రక్షణ మంత్రిత్వ శాఖ
భౌగోళిక-రాజకీయ సవాళ్లకు ప్రతిస్పందించేందుకు ఆత్మనిర్భరత ద్వారా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన రక్షణ మంత్రి
భారతీయ రక్షణ పరిశ్రమ వృద్ధికి ఆత్మనిర్భర్ రక్షణ యొక్క రెండు విభాగాలైన సాయుధ దళాలు, పరిశ్రమల మధ్య సమతుల్యత అవసరం.
శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 'ఆత్మనిర్భర్ భారత్'పై HQ-IDS-FICCI సెమినార్‌లో పరిశ్రమ వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు; ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు
Posted On:
20 OCT 2022 8:17PM by PIB Hyderabad
రక్షణ రంగ ఆత్మనిర్భరత రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పరిశ్రమ యొక్క రెండు విభాగాలైన, తయారీదారులు- సరఫరా అదేవిధంగా సాయుధ బలగాలు- వినియోగదారులు, డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని మంత్రి అన్నారు. అక్టోబర్ 20, 2022న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 12వ డిఫెక్స్‌పోలో భాగంగా ఫిక్కీ, సమీకృత రక్షణ సిబ్బంది ప్రధాన కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘ఆత్మనిర్భర్ భారత్ & మేక్ ఇన్ ఇండియా: సాయుధ బలగాల కోసం రోడ్‌మ్యాప్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు.
శ్రీ రాజ్‌నాథ్ సింగ్ భారత రక్షణ రంగంలోని ఈ రెండు విభాగాల సమన్వయంతో సరికొత్త శిఖరాలను చేరుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు. సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం యొక్క స్వదేశీకరణ ఆవశ్యకతను తెలిపారు. ప్రత్యర్థులకు మనం అందించే ప్రతిస్పందనలో కొత్తదనంలో ఉండాలని ఆయన తెలిపారు. వేగంగా మారుతున్న భౌగోళిక-రాజకీయ వాతావరణంలో సవాళ్లను ఎదుర్కోవడంలో సంసిద్ధత, ముఖ్యంగా పొరుగు ప్రాంతాల చర్యలు, ఇటీవలి కాలంలో పెరిగాయని అన్నారు. అందుకోసం ఈ పురోగతిని కొనసాగించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
మిలిటరీ సామగ్రిని కొనుగోలు చేయడం ఆలస్యమైందని, వాటి ప్రత్యేకత రాజీపడిందని, అలాగే ఇది ఇతరుల ప్రమాణాల కంటే తక్కువగా ఉందని రక్షణ మంత్రి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, భారత్ స్వదేశీకరణ చేయడం అత్యవసరం. మూలధన అందుబాటు, సాంకేతికతను అందుబాటులో ఉంచడం, పరిశోధనాభివృద్ధి పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి, పెద్ద మార్కెట్ ద్వారా మన రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడానికి తీసుకున్న వివిధ చర్యలను మంత్రి తెలిపారు. 2022-23 సంవత్సరానికి దేశీయ పరిశ్రమకు మూలధన సేకరణ బడ్జెట్‌లో 68% రిజర్వేషన్లు పెట్టడం జరిగింది, ప్రైవేట్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు మరియు అంకుర సంస్థల నుండి దేశీయ మూలధన సేకరణలో 25%, పరిశ్రమలను ప్రోత్సహించడానికి రక్షణ రంగ పరిశోధనాభివృద్ధి బడ్జెట్‌లో 25% రిజర్వేషన్లు, అంకుర సంస్థలు, అకాడెమియా, డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్ట్-అప్ ఛాలెంజెస్ మరియు టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ ఇవన్ని ప్రైవేట్ పరిశ్రమ మరియు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలని మంత్రి వివరించారు.
రక్షణ రంగ ఉత్పత్తులు, సాంకేతికతలో నాణ్యత యొక్క ప్రాముఖ్యతను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నొక్కిచెప్పారు, ఈ విషయంలో రాజీపడితే మన జాతీయ ప్రయోజనాలను, గర్వాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. జాతీయ- అంతర్జాతీయ వేదికలపై మన రక్షణ పరిశ్రమకు ఒక గుర్తింపును కల్పించేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని ఆయన వాటాదారులందరికీ ఉద్బోధించారు. రక్షణ మంత్రి దేశీయ పరిశ్రమకు వారి నిరంతర మద్దతు కోసం సాయుధ దళాలకు విజ్ఞప్తి చేశారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత కోసం వారు అందిస్తున్న సహకారాన్ని మంత్రి ప్రశంసించారు. 2022 అక్టోబరు 19న డిఫెన్స్ ఎక్స్‌పో నాల్గవ జాబితాను విడుదల చేయడంతో 400కు పైగా వస్తువులు ఇప్పుడు స్వదేశీకరణ జాబితాలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మన అవసరాలను తీర్చడానికి స్వదేశీ, దిగుమతి చేసుకున్న వస్తువుల మధ్య సమతుల్యత అవసరమని ఆయన సూచించారు. సాధారణంగా మనం మన స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యంపై దృష్టి పెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సెమినార్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి మరియు తయారీలో స్వావలంబన సాధించకుండా ఏ దేశం కూడా పటిష్టంగా ఎదగలేదని దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలి పరిణామాలు ప్రాంతీయ ప్రపంచ స్వభావం యొక్క పెళుసు స్వభావాన్ని వారితో పంచుకున్నారు. రక్షణలో ఆత్మనిర్భరతపై ఉన్న నమ్మకాన్ని బలపరుస్తున్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న భౌగోళిక-రాజకీయ పరిణామాలలో మూడు సేవలు ఆత్మనిర్భరత యొక్క ప్రాముఖ్యతను గుర్తించాయని, ఇది స్వదేశీకరణ జాబితాలలో ప్రతిబింబించిందని ఆయన అన్నారు. జనరల్ చౌహాన్ హాజరైన వాటాదారులతో మాట్లాడుతూ, రూ. 62,000 కోట్లతో ఒప్పందాలపై ఇప్పటికే సంతకాలు జరిగాయన్నారు. సుమారు రూ. 7 లక్షల కోట్ల భారత రక్షణ పరిశ్రమతో కొనుగోళ్లలో వివిధ దశల్లో ఉన్నాయి. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించడం, హెచ్‌ఏఎల్ అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచంద్‌ను భారత వైమానిక దళంలోకి చేర్చడం, దేశీయంగా రూపొందించిన ఆయుధ వ్యవస్థల విస్తరణ వంటి ఈ రంగంలో సాధించిన విజయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. భారత రక్షణ స్థాపన, ప్రైవేట్ సంస్థలు మరియు విదేశీ ఓఈఎంల మధ్య సహకారానికి భారతదేశ ఆత్మనిర్భరత నమూనా విముఖంగా లేదని కూడా జనరల్ చౌహాన్ పేర్కొన్నారు.
ఈ సెమినార్ కు త్రివిధ దళాధిపతులు, దేశీయ పరిశ్రమల ప్రతినిధులు, భారత ప్రభుత్వానికి చెందిన అధికారులు హాజరయ్యారు.
******
(Release ID: 1869784)
Visitor Counter : 135