వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
కేంద్రం నిరంతర పర్యవేక్షణ , విధాన నిర్ణయాల ఫలితంగా దేశంలో పప్పుధాన్యాలు, ఉల్లి ధరలలో స్థిరత్వం
ప్రస్తుతం భారత ప్రభుత్వం వద్ద 43.82 లక్షల టన్నుల వివిధ పప్పుధాన్యాల బఫర్ స్టాక్ లభ్యం
వివిధ సంక్షేమ పథకాల కింద పంపిణీ నిమిత్తం రాష్ట్రాలకు జారీ ధరపై ప్రతి కిలోకు రూ.8 రాయితీతో బఫర్ స్టాక్ నుంచి రాష్ట్రాలకు శనగ (చనా) కేటాయింపు
Posted On:
20 OCT 2022 4:45PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణ విధాన నిర్ణయాలు పప్పుధాన్యాలు ఉల్లి ధరలలో స్థిరత్వానికి దారితీశాయి. దిగుమతిదారులు, పరిశోధనా సంస్థలు, వాణిజ్య సంఘాలు మొదలైన వారితో తరచుగా సంభాషించడం ద్వారా నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, దిగుమతులు, ఎగుమతులు , లభ్యత ను కేంద్రం నిశితంగా గమనిస్తున్నదని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ ఈ రోజు ఢిల్లీ లో మీడియా సమావేశంలో తెలిపారు.
*ఉత్పత్తి, దిగుమతులు, ఎగుమతులు, నిత్యావసర వస్తువుల లభ్యత ను కేంద్రం నిశితంగా గమనిస్తోంది.
*1.00 లక్ష టన్నుల దిగుమతి చేసుకున్న కందిపప్పు, 50 వేల టన్నుల దిగుమతి చేసుకున్న మినుము ల కొనుగోలు ను కేంద్రం ప్రారంభించింది.
* 31.03.2023 వరకు కందులు, మినుము దిగుమతి ని 'ఫ్రీ కేటగిరీ' కింద ఉంచారు.
* కంది పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 27.07.2021 నుండి సున్నాకు తగ్గించారు *13.02.2022 నుండి 30.09.2022 వరకు ఉన్న సున్నా వ్యవసాయ మౌలిక సదుపాయాలు ,అభివృద్ధి సెస్ ను 31.03.2023 వరకు పొడిగించారు.
*రబీ 2022 కోత కాలంలో 2.50 ఎల్ఎమ్ టి (లక్ష మెట్రిక్ టన్నులు) ఉల్లి బఫర్ స్టాక్ ను కేంద్రం ఏర్పాటు చేసింది.
బఫర్ స్టాక్ పెంచడానికి, ప్రభుత్వం 1.00 లక్షల టన్నుల దిగుమతి చేసుకున్న కంది, 50,000 టన్నుల దిగుమతి చేసుకున్న మినుము లను కొనుగోలు చేయడం ప్రారంభించింది.ప్రస్తుతం భారత
ప్రభుత్వం పిఎస్ఎఫ్ , పిఎస్ఎస్ ల కింద 43.82 లక్షల టన్నుల వివిధ పప్పుధాన్యాల బఫర్ స్టాక్ ను కలిగి ఉంది. వివిధ సంక్షేమ పథకాల కింద రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా పంపిణీ చేయడం కోసం జారీ ధర పై కిలోకు రూ.8 డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్న ఈ స్టాక్ నుంచి చనా ను రాష్ట్రాలకు కేటాయించారు.
ఇప్పటి వరకు ఉత్తర ప్రదేశ్ , గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ , తమిళనాడు నుండి అందిన ఇండెంట్ ఆధారంగా 88,600 మెట్రిక్ టన్నుల చనా ను ఈ రాష్ట్రాలకు కేటాయించారు.
దేశీయ లభ్యతను పెంపొందించడం కోసం పప్పుధాన్యాల దిగుమతులు సాఫీగా, అంతరాయం లేకుండా జరిగేలా కంది, మినపప్పు దిగుమతిని 31.03.2023 వరకు 'ఫ్రీ కేటగిరీ' కింద ఉంచారు. కంది కి సంబంధించి, ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 27.07.2021 నుండి సున్నాకు తగ్గించారు సున్నా వ్యవసాయ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సెస్ ను 13.02.2022 నుండి 30.09.2022 వరకు తిరిగి 31.03.2023 వరకు పొడిగించారు.
నిత్యావసర వస్తువుల చట్టం, 1955లోని సెక్షన్ 3(2)(హెచ్), 3(2)(ఐ) కింద కంది నిల్వదారులు నిల్వ వివరాలు తప్పనిసరిగా వెల్లడించే నిబంధన అమలు చేయాలని, నిల్వలను తనిఖీ చేయాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ 2022 ఆగస్టు 12న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆన్ లైన్ మానిటరింగ్ పోర్టల్ లో నిల్వదారుల సంస్థలు తమ వద్ద ఉన్న
స్టాక్ డేటాను వారానికొకసారి అప్ లోడ్ చేసేలా ఆదేశించాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. అంతేకాకుండా, స్టాక్ హోల్డర్లు కంది నిల్వలను బహిర్గతం చేయడాన్ని పర్యవేక్షించడానికి నోడల్ అధికారులను నియమించాలని కూడా రాష్ట్రాలను కోరారు.
మార్కెట్ కు తక్కువ వచ్చే సీజన్ లో కూడా ఉల్లి రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడానికి, కేంద్రం 2022 రబీలో 2.50
ఎల్ ఎం టి (లక్ష మెట్రిక్ టన్నుల) ఉల్లి బఫర్ నిల్వలను ఏర్పాటు చేసింది. ధరల పెరుగుదలను నియంత్రించడానికి బఫర్ నుంచి ఉల్లిపాయ సరఫరాను ప్రారంభించారు. నేషనల్ ఆనియన్ బఫర్ స్టాక్ నుండి 14 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని వివిధ మార్కెట్లకు 54,000 టన్నుల ఉల్లిని కేంద్రం విడుదల చేసింది.
దీని ఫలితంగా ఏడాది పొడవునా ఉల్లి ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతేకాకుండా, ఉల్లి రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడానికి, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, మదర్ డెయిరీ, సఫాల్, ఎన్ సి సి ఎఫ్, కేంద్రీయ భండార్లకు ఉల్లిని క్వింటాలుకు రూ .800 చొప్పున సెంట్రల్ బఫర్ స్టాక్ నుండి తీసుకోవడానికి అనుమతించింది.
కేంద్ర ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణ, విధానపరమైన నిర్ణయాల కారణంగా, సాధారణ సీజనల్ ధరల పెరుగుదల మినహా, ప్రధాన పప్పుధాన్యాల అఖిల భారత సగటు రిటైల్ ధరలు సంవత్సరం ప్రారంభం నుండి చాలా స్థిరంగా ఉన్నాయి. గత నెలలో శనగ పప్పు , కంది పప్పు అఖిల భారత సగటు ధరలు స్వల్పంగా తగ్గాయి, అయితే కందిపప్పు, మినపప్పు పెసరపప్పు ఆల్ ఇండియా సగటు ధరలు అదే కాలంలో స్వల్ప పెరుగుదలతో స్థిరంగా ఉన్నాయి. ఉల్లి అఖిల భారత సగటు రిటైల్ ధర గత సంవత్సరంతో పోలిస్తే 28% గణనీయమైన తగ్గుదలను నమోదు చేసింది.
నిత్యావసర వస్తువుల పరిస్థితి, వాటి ధరల పోకడలను సమీక్షించడానికి, దిగుమతులు, ఉత్పత్తిని పెంచడం, స్టాక్ పరిమితులను విధించడం, దిగుమతి ఎగుమతి నిబంధనలు మొదలైన వాటి ద్వారా ధరలను స్థిరంగా ఉంచడానికి వివిధ విధాన జోక్యాల ద్వారా లభ్యతను పెంచే చర్యలను సూచించడానికి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసి), కార్యదర్శుల కమిటీ (సిఓఎస్) ద్వారా క్రమం తప్పకుండా సమీక్షలు.
నిత్యావసర వస్తువుల పరిస్థితి, వాటి ధరల పోకడ, దిగుమతుల ద్వారా ధరలను స్థిరంగా ఉంచడానికి వివిధ విధాన జోక్యాల ద్వారా లభ్యతను పెంచడానికి చర్యలు, ఉత్పత్తిని పెంచడం, స్టాక్ పరిమితులను విధించడం, దిగుమతి ఎగుమతి నిబంధనలు మొదలైన అంశాలను ఇంటర్- మినిస్టీరియల్ కమిటీ (ఐ ఎం సి) సెక్రటరీల కమిటీ (సి ఓ ఎస్) క్రమ పద్ధతి లో సమీక్షిస్తున్నాయి.
వ్యవసాయ క్షేత్రం/మండీ వద్ద రైతులు/రైతు సంఘాల నుంచి నేరుగా కొనుగోలు చేయడాన్ని ప్రోత్సహించడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం , పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు , బంగాళాదుంప వంటి నిత్యావసర వస్తువుల ధరల అస్థిరతను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి (పిఎస్ఎఫ్) ఏర్పాటు చేసింది. ధర స్థిరత్వాన్ని ధృవీకరించడం కోసం తక్కువ లభ్యత సీజన్ లో ధరలను తటస్థ పరిచే ఉద్దేశ్యంతో ఉల్లిపాయలు, పప్పుధాన్యాల బఫర్ స్టాక్ ని పి ఎస్ ఎఫ్ కింద నిర్వహిస్తారు.వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేటప్పుడు ఈ జోక్యాలు మార్కెట్ కు తగిన సంకేతాలను పంపడానికి , ఊహాజనిత, అక్రమ నిల్వ కార్యకలాపాలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.
భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ 22 నిత్యావసర వస్తువుల (తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, వంటనూనెలు, కూరగాయలు మరియు ఇతరాలు) ధరలను పర్యవేక్షిస్తుంది. ధరల డేటా, విశ్లేషణాత్మక అవుట్ పుట్ నాణ్యతను మెరుగుపరచడానికి, డిపార్ట్ మెంట్ 2022 జనవరి 1 నాటికి ధరల సేకరణ కేంద్రాల సంఖ్యను 179 నుండి ఇప్పటి దాకా 311 కేంద్రాలకు పెంచడం ద్వారా భౌగోళిక పరిధిని విస్తరించింది. ధరల పర్యవేక్షణ ప్రక్రియ దృఢత్వాన్ని మెరుగుపరచడానికి, సమాచార ఆధారిత దృష్టాంతాన్ని అభివృద్ధి చేయడానికి డిపార్ట్ మెంట్ ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్ , దృష్టాంత నిర్మాణ నమూనాల కోసం శాస్త్రీయ పద్ధతులను ఉపయోగిస్తుంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిఎం-కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ - 2022 (2022 అక్టోబర్ 17న) సందర్భంగా పప్పు దినుసుల ఉత్పత్తిలో 70% పెరుగుదల పై సంతోషం వ్యక్తం చేసి, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. పప్పుధాన్యాల ఉత్పత్తికి సంబంధించి 2015 లో తాము తము ఇచ్చిన పిలుపు ను ప్రధాన మంత్రి గుర్తు చేసుకున్నారు. "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో మేము వ్యవసాయాన్ని ఆకర్షణీయంగా సుసంపన్నంగా మారుస్తాము" అని అంటూ ప్రధాన మంత్రి రైతులు స్టార్టప్ లకు అభినందన లు తెలుపుతూ తన ప్రసంగాన్ని ముగించారు.
మరిన్ని వివరాల కోసం, ఇక్కడ చదవండి:
https://t.co/kYkcDqG4OR
ఈ వారం ప్రారంభం లో, ఒక సానుకూల రైతు ప్రయోజన చర్య గా, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2023-24 మార్కెటింగ్ సీజన్ కు అన్ని తప్పనిసరి
రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎం ఎస్ పి) పెంచడానికి ఆమోదం తెలిపింది. రైతుల ఉత్పత్తులకు
ప్రోత్సాహక ధరలను నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
కందులు (మసూర్) ధర క్వింటాలుకు రూ.500/- చొప్పున సంపూర్ణ గరిష్ట పెరుగుదలకు ఆమోదం లభించింది.
For more details, read here: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1868760
To view the briefing on CCEA decisions, click: https://t.co/uYeXRAKXVt
******
AD/NS
(Release ID: 1869762)
Visitor Counter : 173