జల శక్తి మంత్రిత్వ శాఖ

పరిశుభ్రతపై ఉత్సాహభరితంగా 2వ దశ ప్రచార కార్యక్రమం!


పండుగ వాతావరణంలో పాల్గొన్న
జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, విభాగాలు..
స్వచ్ఛతను సంస్థాగతం చేయడం,
పెండింగ్ ఫైళ్లను తగ్గించడమే ప్రధాన లక్ష్యం..

పాఠశాలలు, పార్కులు, కార్యాలయ ఆవరణలు,
సరస్సులు, నీటి కుంటలు, నదీతీరాలు తదితర ప్రాంతాల్లో
ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహణ

కోల్కతా, అహ్మదాబాద్, జమ్ము, భోపాల్, చండీగఢ్,
రాయ్‌పూర్, జైపూర్, డెహ్రాడూన్
తదితర నగరాల్లో కార్యకలాపాలు


Posted On: 28 OCT 2022 5:21PM by PIB Hyderabad

 అపరిష్కృతంగా ఉన్న పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం లక్ష్యంగా పరిశుభ్రతపై రెండవదశ ప్రత్యేక ప్రచార కార్యక్రమం,.. 2022 అక్టోబర్ 2న ప్రారంభమైంది. స్వచ్ఛత/పరిశుభ్రతను, పారిశుద్ధ్యాన్నిసంస్థాగతం చేయడం, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ కార్యాలయాలు, సబార్డినేట్ కార్యాలయాల్లో అపరిష్కృ సమస్యలను తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నెల రోజుల వ్యవధితో చేపట్టిన ఈ కార్యక్రమం 2022 అక్టోబర్ 31వ తేదీతో పూర్తవుతుంది. స్వచ్ఛతా కార్యక్రమంకోసం, ఇతర కార్యకలాపాల కోసం అంతర్గత పర్యవేక్షణా యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడం, రికార్డుల నిర్వహణలో అధికారులకు శిక్షణ ఇవ్వడం, భౌతిక రికార్డులను డిజిటలీకరించడం, ప్రోటోకాల్‌లను నిర్దేశించడం వంటివాటిని కూడా ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యాలుగా పెట్టుకున్నారు.

   నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు నిజమైన స్ఫూర్తితో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ లక్ష్యాలను సంపూర్ణంగా సాధించేందుకు పూర్తి ఉత్సాహంతో, వివిధ రకాల కార్యకలాపాలను కూడా అవి నిర్వహిస్తున్నాయి.  కార్యాలయ ఆవరణలో అంతర్గతంగాను, ఆరుబయట, పరిశుభ్రతా కార్యకలాపాలను నిర్వహించడానికి జలవనరులు, నదీ అభివృద్ధి-గంగా పునరుజ్జీవన శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ సమగ్ర విధానాన్ని అవలంబించింది. ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంత్రిత్వ శాఖల పరిధిలోని వివిధ విభాగాలు/కార్యాలయాలు ఎంతో శ్రద్ధతో కృషి చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర జలసంఘం- కేంద్ర భూగర్భ జలమండలి గణనీయమైన కృషిని సాగిస్తున్నాయి.

 

 

  • దేశవ్యాప్తంగా వివిధ నీటి వనరుల పరిసరాలను శుభ్రపరచే కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు
  • లక్నోలోని గోమతి నది ఒడ్డున కుడియా ఘాట్ వద్ద పారిశుద్ధ్య కార్యక్రమం కేంద్ర భూగర్భజల మండలి (సి.జి.డబ్ల్యు.బి.) ఆధ్వర్యంలో పలు కార్యకలాపాల నిర్వహణ.
  • భువనేశ్వర్‌లో పురావస్థు పరిశోధనా శాఖ ఆధ్వర్యంలోని ఖండగిరి ప్రాంతంలో సి.జి.డబ్ల్యు.బి. ద్వారా ప్రత్యేక పరిశుభ్రతా కార్యక్రమం
  • ఎగువ గంగా బేసిన్ ఆర్గనైజేషన్ కింద అయోధ్య స్థలం ఆవరణను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామంటూ  కేంద్ర జలసంఖం (సి.డబ్ల్యు.సి.) ఉద్యోగులు, అధికారుల ప్రమాణం.
  • ఖడక్‌వాస్లా డ్యామ్ ఒడ్డున పరిశుభ్రతా ప్రత్యేక కార్యక్రమం నేషనల్ వాటర్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహణ.

 

 

 

     దేశంలోని కోల్‌కతా, అహ్మదాబాద్, జమ్ము, భోపాల్, చండీగఢ్, రాయ్‌పూర్, జైపూర్, డెహ్రాడూన్ తదితర నగరాల్లోని పాఠశాలలు, పార్కులు, కార్యాలయాల ఆవరణలు, సరస్సులు, చెరువుకట్టలు, నదుల తీరాలు తదితర ప్రాంతాల్లో సి.జి.డబ్ల్యు.బి. ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు.  వివిధ నగరాల్లోని చెరువులు, సరస్సులు, నదుల వంటి నీటి వనరుల పరిసర ప్రాంతాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఈ శాఖ నిర్వహించింది. మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలోని పోలీస్ తలాబ్, టి. జంక్షన్ ప్రాంతాల్లో రెండవదశ ప్రత్యేక ప్రచారం కింద నాగపూర్‌లోని సి.జి.డబ్ల్యు.జి., నాగపూర్‌ ఆరవ డివిజన్ కార్యాలయం ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు.

  ఉత్తరప్రదేశ్ రాజధాని, లక్నోలోని గోమతి నది ఒడ్డున కుడియా ఘాట్ వద్ద లక్నో బాహ్య పరిశుభ్రతా కార్యక్రమాన్ని సి.జి.డబ్ల్యు.బి. కార్యాలయం నిర్వహించింది. తద్వారా పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన మార్పు తీసుకొచ్చారు. దీనికి తోడుగా, భువనేశ్వర్‌లోని ఖండగిరి పురావస్తు ప్రదేశంలో భువనేశ్వర్‌కు చెందిన సి.జి.డబ్ల్యు.బి. ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని  నిర్వహించారు. సిడబ్ల్యుసి ఎగువ గంగా బేసిన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని అయోధ్య ప్రాంతంలోని ఉద్యోగులు, అధికారులు తమ ఆవరణలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు  ప్రమాణం చేశారు. రెండవ దశ ప్రత్యేక స్వచ్ఛత అభియాన్ కింద అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమాల నిర్వహణకు వారు ప్రతిజ్ఞ చేశారు.

    ప్రత్యేక పారిశుద్ధ్య ప్రచారంలో భాగంగా నేషనల్ వాటర్ అకాడమీ అధికారులు, సిబ్బంది ఖడక్‌వాస్లా డ్యామ్ ఒడ్డున స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమ లక్ష్యానికి మరింత ఊపునిస్తూ, స్వచ్ఛ గంగా జాతీయ పథకం (ఎన్.ఎం.సి.జి.) కార్యాలయం లోపలి భాగంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అనవసరమైన ఫైళ్లను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించివేశారు. అదేవిధంగా, జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్.డబ్ల్యు.డి.ఎ.), కేంద్ర భూసార, మెటీరియల్స్ పరిశోధనా కేంద్రం (సి.ఎస్.ఎం.ఆర్.ఎస్.), కేంద్ర జలవనరుల, విద్యుత్ పరిశోధనా కేంద్రం (సి.డబ్ల్యు.పి.ఆర్.ఎస్.) వంటి కార్యాలయాలు కూడా తమ, తమ సంబంధిత విభాగాలలో  పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాయి. ఫెండింగ్ ఫైళ్లను తగ్గించుకోవడానికి, తమ కార్యాలయ ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించడానికి గణనీయంగా కృషి జరిగింది.  

   Image

Image

  

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛతా కార్యక్రమాల దృశ్యాలు

 

Image  Image

భువనేశ్వర్‌లోని ఖండగిరి పురావస్తు ప్రాంతం వద్ద కేంద్ర జలవనరుల మండలి (సి.జి.డబ్ల్యు.బి. ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

 

****



(Release ID: 1871757) Visitor Counter : 102


Read this release in: English , Urdu , Hindi