ఆర్థిక మంత్రిత్వ శాఖ

2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్నులు సమర్పించాల్సిన గడువును పెంచిన సీబీడీటీ

Posted On: 26 OCT 2022 9:20PM by PIB Hyderabad

2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్నులు సమర్పించాల్సిన గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పెంచింది. 2022 అక్టోబర్‌ 31లోగా రిటర్నులు చెల్లించాల్సిన అసెసీ వర్గాల కోసం ఈ గడువును 2022 నవంబర్‌ 7వ తేదీ వరకు పొడిగించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139(1) ప్రకారం తుది గడువును పెంచింది.

ఎఫ్‌.నం.225/49/2021/ఐటీఐ-IIలో సర్క్యులర్‌ నంబర్‌ 20/2022ను 26.10.2022న జారీ చేసింది. www.incometaxindia.gov.inలో ఈ సర్క్యులర్‌ను చూడవచ్చు.

***(Release ID: 1871089) Visitor Counter : 134