బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు మంత్రిత్వ శాఖ & అనుబంధ సంస్థల ద్వారా స్వచ్ఛతా ఉద్యమం మరియు అవగాహన కార్యక్రమం

Posted On: 27 OCT 2022 6:07PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు దాని అనుబంధ సంస్థలలో ప్రత్యేక స్వచ్ఛతా ఉద్యమం 2.0లో భాగంగా ఎంఓసి మరియు దాని అనుబంధ సంస్థలు  అనుసరించిన కొన్ని ఉత్తమ అభ్యాసాలు జాబితా చేయబడ్డాయి:

స్వచ్ఛతా ఉద్యమంలో కొన్ని ఉత్తమ అభ్యాసాల్లో భాగంగా హైదరాబాద్‌ ఎస్‌సిసిఎల్‌లోని కొత్తగూడెం ఏరియా స్క్రాప్ యార్డ్ క్రాప్ ల్యాండ్‌గా మార్చబడింది.

 

image.png


ఒడిశాలోని ఎంసిఎల్ అన్ని కాలనీలకు కాల్ సెంటర్ ఏర్పాటు చేయబడింది. ఎంసీఎల్‌ ఒడిశాలోని మొత్తం 37 కాలనీల ఏఎంసీ  పనులు కాల్ సెంటర్‌తో అనుసంధానించబడ్డాయి మరియు కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం జరుగుతుంది.

రాంచీ సమీపంలోని పాఠశాలలు/గ్రామాల్లో ఆరోగ్యం, పరిశుభ్రతపై సిసిఎల్  అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అలాగే చెత్తను మెరుగైన పద్దతుల్లో సేకరించేందుకు సమీపంలోని ప్రాంతాలు/పాఠశాలలకు డస్ట్‌బిన్‌లను పంపిణీ చేస్తోంది.

నాగ్‌పూర్ కాలనీలు, గ్రామాలు, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛత ర్యాలీలు, నూక్కడ్ నాటక్, పాఠశాల పిల్లలకు పోటీలు మొదలైన వాటి రూపంలో డబ్ల్యూసిఎల్ పరిశుభ్రత/అవగాహన డ్రైవ్‌లను నిర్వహించింది.

ప్రత్యేక స్వచ్ఛతా ఉద్యమం 2.0లో భాగంగా ఎస్‌ఈసిఎల్‌ భట్‌గావ్‌లో 0.5 ఎంఎల్‌డి సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని (ఎస్‌టిపి) భట్‌గావ్ విధానసభ ఎమ్మెల్యే శ్రీ పరస్నాథ్ రాజ్వాడే ప్రారంభించారు.

కాలనీల నుండి గృహ వ్యర్థాలను ప్రతిరోజూ ట్రై-సైకిల్/ట్రక్కులో సేకరించి మున్సిపాలిటీ గుర్తించిన ప్రదేశాలలో వేరుచేయడం జరుగుతుంది. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం అధీకృత రీసైక్లర్‌లకు బయో మెడికల్ వేస్ట్ అందించబడుతుంది.

పర్యావరణ నష్టాన్ని నివారించడానికి ప్రమాదకర & ఈ-వ్యర్థాల స్క్రాప్ మెటీరియల్‌లను ప్రత్యేకంగా మూసి ఉన్న ప్రాంగణంలో ఉంచుతారు. పర్యావరణ పరిరక్షణ మార్గదర్శకాలను అనుసరించి ఈ వ్యర్ధాల తొలగింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతుంది.  ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2016 ప్రకారం ఉపయోగించిన నూనె, బ్యాటరీలు మరియు ఖాళీ ఆయిల్ బ్యారెల్స్ వంటి ప్రమాదకర వ్యర్థాలను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధీకృత రీసైక్లర్‌లకు అందజేస్తారు.

ఉత్పత్తి చేయబడిన బయోమెడికల్ వ్యర్థాలు (ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలు) సూచించిన నిబంధనల ప్రకారం పసుపు, ఎరుపు, తెలుపు, నీలం మరియు నలుపు వంటి రంగు కోడెడ్ బ్యాగ్‌లలో వర్గీకరించబడతాయి మరియు అధీకృత వేస్ట్ మేనేజ్‌మెంట్ ఏర్పాట్ల ద్వారా సురక్షితంగా తొలగించబడతాయి.

ముక్తి మిషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి రష్మీ సాహా ముఖ్య వక్తగా చేరడంతో ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లా ధన్‌కౌడ బ్లాక్‌లోని బసంత్‌పూర్ గ్రామంలో గ్రామీణ మహిళలకు మానసిక ఆరోగ్యం & వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన శిబిరం నిర్వహించబడింది.

 

image.png

 

స్వచ్ఛతా రథ్‌ల ద్వారా పరిశుభ్రతపై అవగాహన: పరిశుభ్రత మరియు పారిశుధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎన్‌సిఎల్,ఎంపీ స్వచ్చతా రథ్‌లను ఏర్పాటు చేసింది.
 

image.png

image.png

 

వాల్ పెయింటింగ్ అనేది ఒక శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనం, ఇది పరిశుభ్రత సందేశాన్ని అందించడానికి ఎన్‌సిఎల్‌లో ఉపయోగించబడుతుంది. పరిశుభ్రమైన పరిసరాలను నిర్వహించడం పట్ల అభ్యాసాలను పాటించేలా ప్రజలను ప్రేరేపించడంలో అది సృష్టించే ప్రభావం యొక్క పరిమాణాన్ని ఎన్‌సిఎల్‌ పూర్తిగా అర్థం చేసుకుంది.

అమ్లోహ్రీ ఏరియా, ఎన్‌సిఎల్‌ (2) ద్వారా ఐఈసీ అవేర్‌నెస్ స్వచ్ఛతపై అవగాహన

 

బ్యానర్/మెసేజ్ డిస్‌ప్లే ద్వారా పరిశుభ్రతపై అవగాహన


image.pngimage.pngimage.png


ప్రజలకు సందేశాన్ని తెలియజేయడానికి శక్తివంతమైన సాధనాల్లో డిస్‌ప్లే బ్యానర్‌లు ఒకటి. కీలకమైన ప్రదేశాలలో బ్యానర్‌లను ఉంచడం, స్వచ్ఛతా రథ్‌లో ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా సందేశాన్ని ప్రదర్శించడం వంటి విభిన్న మార్గాల ద్వారా సందేశాలను ప్రదర్శించడంలో ఎన్‌సిఎల్‌ కొన్ని వినూత్న ఆలోచనలను కూడా అవలంబించింది.

నుక్కడ్ నాటకాల ద్వారా పరిశుభ్రతపై అవగాహన

 

 నుక్కడ్ నాటకం అనేది ప్రజలలో సామాజిక స్పృహ కలిగించడానికి ప్రదర్శించే ఒక కళారూపం. భారతీయ సమాజంలో సామాజిక అవగాహన సాధనంలో నుక్కడ్ నాటకాలు ఎల్లప్పుడూ అంతర్భాగంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాలు/యూనిట్లలో  ఎన్‌సిఎల్ నుక్కడ్ నాటకాలను నిర్వహిస్తోంది.


image.pngimage.png

సెమినార్లు మరియు కౌన్సెలింగ్ ద్వారా పరిశుభ్రత అవగాహన

వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించడానికి  సెమినార్లు మరియు కౌన్సెలింగ్ సెషన్‌లను ఎన్‌సిఎల్‌ నిర్వహిస్తోంది. ఇది పరిశుభ్రమైన కార్యాలయం మరియు నివాస వసతిని నిర్వహించడానికి సమగ్ర శుభ్రపరచడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది.

 

image.pngimage.pngimage.png
 

****


(Release ID: 1871399) Visitor Counter : 142


Read this release in: Urdu , English , Hindi