పార్లమెంటరీ వ్యవహారాలు

పెండింగ్ వ్యవహారాల పరిష్కారం కోసం స్పషల్ కాంపెయిన్ 2.0


పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2 నుంచి 31 అక్టోబర్ వరకు మంచి ఊపులో నడుస్తున్న పనులు

Posted On: 21 OCT 2022 1:23PM by PIB Hyderabad

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పెండింగులో ఉన్న ఎంపిల నిర్దేశాలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రస్తావనలు, అంతర్ మంత్రిత్వ శాఖ అభిప్రాయాలు, పార్లమెంటరీ హామీలు, పిఎంఒ నిర్దేశాలు, ప్రజా సమస్యలు, పిజి అప్పీళ్ళను గుర్తించడం ద్వారా మెరుగైన రికార్డు నిర్వహణ కోసం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రచారం (స్పెషల్ కాంపెయిన్) 2.0ని ఉపయోగిస్తోంది. 
ప్రచారం కింద మంత్రిత్వ శాఖ రికార్డు నిర్వహణకు ప్రాధాన్యతను ఇచ్చి దృష్టి కేంద్రీకరిస్తోంది. మంత్రిత్వ శాఖ 373 భౌతిక ఫైళ్ళను, 461 ఇ-ఫైళ్ళను గుర్తించి, వరుసగా సమీక్షించి, ప్రచారం ముగిసే లోపు సమీక్షా పనిని మంత్రిత్వ శాఖ పూర్తి చేయనుంది. 
మంత్రిత్వ శాఖ ప్రజా ఫిర్యాదులు, పిఎంఒ నిర్దేశాలను ప్రాధాన్యతా క్రమంలో మంత్రిత్వ శాఖ నిర్వహించి, తక్షణ చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం పెండింగ్ లో ఏమీ లేవు. నేటి వరకూ మంత్రిత్వ శాఖ వద్ద కేవలం నాలుగు హామీలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి, వాటిని కేబినెట్ సెక్రటరియట్ ఆదేశాల మేరకు శాసన శాఖకు బదిలీ చేసి, ఇవి శాసన శాఖ ఆమోదానికి లోబడి మంత్రిత్వ శాఖలో పెండింగ్ లో ఉన్నట్టు చూపడం జరుగుతోంది. 
మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా సున్నాలు వేయడం, పాత ఫర్నిచర్ ను మార్చడం, మంత్రిత్వ శాఖలో చెత్తను గుర్తించడం వంటి పారిశుద్ధ్య డ్రైవ్లను నిర్వహిస్తోంది.  పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని నిత్య కార్యకలాపాలుగా నిర్వహించాల్సిన అవసరాన్ని పట్టి చూపేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారు. మంత్రిత్వ శాఖ యువజన పార్లమెంటులు, ఎన్ఇవిఎ సెల్ లో జరిగే సదస్సుల్లో ప్రత్యేక ప్రచారం 2.0ను సమర్ధిస్తోంది. 
అంతేకాకుండా, మంత్రిత్వ శాఖ ప్రధానద దృష్టి డిజిటీకరణ.  పోర్టల్ పై మంత్రిత్వ శాఖ  డిజిటల్ చొరవలలో ఇ ఆఫీస్ వర్షన్ 6.2.0, ఇ-హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్, కన్సల్టేటివ్ కమిటీ మేనేజ్ మెంట్ సిస్టం పోర్టల్, క్లెయిములు, ఇన్వెంటరీ మేనేజ్ మెంట్ వ్యవస్థ, ఎన్ఇవిఎ అప్లికేషన్, ఒఎఎంఎస్ పోర్టల్, జాతీయ యువజన పార్లమెంటు పథకం ఉన్నాయి. 
ఉత్తమ ఆచరణలకు అనుగుణంగా, జాతీయ ఇ- విధాన్ అప్లికేషన్ (ఎన్ఇవిఎ); ఒక దేశం - ఒక అప్లికేషన్- ఎన్ఇవిఎను అన్ని రాష్ట్ర/  కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభలను కాగితరహితం చేయడం, వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో సమాచార మార్పిడి కోసం అన్ని ప్రక్రియలను క్రమబద్ధీకరించి, నిజ సమయంలో సార్వత్రిక పోర్టల్లో అనుమతించిన విషయాలను ప్రచురించడం, ఎన్ఇవిఎ వెబ్ ఆధారిత (ఆండ్రాయిడ్ & ఐఒఎస్ రెండింటినీ) ప్లాట్ ఫారమ్ లలో జాతీయ, రాష్ట్ర శాసన సభలలో ఒకే రకమైన పద్ధతిలో పని చేస్తుంది. 

***

 



(Release ID: 1870176) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi