రక్షణ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా తన క్షేత్ర స్థాయి కార్యాలయాలలో స్వచ్ఛతను సంస్థాగతీకరించిన రక్షణ ఉత్పత్తి విభాగం
Posted On:
25 OCT 2022 1:24PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా 294 ప్రాంతాలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ (రక్షణ ఉత్పత్తి విభాగం) పారిశుద్ధ్య డ్రైవ్‌ను నిర్వహించింది. అంతేకాకుండా, పార్లమెంటు సభ్యుల నుంచి వచ్చిన సూచనలలో పెండింగ్‌లో ఉన్న 9 అంశాలను, పిఎంఒ సూచించిన ఒక ప్రజా సమస్యను, 231 సా్వత్రిక ప్రజా సమస్యలను ఈ కాలంలో విభాగం పరిష్కరించింది. దాదాపు 850 భౌతిక ఫైళ్ళను సమీక్షించి, ఇందులో 322 ఫైళ్ళను తొలగించారు. ఇప్పటివరకూ చెత్త విక్రయాల నుంచి మొత్తంగా రూ. 10.72,00,960 ఆదాయం రాగా, మొత్తం 75,145 చదరపు అడుగుల స్థలం ఖాళీ అయింది.
తమ క్షేత్ర స్థాయి కార్యాలయాలు, స్థానిక యూనిట్లు, న్యూఢిల్లీలో ఉన్న కార్యాలయాల వ్యాప్తంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ 2 అక్టోబర్ 2022 నుంచి స్వచ్ఛతపై ప్రత్యేక ప్రచారం 2.0ను నిర్వహిస్తోంది. ఇది 14 నుంచి 30 సెప్టెంబర్, 2022 వరకు సన్నాహక దశగా ప్రారంభమైంది. ఈ కాలంలో ప్రచార సమయం కోసం లక్ష్యాలను గుర్తించారు. ఈ ఏడాది క్షేత్ర / వేరు ప్రాంతాల(ఔట్ స్టేషన్)లో ఉన్న కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రచార సమయంలో ప్రజా వినిమయ సీమ (పబ్లిక్ ఇంటర్‌ఫేస్), సేవల బట్వాడాకు బాధ్యత వహించే కార్యాలయాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు.
ప్రత్యేక ప్రచారం 2.0 సమయంలో పారిశుద్ధ్య డ్రైవ్ కోసం గుర్తించిన మొత్తం 358 ఔట్ స్టేషన్ ప్రదేశాలలో 294 ప్రదేశాలను ఇప్పటికే కవర్ చేశారు. ఇలా గుర్తించిన ఔట్ స్టేషన్ ప్రదేశాలలో 16 రక్షణకు ప్రభుత్వ రంగ సంస్థలు, కర్మాగార యూనిట్లు తదితరాలు ఉన్నాయి. ప్రత్యేక ప్రచారం 2.0ను సమర్ధవంతమైన పర్యవేక్షణను నిర్ధారించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ డాష్‌బోర్డ్ / పోర్టల్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ దోహదం చేస్తూ, సహకరిస్తోంది,
***
(Release ID: 1870793)
Visitor Counter : 161