వ్యవసాయ మంత్రిత్వ శాఖ

2021-22 సంవత్సరానికి ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పత్తికి సంబంధించిన మూడవ ముందస్తు అంచనాల విడుదల


28.08 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 342.33 మిలియన్ టన్నుల రికార్డు హార్టికల్చర్ ఉత్పత్తి అంచనా

ఈ ఘనత సాధించిన రైతులు, శాస్త్రవేత్తలు, ఉద్యానవన అధికారులను అభినందించిన కేంద్ర వ్యవసాయం,
రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 27 OCT 2022 5:05PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2021-22 సంవత్సరానికి విస్తీర్ణం, వివిధ ఉద్యాన పంటల ఉత్పత్తికి సంబంధించిన 3వ ముందస్తు అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనా ప్రకారం, 28.08 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో రికార్డు స్థాయిలో 342.33 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ ఘనత సాధించిన రైతులు, శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాఖ అధికారులను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అభినందించారు.

2021-22 సంవత్సరానికి వివిధ ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పత్తికి సంబంధించిన మూడవ ముందస్తు అంచనాలు, రాష్ట్రాలు/యుటిలు, ఇతర ప్రభుత్వ మూలాధార సంస్థల నుండి పొందిన సమాచారం ఆధారంగా ... 

 

మొత్తం ఉద్యానవనాలు 

 

2020-21 (చివరి)

2021-22

(రెండవ ముందస్తు అంచనా)

2021-22

(మూడవ ముందస్తు అంచనా)

 

విస్తీర్ణం(మిలియన్ హెక్టార్లలో) 

27.48

27.74

28.08

 

ఉత్పత్తి (మిలియన్ టన్నులలో)

334.60

341.63

342.33

 

 

2021-22 సంవత్సరం (3వ ముందస్తు అంచనా)

 

• మొత్తం హార్టికల్చర్ ఉత్పత్తి 2021-22 సంవత్సరంలో 342.33 మిలియన్ టన్నులుగా అంచనా. ఇది 2020-21 (చివరి) సంవత్సరంలో దాదాపు 7.73 మిలియన్ టన్నుల (2.3% పెరుగుదల) పెరుగుదలను చూపుతుంది.

• పండ్ల ఉత్పత్తి 2020-21లో 102.48 మిలియన్ టన్నుల నుండి 107.24 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు.

• కూరగాయల ఉత్పత్తి 2020-21లో 200.45 మిలియన్ టన్నుల నుండి 204.84 మిలియన్ టన్నులుగా అంచనా .

• ఉల్లిపాయల ఉత్పత్తి 2020-21 సంవత్సరంలో 26.64 మిలియన్ టన్నుల నుండి 31.27 మిలియన్ టన్నులుగా అంచనా .

• బంగాళదుంపల ఉత్పత్తి 2020-21లో 56.17 మిలియన్ టన్నుల నుండి 53.39 మిలియన్ టన్నులుగా అంచనా .

• టొమాటో ఉత్పత్తి 2020-21లో 21.18 మిలియన్ టన్నుల నుండి 20.33 మిలియన్ టన్నులుగా అంచనా వేయడం జరిగింది. 

 

****



(Release ID: 1871596) Visitor Counter : 172


Read this release in: Odia , English , Urdu , Hindi