రైల్వే మంత్రిత్వ శాఖ
ఇప్పటివరకు రైల్వేల ద్వారా 15 గతి శక్తి కార్గో టెర్మినల్స్ ప్రారంభం
వచ్చే మూడు సంవత్సరాల్లో మల్టీమోడల్ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్ కోసం 100 పీఎం గతి శక్తి కార్గో టెర్మినల్స్ అభివృద్ధి
Posted On:
19 OCT 2022 4:53PM by PIB Hyderabad
గౌరవ ప్రధాన మంత్రి 'గతి శక్తి‘ దార్శనికతకు, 2021, డిసెంబర్ 15న రైల్వే మంత్రిత్వ శాఖ 'గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్' (జిసిటి)కు సంబంధించి ప్రారంభించిన విధానానికి అనుగుణంగా రైల్ కార్గోలను హ్యాండిల్ చేయడం కోసం గతి శక్తి కార్గో టెర్మినల్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు, 15 జిసిటిలను ప్రారంభించారు . జిసిటిల అభివృద్ధి కోసం మరో 96 ప్రదేశాలను తాత్కాలికంగా గుర్తించారు. వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో 100 గతి శక్తి కార్గో టెర్మినల్స్ ను ప్రారంభించాలని లక్ష్యంగా రైల్వే పెట్టుకుంది. పరిశ్రమ నుంచి డిమాండ్ కార్గో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఆధారంగా జిసిటిల ఏర్పాటు ప్రదేశాల ఎంపిక జరుగుతుంది.
ఇప్పటివరకు ప్రారంభమైన 15 గతి శక్తి కార్గో టెర్మినల్స్:
వరస నెం
|
రైల్వే
|
జి సి టి పేరు
|
సర్వింగ్ స్టేషన్
|
1.
|
ఎస్ ఇ ఆర్
|
జై బాలాజీ ఇండస్ట్రీస్
|
బరజామ్డా - బార్బిల్
|
2.
|
ఎస్ ఇ ఆర్
|
ఓ ఎం పి ఎల్
(ఒరిస్సా మెటాలిక్స్)
|
గోకుల్ పూర్
|
3.
|
ఇ సి ఓ ఆర్
|
పారాదీప్ ఈస్ట్ క్వే కోల్ టెర్మినల్ ప్రయివేట్ లిమిటెడ్
|
పిఆర్ డిపి
|
4.
|
ఇ ఆర్
|
మైథోన్ పవర్ లిమిటెడ్ సైడింగ్
|
థాపర్ నగర్
|
5.
|
ఎస్ సి ఆర్
|
ఐఓసిఎల్
|
నక్కనదొడ్డి/జి టి ఎల్
|
6.
|
ఎన్ ఇ ఆర్
|
హిందుస్థాన్ ఉర్వార్క్ రసాయన్ లిమిటెడ్
|
నఖా అడవి
|
7.
|
డల్యూ ఆర్
|
సి ఓ ఎన్ సి ఓ ఆర్
|
వరణమా
|
8.
|
ఎన్ ఎఫ్ ఆర్
|
ఐఓసిఎల్
|
మొయినర్ బ్యాండ్
|
9.
|
ఎన్ డబ్ల్యు ఆర్
|
నయారా ఎనర్జీ లిమిటెడ్
|
కైర్లా(జెయు)
|
10.
|
ఎస్ సి ఆర్
|
ఎస్ సి సి ఎల్
|
సత్తుపల్లి
|
11.
|
ఎస్ డబ్ల్యు ఆర్
|
హెచ్ పిసిఎల్
|
షివాడి (ఎస్ జెడ్ వి )
|
12.
|
ఎన్ ఇ ఆర్
|
అంకుర్ ఉద్యోగ్ లిమిటెడ్
|
సహ్జన్వా
|
13.
|
ఎన్ ఇ ఆర్
|
అదానీ అగ్రి
|
జసోడా/ఐ జెడ్ టి
|
14.
|
ఎన్ ఎఫ్ ఆర్
|
ఎఫ్. సి ఐ సైడింగ్
|
చినమారా
|
15.
|
ఇ ఆర్
|
పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
|
పాకూర్
|
గతి శక్తి కార్గో టెర్మినల్స్ (జిసిటిలు) ప్రైవేట్ సంస్థలచే అభివృద్ధి చేయబడు తున్నాయి. రైల్వేయేతర భూమిలో లేదా రైల్వే భూమిలో పూర్తిగా / పాక్షికంగా అభివృద్ధి చేయవచ్చు. రైల్వేయేతర భూమిలో జిసిటిలను అభివృద్ధి చేయడంకోసం , ఆపరేటర్ లు లొకేషన్ ని గుర్తిస్తారు. అవసరమైన అనుమతులు పొందిన తరువాత టెర్మినల్ ని నిర్మిస్తారు.
రైల్వే భూమిలో జిసిటిలను పూర్తిగా లేదా పాక్షికంగా అభివృద్ధి చేయడం కోసం
ల్యాండ్ పార్శిల్స్ ను రైల్వే ద్వారా గుర్తిస్తారు. టెర్మినల్ నిర్మాణం , ఆపరేషన్ కోసం ఆపరేటర్ ను ఓపెన్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ఎంపికచేస్తారు.
జిసిటిల కోసం అన్ని కొత్త ప్రతిపాదనలు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. 10.10.2022 నాటికి 67 కొత్త ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా అనుమతులు జారీ అయ్యాయి.
***
(Release ID: 1869368)
Visitor Counter : 155