రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
హెచ్‌యుఆర్ ఎల్ బరౌనీ ప్లాంట్‌లో యూరియా ఉత్పత్తి ప్రారంభం
Posted On:
19 OCT 2022 5:23PM by PIB Hyderabad
హిందూస్థాన్ ఉర్వారక్, రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యుఆర్ ఎల్)కు చెందిన బరౌని ప్లాంటు యూరియా ఉత్పత్తిని ప్రారంభించింది. బరౌనిలో కొత్త అమ్మోనియా ప్లాంటును ఏర్పాటు చేయడం ద్వారా దేశం మరో మైలురాయిని అధిగమించింది. ఈ ప్లాంటులో నిన్న యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. గ్యాస్ ఆధారిత అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన ఈ బరౌని ప్లాంటు, గతంలో మూతపడిన ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్ సిఐఎల్), హిందూస్థాన్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ) యూనిట్లను పునరుద్ధరించేందుకు తీసుకున్న చర్యలలో భాగంగా చేపట్టారు. దేశంలో యూరియా రంగంలో స్వావలంబన సాధించేందుకు దీనిని చేపట్టారు.ఎఫ్‌సిఐఎల్, హెచ్ ఎఫ్‌సిఎల్ నుంచి గతంలో మూతపడిన యూనిట్లను పునరుద్ధరించడం ప్రస్తుత ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యతా అంశం. దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచడం ప్రభుత్వ లక్ష్యం. హిందూస్థాన్ ఊర్వారక్, రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యుఆర్ ఎల్ )కుచెందిన బరౌని యూనిట్‌ను 8,387 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరించి సంవత్సరానికి 12.7 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా ఉత్పత్తి సామర్ధ్యం తో యూరియాను ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
హెచ్‌యుఆర్ ఎల్‌ను కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్), ఎన్.టి.పి.సి లిమిడెట్ (ఎన్‌టిపిసి), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్) ల జాయింట్ వెంచర్‌గా 2016 జూన్ 15న ఏర్పడిది. ఎఫ్‌సిఐఎల్, హెచ్ఎఫ్ సిఎల్‌లు గోరఖ్‌పూర్, సింద్రి, బరౌని యూనిట్లను 25 ,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకునే అధికారం కల్పించడం జరిగింది. హెచ్‌యుఆర్ ఎల్‌కు సంబంధించిన మూడు ప్లాంట్లు ప్రారంభమైతే ఏటా 38.1 లక్షల మెట్రిక్ టన్నుల దేశీయ యూరియా ఉత్పత్తికి వీలుకలుగుతుంది. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అయిన ఆత్మనిర్భర్ (స్వావలంబన)ను యూరియా ఉత్పత్తి రంగంలో ఇండియా సాధించినట్టు అవుతుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఎరువుల కర్మాగారం. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు దేశంలో రైతులకు ఎరువులను అందుబాటులోకి తేవడమే కాకుండా ఈ ప్రాంత ఆర్ధిక ప్రగతికి , రోడ్లు, రైల్వే, ఇతర పారిశ్రామిక అనుబంధ సదుపాయాల అభివృద్ధికి దేశ ఆహార భద్రతకు ఎంతగానో దోహదపడుతుంది.
హెచ్‌యుఆర్ ఎల్‌ప్లాంటులకు పలుప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో అత్యధునాతన బ్లాస్ట్ ప్రూఫ్ కంట్రోల్ రూమ్ ఉంది. ఇది డిస్ట్రిబ్యూటరీ కంట్రోల్ సిస్టమ్ , ఎమర్జెన్సీ షట్‌డౌన్ సిస్టమ్, పర్యావరణ పరిశీలక వ్యవస్థ కలిగి ఉంది. భారతదేశపు తొలి బుల్టెట్‌ప్రూఫ్ రబ్బర్‌డ్యామ్‌కలిగి ఉంది. ఇది గాలితో పనిచేస్తుంది. దీని పొడవు 65 మీటర్లు కాగా ఎత్తు 2 మీటర్లు. ఈ ప్లాంట్లలో వ్యర్థ జలాలను విడుదల చేసే పని లేదు. ఈ వ్యవస్థలను అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు పనిచేయిస్తారు. ఈ పరిశ్రమ ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిషా రాష్ట్రాల యూరియా డిమాండ్‌ను తీరుస్తుంది. యూరియా సరఫరాతోపాటు ఈ ప్రాజెక్టు ఈ యూనిట్ చుట్టుపక్కల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అభివృద్దికావడానికి దోహదపడుతుంది. ఈ యూరియా యూనిట్‌హబ్ చుట్టుపక్కల చాలా వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఇది ఉపాధి అవకాశాలను మరింత పెంపొందిస్తుంది. ఈ ప్లాంటు పనిచేయడం ప్రారంభించడంతో దేశం యూరియా తయారీ రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తుంది. ఇది విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. ఇది ఎరువుల రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా గొప్ప ముందడుగుగా చెప్పుకోవచ్చు.హెచ్‌యుఆర్ ఎల్ గోరఖ్‌పూర్ ప్రాజెక్టు 2021 డిసెంబర్‌లోనే ప్రారంభమైంది. సింద్రి ప్లాంటు త్వరలోనే ప్రారంభం కానుంది.
***
(Release ID: 1869761)
Visitor Counter : 123