పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరాలీ నిర్వహణపై అంతర్ మంత్రిత్వ శాఖ సమావేశం


ఎన్ సిఆర్ రాష్ట్రాలు, ఎన్ సి టి డి, పంజాబ్ కార్యాచరణ ప్రణాళికల అమలు తీరు పై చర్చ

పంజాబ్ లో సి ఆర్ ఎమ్ ల తక్కువ వినియోగం , బయో డికంపోజర్ వాడకం పై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి

సమన్వయంతో కూడిన చర్యలు ఈ ప్రాంతంలో గాలి నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడానికి దారి తీస్తాయి: కేంద్ర పర్యావరణ మంత్రి

పుసా డీకంపోజర్ అప్లికేషన్ పై ఎం ఓ ఏ అండ్ ఎఫ్ డబ్ల్యూ ఆధ్వర్యం లో కార్యక్రమం

Posted On: 19 OCT 2022 3:43PM by PIB Hyderabad

ఢిల్లీ ఎన్ సి ఆర్ లో పంట అవశేషాలను తగలబెట్టే పరాలీ నిర్వహణ అంశంపై వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రి సంయుక్త అధ్యక్షతన ఈ రోజు ఇంటర్ మినిస్టీరియల్ సమావేశం జరిగింది.

 

ఎన్.సి.ఆర్ రాష్ట్రాలు, ఎన్.సి.టి.డి ల సంబంధిత కార్యాచరణ ప్రణాళికల అమలు స్థితి, ఇన్-సిటు , ఎక్స్-సిటు నిర్వహణ కోసం యంత్రాల వినియోగం, వరి గడ్డి ఇన్-సిటు నిర్వహణ కోసం బయో-డీకంపోజర్ల విస్తృత వినియోగం, వివిధ పారిశ్రామిక, వాణిజ్య. జీవ ఇంధన, ఇతర అనువర్తనాలకు వరి గడ్డి సరఫరాకు ఏర్పాట్లు, ,రైతులు, అగ్రిగేటర్లు, తయారీదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వరి గడ్డి బేలింగ్ / రేకింగ్ కార్యకలాపాలు, నిల్వ, పెల్లెటైజింగ్, రవాణా మౌలిక సదుపాయాల ఏర్పాటు లో సహకారం, థర్మల్ పవర్ ప్లాంట్ల (టి పి పి లు) లో కో -ఫైరింగ్, గుజరాత్ ,రాజస్థాన్ లోని పశుగ్రాసం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నాన్ బాస్మతి పరాలీని పశుగ్రాసంగా ఉపయోగించడం.  అగ్నిప్రమాదాలు మొదలైనవాటిపై

రాష్ట్రాలు తీసుకున్న పర్యవేక్షణ, నియంత్రణ చర్యల పై ee సమావేశం లో చర్చించారు.

 

పంట అవశేషాలను కాల్చడం కోసం డి ఓ ఏ హెచ్ అండ్ డి ద్వారా తీసుకోబడ్డ చర్యల గురించి ఎం ఓ ఏ అండ్ ఎఫ్ డబ్లూ క్లుప్తంగా ప్రజంటేషన్ ఇచ్చింది.

 

పంజాబ్ తో పోలిస్తే హర్యానాలో పరాలీ మేనేజ్ మెంట్ స్థితి గణనీయంగా మెరుగ్గా ఉందని తెలిపారు. పంజాబ్ లోని 22 జిల్లాలకు గానూ తొమ్మిది, హర్యానాలోని 22 జిల్లాలకు గానూ నాలుగు జిల్లాలుఈ రాష్ట్రాల్లో వ్యర్థాలను కాల్చడంలో ప్రధాన పాత్ర పోషించాయి.కాబట్టి, ఈ 13 జిల్లాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  వాటిలో సంగ్రూర్, మోగా, తర్న్ తరన్ ,ఫతేహాబాద్ ఉన్నాయి. అక్టోబర్ 15 నాటికి , గత సంవత్సరంతో పోలిస్తే అగ్నిప్రమాదాల ధోరణి తక్కువగా ఉంది, అయితే ఇప్పుడు ఇది వేగంగా పెరగడం ప్రారంభించింది, ముఖ్యంగా పంజాబ్ లో. అమృత్ సర్ తార్న్ తరన్ లలో అధిక అగ్నిప్రమాదాలకు పంట కోత ముందుగా జరగడం కారణం. పూసా డికంపోజర్ అనువర్తనం కోసం ఉపయోగించే భూమి పంజాబ్ లో తక్కువగా ఉందని, దీనిని ప్రోత్సహించి, మెరుగుపరచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

 

థర్మల్ పవర్ ప్లాంట్స్ (టి.పి.పి)లలో కో -ఫైరింగ్ కోసం బొగ్గుతో బయోమాస్ గుళికలను 5% కలపడాన్ని తప్పనిసరి చేసినట్లు విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను నిరోధించడానికి కో -ఫైరింగ్ కూడా సహాయపడుతుంది. ఇప్పటి వరకు 0.1 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను నిరోధించారు.

 

సిఎక్యూఎం చైర్మన్ మాట్లాడుతూ, పరాలి ఇన్-సిటు , ఎక్స్ -సిటు నిర్వహణ కోసం ఒక వివరణాత్మక ఫ్రేమ్ వర్క్ ను తాము సిద్ధం చేశామని, వ్యర్థాలను కాల్చడాన్ని నిరోధించడానికి దీనిని అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించామని తెలిపారు. సిఎక్యూఎం అనేక సమావేశాలు ,ప్రయత్నాలు చేసినప్పటికీ, పంజాబ్ తీసుకున్న చర్యలు సరిపోవని సమావేశం అభిప్రాయపడింది.

 

పంజాబ్ , హర్యానాలో సిఆర్ఎమ్ యంత్రాలను ఆలస్యంగా డెలివరీ చేయడం ప్రధాన ఆందోళనలలో ఒకటిగా సమావేశంలో పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్ సి టి, ఎన్ సిఆర్ రాష్ట్రాల నిధులను సి ఆర్ ఎం యంత్రాల నిర్వహణ కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. పుసా డికంపోజర్ అప్లికేషన్ ని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. టి పి పి లలో గుళికల వినియోగం కోసం రాష్ట్రాలు సరైన సప్లై ఛైయిన్ మేనేజ్ మెంట్ ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

 

వరి గడ్డి ఉత్పత్తిని తగ్గించడానికి, బాస్మతి రకాన్ని , పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడం సమర్థవంతమైన మార్గాలు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. సమావేశంలో చర్చించిన విధంగా, పారాలి సమర్థవంతమైన ఎక్స్-సిటు నిర్వహణ కోసం వరి గడ్డిని సేకరించడం, అగ్రిగేషన్, స్టోరేజీ , రవాణా కోసం ఒక సమన్వయ పర్యావరణ వ్యవస్థ ఉండాలి.

 

ఇస్రో, ఎంవోఏ అండ్ ఎఫ్ డబ్ల్యూల కృషితో టీపీపీల ద్వారా కో ఫైరింగ్ కు సంబంధించిన ఖచ్చితమైన డేటాను పొందగలిగామని తెలియజేశారు.

 

పూసా డికంపోజర్ అనువర్తనాన్ని పెంచాలని , అమృత్ సర్ లో పెరుగుతున్న క్రియాశీల అగ్నిప్రమాదాల రేటును నియంత్రించాలని ,గత సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రంలో క్రియాశీల అగ్నిప్రమాదాల కేసులలో 50% తగ్గింపును నిర్ధారించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,కి సూచించారు.

 

గత ఏడాదితో పోలిస్తే హర్యానాలో యాక్టివ్ ఫైర్ ఈవెంట్స్ 55 శాతం తగ్గినట్లు ఆరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. రిమోట్ సెన్సింగ్ పర్యవేక్షణ ,హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం (హెచ్.ఎ.యు)కు చెందిన నిపుణుల సహాయంతో, రైతులకు కావలసిన వ్యవసాయ పద్ధతులు , వ్యర్థాలను కాల్చడాన్ని నిరోధించడం గురించి శిక్షణ ఇస్తున్నారు.

 

సానుకూల ప్రయత్నాలను కొనసాగించాలని , పరాలి నిర్వహణ రంగంలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని కొనసాగించేలా చూడాలని యుపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి సూచించారు.

 

పూసా అప్లికేషన్ కవరేజీ కింద భూమి విస్తీర్ణం పెంచడం గురించి ఢిల్లీ ఎన్ సిటి చీఫ్ సెక్రటరీ తెలియజేశారు.

 

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పశుగ్రాసం కొరత ఉందని, ఎన్ సిఆర్ ప్రాంతంలో లభించే వ్యర్థాలను పశుగ్రాసం కొరత ఉన్న ప్రాంతాలకు రవాణా చేయడానికి సమర్థవంతమైన వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని

మత్స్య ,పశుసంవర్ధక , పాడిపరిశ్రమ శాఖల మంత్రి సూచించారు.

 

2022 నవంబర్ 4న పూసా డికంపోజర్ అప్లికేషన్ పై రైతులకు అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిఎఆర్ శాస్త్రవేత్తతో బహిరంగ చర్చ కూడా ఉంటుంది.

 

ఈ సమావేశంలో పర్యావరణ , అటవీ,  వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, పంట వ్యర్థాలను తగ్గించడం కోసం హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విశేషమైన కృషి చేయడం సంతోషంగా ఉందని అన్నారు.

 

ఇన్-సిటు మేనేజ్ మెంట్, ఎక్స్-సిటు మేనేజ్ మెంట్, సమర్థవంతమైన మానిటరింగ్ , ఎన్ ఫోర్స్ మెంట్ , ఐఈసి యాక్టివిటీస్ తో కూడిన ఫ్రేమ్ వర్క్ ని వారు అమలు చేశారు, దీని ఫలితంగా వ్యర్థాలను కాల్చడం ఘటనలు  తక్కువగా చోటు చేసుకున్నాయి.

 

పంజాబ్ లో వ్యర్థాలను తగలబెట్టడాన్ని నిరోధించడానికి పంజాబ్ ప్రభుత్వం సమన్వయ చర్యలు తీసుకోలేకపోయిందని శ్రీ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్ వోఎ అండ్ ఎఫ్ డబ్ల్యు సిఆర్ఎమ్ పథకం కింద రాష్ట్రానికి తగిన సంఖ్యలో పరికరాలు , వ్యవసాయ యంత్రాలు,  తగినన్ని నిధులు అందించినప్పటికీ కార్యాచరణ ప్రణాళిక అమలులో తగినంత పురోగతి లేదని ఆయన అన్నారు. సోనిపట్, పానిపట్, ఫరీదాబాద్, గురుగ్రామ్ లలో 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని ఆయన హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించారు.

 

 

పారాలీ నిర్వహణ కోసం తగిన సంఖ్యలో యంత్రాలను పంపిణీ చేసినట్లు హెచ్ ఎం ఇ ఎఫ్ అండ్ సి సి పేర్కొంది. సమన్వయ చర్యలు ఈ ప్రాంతంలో గాలి నాణ్యతలో గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయని హెచ్ ఎమ్ ఇ ఎఫ్ అండ్ సిసి ఆశాభావం వ్యక్తం చేసింది.

 

ఈ సమావేశానికి వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, సీఏక్యూఎం, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఎన్టీపీసీలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

 

*****


(Release ID: 1869359) Visitor Counter : 135
Read this release in: English , Urdu , Hindi , Punjabi