ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

219.56 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.12 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,549

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 862

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 1.02%

Posted On: 25 OCT 2022 9:36AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 219.56 కోట్ల ( 2,19,56,65,598 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.12 కోట్లకు పైగా ( 4,12,36,182 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415382

రెండో డోసు

10120519

ముందు జాగ్రత్త డోసు

7069358

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18437135

రెండో డోసు

17720303

ముందు జాగ్రత్త డోసు

13745629

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

41236182

రెండో డోసు

32344170

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

62005981

రెండో డోసు

53318923

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561408056

రెండో డోసు

516296383

ముందు జాగ్రత్త డోసు

100514534

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204047905

రెండో డోసు

197071253

ముందు జాగ్రత్త డోసు

50693087

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127680918

రెండో డోసు

123216837

ముందు జాగ్రత్త డోసు

48323043

ముందు జాగ్రత్త డోసులు

22,03,45,651

మొత్తం డోసులు

2,19,56,65,598

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,549. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,503 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,93,409 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 862 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 63,786 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90.01 కోట్లకు పైగా ( 90,01,49,497 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.02 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1870752)