వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ సహ అధ్యక్షతన వ్యవసాయ అటవీశాఖపై జరిగిన 7వ ఆసియాన్ భారత్ మంత్రివర్గ సమావేశం
ప్రజారోగ్యం మరియు పోషణ కోసం పోషకమైన తృణధాన్యాల ఉత్పత్తులను భారతదేశం ప్రోత్సహిస్తుంది- శ్రీ తోమర్
వ్యవసాయ అభివృద్ధికి ఆసియాన్ దేశాలతో సన్నిహిత ప్రాంతీయ సహకారం భారతదేశ ప్రాధాన్యత
Posted On:
26 OCT 2022 5:43PM by PIB Hyderabad
వ్యవసాయం మరియు అటవీశాఖపై 7వ ఆసియాన్ భారత్ మంత్రుల సమావేశం (ఏఐఎంఎంఏఎఫ్) ఈరోజు వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షత వహించారు. బ్రూనై దారుస్సలాం, కంబోడియా, ఇండోనేషియా, లావో పీడీఆర్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్ మరియు వియత్నాం వ్యవసాయ శాఖ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తన ప్రారంభ వ్యాఖ్యలలో భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఆసియాన్‌ను కేంద్రంగా ఉంచాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనను పునరుద్ఘాటించారు. స్థిరమైన మరియు సమ్మిళిత వృద్ధిని నిర్ధారించడానికి ఆసియాన్‌తో పరస్పర సన్నిహిత ప్రాంతీయ సహకారాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు. మిల్లెట్ (పోషక-తృణధాన్యాలు) పౌష్టికాహారం మరియు అంతర్జాతీయ పోషక తృణధాన్యాల సంవత్సరం 2023 గురించి ప్రస్తావిస్తూ మిల్లెట్ ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు మరియు వినియోగాన్ని పెంచడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఆసియాన్ సభ్య దేశాలను శ్రీ తోమర్ కోరారు. ప్రజల ఆరోగ్యం మరియు పౌష్టికాహారం కోసం భారతదేశం పోషకమైన తృణధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహిస్తుందని శ్రీ తోమర్ అన్నారు. పోషకమైన తృణధాన్యాలు తక్కువ వనరుల అవసరం మరియు మరింత సమర్థవంతమైన వ్యవసాయ ఆహార వ్యవస్థలతో పోషకాలను సృష్టించడంలో సహాయపడతాయన్నారు.
ఈ సమావేశంలో ఆసియాన్ ఇండియా కోఆపరేషన్ (2021-2025 సంవత్సరం) మధ్యకాలిక కార్యాచరణ ప్రణాళిక కింద వివిధ కార్యక్రమాలు మరియు కార్యకలాపాల అమలులో పురోగతిని సమీక్షించారు. ఆసియాన్ భారత్ సంబంధాల 30వ వార్షికోత్సవాన్ని కూడా ఈ సమావేశం స్వాగతించింది. ఈ సమావేశంలో వ్యవసాయం మరియు అటవీ రంగాలలో ఆసియాన్-భారత్ సహకారానికి నిబద్ధతను పునరుద్ఘాటించారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి, ఆసియాన్ మరియు భారతదేశానికి సురక్షితమైన మరియు పోషకమైన వ్యవసాయ ఉత్పత్తుల అవాంతరాలు లేని సప్లైని నిర్ధారించడానికి, ఆసియాన్-భారత్ సహకారంతో నిరంతర చర్యలు తీసుకోవడం అవసరమని సమావేశం అభిప్రాయపడింది. ఆహార భద్రత, పోషకాహారం, వాతావరణ మార్పుల అనుకూలత, డిజిటల్ వ్యవసాయం, ప్రకృతి అనుకూల వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, వాల్యూ చైన్, వ్యవసాయ మార్కెటింగ్ మరియు సామర్థ్య నిర్మాణంలో ఆసియాన్‌తో భారతదేశ సహకారాన్ని పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి శ్రీ తోమర్ తెలిపారు.
*****
(Release ID: 1871088)
Visitor Counter : 179