శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సి ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ పరుగు 3.0ని నిర్వహిస్తుంది
Posted On:
19 OCT 2022 3:53PM by PIB Hyderabad
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ - ఎన్ ఐ ఎస్ సి పి ఆర్, న్యూ ఢిల్లీ సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కి చెందిన ప్రయోగశాల, ఇది విధాన పరిశోధన మరియు సైన్స్ సమాచార సంబంధిత అధ్యయనాల విధులతో దేశానికి సేవలు అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ‘ఫిట్ ఇండియా మిషన్’ని బలోపేతం చేయడానికి, సి ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ 2022 అక్టోబర్ 2-31 మధ్యకాలంలో ‘ఫిట్ ఇండియా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ ప్రయత్నంలో అనేక క్రీడా కార్యకలాపాలు నిర్వహిస్తారు.
నేడు, సి ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ సిబ్బంది, ప్రాజెక్ట్ అసోసియేట్‌లు, రీసెర్చ్ ఇంటర్న్‌లు, ఏ సి ఎస్ ఐ ఆర్ విద్యార్థులు, అవుట్‌సోర్స్ సిబ్బంది, స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల తో 3 కిలోమీటర్ల దూరం ‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ పరుగు 3.0’ని నిర్వహిస్తోంది. సి ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ డైరెక్టర్ ఇన్-ఛార్జ్ డాక్టర్ సుజిత్ భట్టాచార్య ఈ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ పరుగు ను న్యూ ఢిల్లీ పూసా క్యాంపస్ నుండి ఉదయం 10:30 గంటలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ భట్టాచార్య మాట్లాడుతూ ఫిట్ ఇండియా పరుగు అనేది ఇన్‌స్టిట్యూట్‌లోని సిబ్బందికి మరియు ఇతర మానవ వనరులకు ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ కోసం అవగాహన కల్పించడానికి ఒక వినూత్న రీతిలో చేస్తున్న కార్యక్రమం అని అన్నారు. ఫిట్ ఇండియా మిషన్ కోసం సి ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ కమిటీ చైర్మన్, శ్రీ అశ్వనీ కుమార్ బ్రహ్మి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ పరుగులో పాల్గొన్న వారందరికీ ప్రభుత్వం యొక్క సంబంధిత మార్గదర్శకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ మహమ్మద్ రైస్, డా. నరేష్ కుమార్, డా. ఎల్. పులమ్టే, డా. బి. ఎల్. గార్గ్, డా. సంధ్యా వాక్డికర్, డా. మధులికా భాటి, డా. సుమన్ రే, డా. పుష్పాంజలి త్రిపాఠి, డా. శివ నారాయణ్ నిషాద్ , డా. అరవింద్ మీనా, డా. మనీష్ మోహన్ గోర్, డా. మెహర్ వాన్, డా. పరమానంద బర్మన్ (సి ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ శాస్త్రవేత్తలు), శ్రీ రాజేష్ కుమార్ సింగ్ రోషన్, అడ్మినిస్ట్రేషన్ కంట్రోలర్, శ్రీ అజయ్ కుమార్, ఫైనాన్స్ & అకౌంట్స్ కంట్రోలర్, పంకజ్ గోస్వామి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు ఇన్స్టిట్యూట్ యొక్క ఇతర సిబ్బంది ఈ ఫిట్ ఇండియా పరుగులో చురుకుగా పాల్గొన్నారు. 200 మంది పైగా ఈ పరుగులో పాల్గొన్నారు
సి ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ క్రీడా కార్యకలాపాలలో చాలా చురుకుగా ఉంటుంది అలాగే అంతర్గత క్రీడా కార్యకలాపాలతో పాటు శాంతి స్వరూప్ భట్నాగర్ మెమోరియల్ టోర్నమెంట్‌లలో (SSBMT) క్రమం తప్పకుండా పాల్గొంటుంది. ఎస్ ఎస్ బి ఎం టీ సి ఎస్ ఐ ఆర్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ ద్వారా వివిధ సి ఎస్ ఐ ఆర్ ఇన్‌స్టిట్యూట్‌ల భాగస్వామ్యాన్ని ఒకచోట చేర్చి నిబద్ధతతో కూడిన సి ఎస్ ఐ ఆర్ కుటుంబాన్ని నిర్మించడానికి, జట్టు స్ఫూర్తిని, నాయకత్వం మరియు అన్ని అసమానతలకు వ్యతిరేకంగా రాణించాలనే ఉత్సాహాన్ని సృష్టించేందుకు రూపొందించిన వేదిక. ఎస్ ఎస్ బి ఎం టీ క్రికెట్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్ మరియు బ్రిడ్జ్ ఆటలలో పోటీలు నిర్వహిస్తారు. సి ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ ఎస్ ఎస్ బి ఎం టీ లో క్రియాశీల సభ్యసంస్థ.
****
(Release ID: 1869370)
Visitor Counter : 212