యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
గిరిజన యువత అభివృద్ధికి హోంమంత్రిత్వ శాఖ సహకారంతో ట్రైబల్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ
మన యువతను సరిహద్దులోని వివిధ గ్రామాలకు పంపించి, అక్కడ కనీసం ఒకరోజు గడపే విధంగా ప్రణాళిక చేస్తున్నాం: శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
Posted On:
19 OCT 2022 5:50PM by PIB Hyderabad
యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో గిరిజన యువత అభివృద్ధి కోసం 14వ గిరిజన యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ గిరిజన యువత చేసిన ప్రదర్శనలు, ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహన్ని నింపాయన్నారు. "మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా సరైన మార్గంలో చాలా పరిశోధనలు చేసి మీ ఆలోచనలను ప్రభావవంతంగా అందించినందుకు నేను సంతోషంగా ఉన్నాను" అని తెలిపారు.
శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ "ప్రధాని మోదీ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలి. అందులో భాగంగా మన యువతను సరిహద్దులోని వివిధ గ్రామాలకు పంపించి అక్కడ కనీసం ఒక రోజు గడపే విధంగా ప్రణాళిక చేస్తున్నాం" అని పెర్కొన్నారు.
నెహ్రూ యువ కేంద్ర సంగతన్ 2006 నుండి వామపక్ష తీవ్రవాద విభాగం (ఎల్‌డబ్ల్యూఈ), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ఆర్థిక సహకారంతో గిరిజన యువత అభివృద్ధి మరియు ప్రధాన స్రవంతి కోసం ట్రైబల్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం 2022-23లో దేశవ్యాప్తంగా 26 ట్రైబల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లను ఎన్‌వైకెఎస్ నిర్వహిస్తోంది.
భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం గురించి గిరిజన యువతకు అవగాహన కల్పించడం మరియు భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను మెచ్చుకునేలా చేయడం, అభివృద్ధి కార్యకలాపాలు మరియు పారిశ్రామిక పురోగతిలో వారిని భాగస్వాములను చేయడం మరియు గిరిజన యువత వారితో భావోద్వేగ సంబంధాలను పెంపొందించుకోవడంలో సహాయపడటం ఈ కార్యక్రమ లక్ష్యం. తద్వారా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని పీర్ గ్రూపులు ఆత్మగౌరవాన్ని పెంచుతాయి.
ప్రతి ట్రైబల్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం వ్యవధి 7 రోజులు. ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలైన సుక్మా మరియు రాజ్‌నంద్‌గావ్, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, బీహార్‌లోని జముయి జిల్లాల నుండి 18-22 సంవత్సరాల మధ్య వయస్సుగల 220 మంది యువతీ,యువకులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఈ ట్రైబల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా రాజ్యాంగ అధికారులు, ఉన్నతాధికారులు మరియు ప్రముఖులతో ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. ప్యానెల్ చర్చలు, ఉపన్యాస సెషన్‌లు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లోని కార్యకలాపాలు, డిక్లమేషన్ పోటీ, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ గైడెన్స్‌కు సంబంధించిన పరిశ్రమల ఎక్స్‌పోజర్ సందర్శన, స్పోర్ట్స్ ఈవెంట్‌లకు ఎక్స్పోజర్, సిఆర్‌పిఎఫ్ క్యాంపు సందర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు మొదలైనవి కూడా ఇందులో భాగంగా ఉంటాయి.
****
(Release ID: 1869372)
Visitor Counter : 166