గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

వివిధ పరిశుభ్రత కార్యకలాపాల ద్వారా ప్రత్యేక స్వచ్ఛత ఉద్యమం 2.0ని పాటిస్తోన్న గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ


ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థులు స్వచ్ఛ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా రికార్డుల సమీక్ష మరియు ఫైళ్ల తొలగింపు

Posted On: 23 OCT 2022 8:21PM by PIB Hyderabad

2 అక్టోబర్ నుండి 31 అక్టోబర్, 2022 వరకు అవుట్‌స్టేషన్ కార్యాలయాలు, అటాచ్డ్/సబార్డినేట్ ఆఫీసులలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్వచ్ఛత ఉద్యమం 2.0 చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా న్యూఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లోని జీవన్ తారా భవనం, మరియు జాతీయ గిరిజన పరిశోధనా సంస్థలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయాలు మరియు విభాగాలను తనిఖీ చేశారు.


 

image.png

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీఅర్జున్ ముండా తన మంత్రిత్వ శాఖలోని వివిధ కార్యాలయాలను సందర్శించిన సందర్భంగా కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు చర్యలను కూడా సమీక్షించారు.

image.png

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ ఝా మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు మరియు సిబ్బంది కూడా కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి జీవన్ తారా భవనం మరియు జాతీయ గిరిజన పరిశోధనా సంస్థలోని మంత్రిత్వ శాఖ సబార్డినేట్ డివిజనల్ కార్యాలయాలను సందర్శించారు.

మంత్రిత్వ శాఖ చేస్తున్న పాత రికార్డుల తొలగింపు మరియు డిజిటలైజేషన్ కసరత్తుల ప్రక్రియను కార్యదర్శి సమీక్షించారు. రికార్డు గదిని తనిఖీ చేసి అధికారిక విధానాల ప్రకారం తొలగించబడ్డ ఫైళ్లు, రికార్డులను పరిశీలించారు.

ఈ కార్యక్రమం కార్యాలయాల్లో పరిశుభ్రత మరియు ఫిర్యాదులు, వీఐపీ రిఫరెన్స్ మరియు పార్లమెంటరీ సమస్యల పెండింగ్‌ను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.

image.pngimage.png

దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, అనుబంధ కార్యాలయాలతో సహా 300 కంటే ఎక్కువ ప్రాంగణాల్లో ఈ కార్యక్రమం జరిగింది.

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థులు స్వచ్ఛ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

image.pngimage.png

అధికారులు మరియు సిబ్బందికి పరిశుభ్రమైన పని వాతావరణాన్ని అందించడం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ శాఖలలో పరిశుభ్రత గురించి ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ అవగాహన డ్రైవ్ నిర్వహించబడుతోంది.

 

*****



(Release ID: 1870652) Visitor Counter : 148


Read this release in: English , Urdu , Hindi