ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని మైసూరు మరియు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో సిజిహెచ్‌ఎస్ వెల్‌నెస్ కేంద్రాలను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమక్షంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు.


"ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్డ్ అధికారులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సంక్షేమాన్ని అందించడం మా ప్రభుత్వ బాధ్యత": డాక్టర్ మన్సుఖ్ మాండవియా

"కేంద్ర ప్రభుత్వ హెచ్ డబ్ల్యూ సి లను తెరవడమే కాకుండా మరిన్ని వైద్య కళాశాలల ద్వారా వైద్య నిపుణులు మరియు వారి శిక్షణను పెంచడం ద్వారా ' స్వల్పం నుంచి సంపూర్ణం' విధానాన్ని అనుసరిస్తోంది"

"సిజిహెచ్‌ఎస్ కేంద్రాలలో కొత్త ఆవిష్కరణలు మరియు ఆచరణతో పెన్షనర్లకు బలమైన కవరేజీని అందిస్తుంది ": డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

Posted On: 19 OCT 2022 4:41PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, కర్ణాటకలోని మైసూరు మరియు మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో సిజిహెచ్‌ఎస్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లను (హెచ్ డబ్ల్యూ సి) ఈరోజు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమక్షంలో డిజిటల్‌గా ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో డాక్టర్ మాండవ్య హర్షం వ్యక్తం చేస్తూ కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలకు మంచి వైద్య సదుపాయాలను అందించడంలో రెండు సీజీహెచ్‌ఎస్‌ హెచ్‌డబ్ల్యూసీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మైసూరు మరియు చంద్రాపూర్‌లో సిజిహెచ్‌ఎస్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లను ప్రారంభించినందుకు లబ్ధిదారులను అభినందిస్తూ, " ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్డ్ అధికారులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సంక్షేమాన్ని అందించడం మా ప్రభుత్వ బాధ్యత" అని పేర్కొన్నారు.

వైద్య సేవలను సులభంగా పొందేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. 2014లో 25గా ఉన్న సీజీహెచ్‌ఎస్‌ కేంద్రాల సంఖ్య నేడు 77కి పెరిగిందని ఆయన వివరించారు.

 

"కేంద్ర ప్రభుత్వం హెచ్‌డబ్ల్యుసిలను తెరవడమే కాకుండా మరిన్ని వైద్య కళాశాలల ద్వారా వైద్య నిపుణులు మరియు వారి శిక్షణను పెంచడం ద్వారా 'స్వల్పం నుంచి సంపూర్ణం' విధానాన్ని అనుసరిస్తోంది" అని ఆయన అన్నారు. “దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి, టెలికన్సల్టేషన్లు మరియు ఏ బీ డీ ఎం వంటి   నూతన డిజిటల్ ఆవిష్కరణలు జనౌషధి కేంద్రాలు స్థాపించబడ్డాయి మరియు ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ప్రారంభించబడింది. "అందరికీ ఆరోగ్యం" ఉండేలా కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేస్తోందని ఆయన చెప్పారు.

 

డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ, "సిజిహెచ్‌ఎస్ కేంద్రాలలో కొత్త ఆవిష్కరణలు మరియు ఆచరణతో పింఛనుదారులకు బలమైన కవరేజీని ఇస్తుందని " అని అన్నారు. సిజిహెచ్‌ఎస్‌ కింద ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆమె అన్నారు. “కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరునికి సంక్షేమాన్ని అందించడానికి పి ఎం జే ఏ వై , పీ ఎం ఏ బీ హెచ్ ఐ ఎం , హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ల వంటి కొన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ హెచ్‌డబ్ల్యుసిలు ఈ రోజు కర్ణాటక సాంస్కృతిక రాజధాని మైసూరు మరియు బ్లాక్ గోల్డ్ సిటీ చంద్రాపూర్‌లో ప్రారంభించబడతాయని మేము ఆశిస్తున్నాము” అని ఆమె తెలిపారు.

మైసూరులోని కొత్త సిజిహెచ్‌ఎస్ కేంద్రం ఈ ప్రాంతంలో నివసిస్తున్న మరియు పదవీ విరమణ పొందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా కూర్గ్, మాండ్య, చామరాజనగర్, హాసన్, శ్రీరంగ పట్టణ వంటి పొరుగు ప్రాంతాలకు నంజనగూడు వంటి సమీప ప్రాంతాల్లో  కూడా ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది మరియు పెన్షనర్ల కష్టాలను తగ్గిస్తుంది. 

 

శ్రీ రాజేష్ భూషణ్, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, శ్రీ అలోక్ సక్సేనా, అదనపు కార్యదర్శి  మంత్రిత్వ శాఖలోని సీసీ, సీజీహెచ్‌ఎస్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***


(Release ID: 1869357) Visitor Counter : 132
Read this release in: English , Urdu , Marathi , Hindi