భారత పోటీ ప్రోత్సాహక సంఘం
వెర్వెంటా హోల్డింగ్స్ కు ఎస్ బ్యాంక్‌లో 10% వరకు ఈక్విటీ సెక్యూరిటీలను కొనుగోలు చేసుకోవడానికి ఆమోదం తెలిపిన సిసిఐ
प्रविष्टि तिथि:
20 OCT 2022 8:59PM by PIB Hyderabad
ఎస్ బ్యాంక్‌లో 10% వరకు ఈక్విటీ సెక్యూరిటీలను కొనుగోలు చేసుకోవడానికి వెర్వెంటా హోల్డింగ్స్ కి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ) ఆమోదం తెలిపింది.
వెర్వెంటా హోల్డింగ్స్ లిమిటెడ్ (అక్వైరర్) ఒక పెట్టుబడి హోల్డింగ్ కంపెనీ. ప్రస్తుతం భారతదేశంలో సంస్థ ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు.
ఎస్ బ్యాంక్ లిమిటెడ్ (టార్గెట్) అనేది బ్యాంకింగ్ మరియు విస్తృత ఆర్థిక సేవల శ్రేణిని అందించడంలో నిమగ్నమైన బ్యాంకింగ్ కంపెనీ.
మొత్తం చెల్లించిన వాటాల మూలధనంలో 10% వరకు ఈక్విటీ సెక్యూరిటీల స్వాధీనానికి సంబంధించిన ప్రతిపాదిత కలయికను కమిషన్ ఆమోదించింది మరియు (ప్రతిపాదిత కలయిక ద్వారా అక్వైరర్ టార్గెట్ కి చెందిన ఓటింగ్ హక్కులు పొందడానికి రూపొందిన ప్రతిపాదనను కూడా సీసీఐ ఆమోదించింది.
సవివరమైన సిసిఐ ఉత్తర్వులు తర్వాత విడుదల అవుతాయి.
***
(रिलीज़ आईडी: 1869933)
आगंतुक पटल : 153