మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (ఎన్ఎంఎంఎస్ఎస్) కోసం దరఖాస్తులను (తాజా/పునరుద్ధరణ) సమర్పించడానికి చివరి తేదీ 31 అక్టోబర్, 2022 నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్పీ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

प्रविष्टि तिथि: 26 OCT 2022 3:44PM by PIB Hyderabad

2022–-23 సంవత్సరానికి ఎన్ఎంఎంఎస్ఎస్ కోసం దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 31, 2022. 'నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్' కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేయబడతాయి. ఎనిమిది–  సెకండరీ దశలో వారి విద్యను కొనసాగించడానికి వారిని ప్రోత్సహించడానికి దీనిని చెల్లిస్తారు. ప్రతి సంవత్సరం తొమ్మిదో తరగతి నుండి ఎంపిక చేసిన విద్యార్థులకు ఒక లక్ష కొత్త స్కాలర్‌షిప్‌లు అందజేయబడతాయి.  రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక  స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పది నుండి 12 తరగతులలో వారి స్కాలర్షిప్ కొనసాగింపు/పునరుద్ధరణ కూడా ఉంటుంది. ఏటా స్కాలర్‌షిప్ మొత్తం రూ. 12000 చెల్లిస్తారు.  నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (ఎన్ఎంఎంఎస్ఎస్) నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్పీ)లో చేర్చబడింది. ఇది - విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్ పథకాల కోసం ఒక స్టాప్ ప్లాట్‌ఫారమ్. ఎన్ఎంఎంఎస్ఎస్ స్కాలర్‌షిప్‌లు డీబీటీ మోడ్‌ను అనుసరించి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్  ద్వారా ఎలక్ట్రానిక్ బదిలీ ద్వారా ఎంచుకున్న విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా పంపిణీ చేయబడతాయి. ఇది 100శాతం కేంద్ర ప్రాయోజిత పథకం.

 

అన్ని మూలాల నుండి తల్లిదండ్రుల ఆదాయం రూ. 3,50,000 కంటే ఎక్కువ లేని విద్యార్థులు. సంవత్సరానికి స్కాలర్‌షిప్‌లను పొందేందుకు అర్హులు. స్కాలర్‌షిప్ అవార్డు కోసం ఎంపిక పరీక్షలో హాజరు కావడానికి విద్యార్థులు ఎనిమిదో తరగతి పరీక్షలో కనీసం 55శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 5శాతం సడలింపు ఉంటుంది). ధృవీకరణ  రెండు స్థాయిల్లో ఉంటాయి. ఎల్1 అనేది ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ (ఐఎన్ఓ) స్థాయి  ఎల్2 జిల్లా నోడల్ ఆఫీసర్  స్థాయి. ఐఎన్ఓ స్థాయి (ఎల్1) ధృవీకరణ  చివరి తేదీ నవంబర్ 15, 2022  డీఎన్ఓ స్థాయి (ఎల్2) ధృవీకరణ  చివరి తేదీ నవంబర్ 30, 2022.

 
***
 

(रिलीज़ आईडी: 1871413) आगंतुक पटल : 275
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Tamil