్ టైల్స్ శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ పిలుపు ఇచ్చారు. హైదరాబాద్ లో బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ (బిసిసిఏ) విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ “స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రకటించిన పంచ ప్రాణాలు అనుసరించడం ద్వారా 2047 నాటికి భారతదేశం బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా మారవచ్చు” అన్నారు.
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1851994- PM’s address
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో ప్రతిపాదించిన “పంచ-ప్రాణాలు” (ఐదు సంకల్పాలు) శ్రీ గోయెల్ గుర్తు చేస్తూ రాబోయే 25 సంవత్సరాల కాలవ్యవధిలోభారతదేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకునే నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు తమ వంతు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. “భారతదేశ ప్రజలు అత్యంత ప్రధానమైన ప్రాథమిక వసతులు ఆహారం, దుస్తులు, నీడ కోసం బాధపడిన రోజులున్నాయి. ప్రతి ఒక్క పౌరునికి విద్యుత్ సదుపాయంతో కూడిన మంచి ఇల్లు, వంట గ్యాస్, స్వచ్ఛమైన నీరు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, మరుగుదొడ్లు, రోడ్డు అనుసంధానత కల్పించేందుకు తద్వారా ప్రజాజీవితాలు మెరుగుపరిచేందుకు శ్రీ మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా చేసిన కృషి ఫలితంగా భారత జనాభా ఆశావహులయ్యే స్థాయికి సాధికారం అయ్యారు” అని మంత్రి చెప్పారు.
కేంద్రప్రభుత్వం అమలుపరిచిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై), ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, జల్ జీవన్ మిషన్ వంటివి పేదల జీవన నాణ్యత మెరుగుపడేందుకు సహాయకారి అయ్యాయని శ్రీ గోయెల్ చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆహార భద్రతా సంక్షేమ పథకం పిఎంజికెఏవై “సమాజంలో దిగువ శ్రేణిలో ఉన్న ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగించింది, వారి జీవితాలకు స్థిరత్వం కల్పించింది” అని ఆయన అన్నారు. గత 30 సంవత్సరాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 11.8 రెట్లు పెరిగి 300 బిలియన్ డాలర్ల నుంచి 3.5 ట్రిలియన్ డాలర్లకు చేరిందని ఆయన తెలిపారు.
మంచి ఆలోచనలు, ఆకాంక్ష, సామర్థ్యం గల యువత ద్వారానే భారతదేశ పరివర్తన అనే పెను సవాలు సాధ్యమవుతుందని మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం చెప్పేవారన్న విషయం మంత్రి గుర్తుచేశారు.
“మీ అభిరుచుల కోసం పాటుపడండి...కాని భారతదేశం ప్రథమం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి” అని శ్రీ పీయూష్ గోయెల్ పిలుపు ఇచ్చారు.
భారత స్వాతంత్ర్య శతవార్షికోత్సవాలకు దారి తీయనున్న ఈ అమృత కాలం ఈ ప్రయాణంలో భాగస్వాములైన రాబోయే తరాల భవిష్యత్తు ఏమిటనేది నిర్ణయిస్తుందని, ఇందులో విద్యార్థులు, యువతకు అధిక బాధ్యత ఉంటుందని ఆయన సూచించారు.
తమ విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చి దిద్దడానికి, ఈ అమృత కాలంలో దేశ అవసరాలకు ఉపయోపడగలిగే భవిష్యత్ నాయకులుగా ఎదిగేలా చేసేందుకు శేఠ్ ఘాసీరామ్ గోపీకృష్ణ బద్రుకా ఎడ్యుకేషన్ సొసైటీ (1950 ఏర్పాటు), బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ (బిసిసిఏ) అందిస్తున్న సేవలను మంత్రి కొనియాడారు. ఎస్ జిజిబిఇఎస్ గౌరవ కార్యదర్శి, బిసిసిఏ ప్రిన్సిపాల్, బిసిసిఏ విద్యార్థులకు చెందిన ఎస్ జిజిబిఇఎస్ డైరెక్టర్, చైర్మన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ట్వీట్ లింక్ లు :
(Release ID: 1872035)
Visitor Counter : 128