జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెప్టెంబర్ నెలకు 'వాటర్ హీరోస్: షేర్ యువర్ స్టోరీస్' పోటీ విజేతను ప్రకటించిన జల్ శక్తి మంత్రిత్వ శాఖ


నీటి విలువ, నీటి సంరక్షణ , నీటి వనరుల సుస్థిర అభివృద్ధిని పెంపొందించడం పోటీ లక్ష్యాలు

Posted On: 26 OCT 2022 6:19PM by PIB Hyderabad

జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జలవనరులు, నదుల అభివృద్ధి , గంగా పునరుజ్జీవన శాఖ మైగవ్ పోర్టల్ లో నెలవారీగా నిర్వహించే 'వాటర్ హీరోస్: షేర్ యువర్ స్టోరీస్' పోటీ కి సంబంధించి సెప్టెంబర్ 2022 నెలకు శ్రీమతి అనామికా తివారీని విజేతగా ప్రకటించింది. ఆమెకు రూ. 10,000/- నగదు బహుమతి,  సర్టిఫికేట్ లభిస్తుంది. శ్రీమతి అనామికా తివారీ ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు/ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. పాఠశాలలో నాటకాల ద్వారా నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు బోధించే ప్రయత్నం చేస్తున్నారు.

 

సెప్టెంబర్ 2022 నెలకు గాను శ్రీమతి అనామికా తివారిని విజేతను ప్రకటించారు

విజేతకు రూ. 10,000/- నగదు బహుమతి, సర్టిఫికేట్ లభిస్తుంది.

పొందాలి.

MyGov పోర్టల్ (www.mygov.in) పై నెలవారీ పోటీ నిర్వహిస్తారు.

ఎడిషన్ 2022 నవంబర్ 30న ముగుస్తుంది.

 

సాధారణంగా నీటి విలువను పెంపొందించడం,  నీటి సంరక్షణ మరియు నీటి వనరుల సుస్థిర అభివృద్ధిపై దేశవ్యాప్త ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం ఈ పోటీ లక్ష్యం.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

దార్శనికత కు అనుగుణంగా దేశంలో

జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టేలా పెద్ద ఎత్తున ప్రజలను ప్రేరేపించాలి.నీటి వీరుల జ్ఞానాన్ని పెంపొందించడం , అనుభవాలను పంచుకోవడం ద్వారా నీటి సంరక్షణ పై  అవగాహన కల్పించడం ఈ పోటీ లక్ష్యం; నీటి సంరక్షణ , నిర్వహణ పట్ల ఒక దృక్పథాన్ని ఏర్పరిచి తద్వారా భాగస్వాములందరి మధ్య ప్రవర్తనా పరమైన మార్పు  తీసుకురావాలని భావిస్తున్నారు.

 

ఈ పోటీని నెలవారీగా నిర్వహిస్తున్నారు.

దీనిని MyGov పోర్టల్ లో చూడవచ్చు. మూడవ ఎడిషన్ 01.12.2021 న ప్రారంభమయింది. మైగోవ్ పోర్టల్ లో 30.11.2022 న ముగుస్తుంది. మొదటి ఎడిషన్ 01.09.2019 నుండి 30.08.2020 వరకు జరిగింది. 2వ ఎడిషన్ ను 19.09.2020 నుంచి 31.08.2021 వరకు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొనడానికి, నీటి సంరక్షణ ప్రయత్నాలపై వారి విజయ గాథలను 1-5 నిమిషాల వీడియో రూపంలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది, 300 పదాలతో కూడిన ఒక వర్ణన తో పాటు , వాటిని తెలిపే కొన్ని ఛాయాచిత్రాలు/ఫోటోలను జతచేయాలి. అలాగే, పాల్గొనేవారు తమ వీడియోలను (వారి YouTube వీడియోకు లింక్ తో) MyGov పోర్టల్ (www.mygov.in) లో భాగస్వామ్యం చేయవచ్చు. దీనికి అదనంగా, ఎంట్రీలను waterheoes.cgwb[at]gmail[dot]com వద్ద కూడా సబ్మిట్ చేయవచ్చు.

 

*****


(Release ID: 1871102) Visitor Counter : 143


Read this release in: English , Urdu , Hindi