నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 2.0 - హరతీకరణలో భాగంగా ఈ ఏడాది 1 లక్షకు పైగా మొక్కలు నాటిన పారదీప్ పోర్ట్ అథారిటీ
Posted On:
28 OCT 2022 5:07PM by PIB Hyderabad
పరిశుభ్రమైన, హరిత (క్లీన్ అండ్ గ్రీన్) పారదీప్ కల సాకారం చేయడంలో ముందంజలో ఉండి పారాదీప్ పోర్ట్ అథారిటీ (పిపిఎ) తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక ప్రచారం 2.0లో భాగంగా, పిపిఎ చైర్మన్ శ్రీ పి.ఎల్. హరనాధ్ జెబి/ జెసి వాటర్ ట్యాంక్ సమీపంలో ఎస్టీపికి టౌన్‌షిప్ మురుగునీటి కనెక్షన్‌ను ప్రారంభించారు. ఎస్టీపీతో పోర్ట్ టౌన్‌షిప్ మురుగునీటి కాలువలను అనుసంధానించడం వల్ల, మురుగునీరు సమీపంలో ఉన్న చెరువుల వంటి సహజ ప్రవాహాలలోకి ప్రవహించదు, ఫలితంగా ఇటువంటి ప్రవాహాలను సున్నా స్థాయికి తీసుకురావాలన్న కల సాకారం అవుతుంది.
ప్రతి ఏడాదీ పచ్చదనాన్ని పెంపొందించేలా పారదీప్ పోర్ట్ అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఈ ఏడాది నేటివరకు 1,07,000 మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా, శ్రీ హరనాధ్ ఇతర అధికారులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1871766)
Visitor Counter : 113