రక్షణ మంత్రిత్వ శాఖ
బంధన్ వేడుక సందర్భంగా 451 అవగాహన ఒప్పందాలు, టీ ఓ టీ ఒప్పందాలు మరియు ఉత్పత్తుల ఆవిష్కారాలకు లకు వేదికైన అతిపెద్ద రక్షణ ప్రదర్శన డెఫ్‌ఎక్స్‌పో - 2022
1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది
భారత వైమానిక దళం హెచ్ ఏ ఎల్ రూ. 6,800 కోట్ల విలువైన 70 హెచ్ టీ టీ-40 స్వదేశీ శిక్షణా విమానాల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి
డెఫ్‌ఎక్స్‌పో 2022 స్వావలంబన దిశగా కొత్త శకానికి నాంది పలుకుతుంది; ప్రధాన ప్రపంచ శక్తులతో భుజం భుజం కలిపి నిలబడేందుకు ‘నవభారతం’ పూర్తిగా సిద్ధంగా ఉంది: రక్షణ మంత్రి
"పూర్తి స్వావలంబన మరియు పెరిగిన రక్షణ ఎగుమతులు అనే జంట లక్ష్యాలను నెరవేర్చడానికి ప్రభుత్వ ప్రైవేట్ రంగ వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది"
ఆత్మనిర్భర్త అంటే ఆధిపత్యాన్ని స్థాపించడం కాదు; దేశం అన్ని సవాళ్ల నుండి రక్షించబడుతుందని నిర్ధారించుకోవడం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
20 OCT 2022 8:33PM by PIB Hyderabad
అక్టోబరు 20, 2022న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన 12వ డెఫ్‌ఎక్స్‌పో యొక్క బంధన్ వేడుకలో నాలుగు వందల యాభై ఒక్క (451) అవగాహనా ఒప్పందాలు, సాంకేతికత బదిలీ ఒప్పందాలు మరియు ఉత్పత్తి ఆవిష్కారాలు జరిగాయి. 451లో 345 అవగాహన ఒప్పందాలు, 42 ప్రధానమైన ప్రకటనలు, 46 ఉత్పత్తి ఆవిష్కారాలు మరియు 18 టీ ఓ టీ లు జరిగాయి. వీటిలో గుజరాత్ కి చెందిన 28 అవగాహన ఒప్పందాలు మరియు ఒక ఉత్పత్తి ప్రారంభం అయ్యాయి. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూ. 6,800 కోట్ల విలువైన 70 హెచ్‌టిటి-40 స్వదేశీ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి.
మూడు రోజులు జరిగిన డెఫ్‌ఎక్స్‌పో ముగింపు వేడుకలో తన ప్రసంగంలో, రక్షణ మంత్రి ఈవెంట్ యొక్క 12వ ఎడిషన్ భారత రక్షణ రంగం యొక్క వృద్ధి పరాక్రమంపై ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని నొక్కిచెప్పారు. ఇది స్వావలంబన యొక్క కొత్త శకానికి నాంది అని ఆయన పేర్కొన్నారు, దీనిలో బలమైన మరియు సంపన్నమైన 'నవభారతం' ప్రధాన ప్రపంచ శక్తులతో భుజం భుజం కలిపి నిలబడటానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. రాబోయే కాలంలో భారతదేశం ప్రపంచ రక్షణ రంగ ఉత్పత్తి కేంద్రం గా అవతరించబోతోందనడానికి ఈ ఈవెంట్ యొక్క గొప్ప విజయమే నిదర్శనం.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం మరియు విధానాల వల్ల గత కొన్నేళ్లుగా ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ట పెరిగిందనేది ఒక వాస్తవికత.రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్' దార్శనికత, ఎగుమతులు త్వరలో పెరుగుతాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
12వ డిఫెక్స్‌పోను ఘనంగా విజయవంతం చేసినందుకు వివిధ దేశాల రక్షణ మంత్రులు సీనియర్ అధికారులతో పాటు ప్రపంచం నలుమూల నుండి పెద్ద సంఖ్యలో హాజరైన వ్యాపార నాయకులకు రక్షణ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రక్షణ మరియు వాయు రంగంలో తయారీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘నవభారతం’ యొక్క ఉత్సాహం మరియు చొరవ కు ప్రతినిధులందరూ సాక్షులని ఆయన అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సవాళ్లు ఎదురైనప్పటికీ, డిఫెక్స్‌పో 2022 విజయవంతంగా నిర్వహించడం ‘నవభారతం’ యొక్క శక్తివంతమైన సామర్థ్యాన్ని మరియు తిరుగులేని స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.
వివిధ దేశాలతో భారతదేశం రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి మరియు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలను చర్చించడానికి డిఫెక్స్‌పో 2022 ఒక వేదికగా ఉపయోగపడిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. డిఫెక్స్‌పోలో చురుకుగా పాల్గొన్న వివిధ దేశాల రక్షణ మంత్రులతో తన ఫలవంతమైన చర్చలు, అలాగే హిందూ మహాసముద్ర ప్రాంతం ప్లస్ (IOR+) కాన్‌క్లేవ్‌ను విజయవంతంగా నిర్వహించడం గురించి ఆయన వివరించారు. ఐ ఓ ఆర్ భారతదేశానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంగా పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, భద్రత మరియు శ్రేయస్సును కొనసాగించడానికి భద్రత మరియు ఈ ప్రాంతంలో అందరి వృద్ధి (సాగర్) లో ప్రధానమంత్రి దూరదృష్టిని ఆయన పునరుద్ఘాటించారు.
అనేక దేశాల నుండి ఉన్నత స్థాయి ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ఎగ్జిబిటర్లు, దేశంతో పాటుగా చేరిన కంపెనీలు పాల్గొనడం ద్వారా డిఫెక్స్‌పో 2022 యొక్క అద్భుతమైన విజయం స్పష్టమవుతుందని రక్షణ మంత్రి నొక్కిచెప్పారు. పెద్ద సంఖ్యలో అవగాహన ఒప్పందాలు, ఉత్పత్తి ప్రారంభాలు, ప్రధాన ప్రకటనలు, వ్యాపార సంస్థలతో డీ ఆర్ డీ ఓ యొక్క సాంకేతిక ఒప్పందాల బదిలీలు దేశంలో అభివృద్ధి చెందుతున్న బలమైన రక్షణ పర్యావరణ వ్యవస్థకు సాక్ష్యంగా మరియు రక్షణ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి లక్ష్యం సాధించడానికి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ వరల్డ్' ఒక పెద్ద అడుగు అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు
శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారతదేశం పూర్తి స్వావలంబన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది, అనేక రంగాలు ‘ఆత్మనిర్భర్’ స్వయం సమృద్ది దిశ గా మరియు ప్రపంచ సరఫరాదారులుగా మారుతున్నాయి. స్వావలంబనను ప్రోత్సహించడం మరియు రక్షణ ఎగుమతులను పెంచడం అనే జంట లక్ష్యాలను నెరవేర్చడానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. 2025 నాటికి దేశం రూ. 35,000 కోట్ల రక్షణ ఎగుమతి లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. డిఫెక్స్‌పో 2022 యొక్క ఉత్సాహాన్ని మరిన్ని సహకారాల ద్వారా కొత్త రంగాల్లో ముందుకు తీసుకువెళ్లగలమని, ఇది భారతదేశాన్ని అగ్రగామి రక్షణ తయారీదారుగా ఎగుమతిదారుగా అభివృద్ధి చేయడంలో దోహదపడుతుందని, ప్రభుత్వ ఆకాంక్ష 2047 సాకారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కేవలం దేశ ఆధిపత్యాన్ని స్థాపించే లక్ష్యంతో కాదని రక్షణ మంత్రి పునరుద్ఘాటించారు. "భారతదేశం ఎల్లప్పుడూ ప్రపంచం మొత్తాన్ని తన కుటుంబంగా పరిగణించింది మరియు అందరికీ సంక్షేమం మరియు ప్రపంచ శాంతి స్ఫూర్తితో ముందుకు సాగింది. మేము వ్యక్తిగతంగా అలాగే ప్రపంచంలోని సామూహిక ప్రయోజనాలను కాపాడాలని విశ్వసిస్తాము. మా స్వావలంబన ప్రయత్నాలు దేశం మరియు ప్రజలు భవిష్యత్తు ముప్పుల, ప్రమాదాల నివారణకు రక్షణను నిర్ధారించడం కోసమే ”అని ఆయన అన్నారు.
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, రక్షణ శాఖ సహాయ రమంత్రి శ్రీ అజయ్ భట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మరియు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే మరియు రక్షణ శాఖ ఓ ఎస్ డీ శ్రీ గిరిధర్ అరమనే వేడుకకు హాజరయ్యారు
***
(Release ID: 1869777)
Visitor Counter : 162