అణుశక్తి విభాగం

మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని జైతాపూర్ సైట్ వద్ద అణు విద్యుత్ రియాక్టర్ల ఏర్పాటును వేగవంతం చేసే మార్గాలపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో చర్చించిన ఫ్రెంచ్ ప్రతినిధి బృందం; ఫ్రెంచ్ ప్రతినిధి బృందానికి ఆ దేశ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి క్రిసౌలా జచరోపౌలౌ నేతృత్వం;


ప్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ 2023 ప్రారంభంలో భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉందని ఫ్రాన్స్ మంత్రి వెల్లడి

Posted On: 18 OCT 2022 4:50PM by PIB Hyderabad

ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ మంత్రి శ్రీమతి క్రిసౌలా జచరోపౌలో మంగళవారం న్యూ ఢిల్లీ నార్త్ బ్లాక్ లో

కేంద్ర శాస్త్ర ,సాంకేతిక శాఖ

సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్),  మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ , ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), ప్రధానమంత్రి కార్యాలయం, డిఓపిటి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ , ప్ర జా గ్రీవెన్స్ , పన్నులు, పింఛ న్లు, స్పేస్ , అటామిక్ ఎనర్జీ శాఖల సహాయ మంత్రి డాక్ట ర్ జితేంద్ర సింగ్ తో సమావేశమయ్యారు. అణు శక్తిలో ఇండో-ఫ్రెంచ్ సహకారాన్ని గురించి వారు చర్చించారు. ఆమెతో పాటు ఉన్నత స్థాయి ఫ్రెంచ్ ప్రతినిధి బృందం కూడా ఉంది.

మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని జైతాపూర్ సైట్ వద్ద ఉమ్మడి సహకారం తో అణు విద్యుత్ రియాక్టర్ల ఏర్పాటును వేగవంతం చేసే మార్గాలపై ఇరు పక్షాలు చర్చించాయి. భారత్ లోని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్, న్యూక్లియర్ కౌన్సెలర్ థామస్ మీయూసెట్ తో సహా ఇతర ఫ్రెంచ్ అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001VS0O.jpg

 

సెప్టెంబర్ 2008లో ఫ్రాన్స్‌తో  కుదిరిన గొలుసు ఒప్పందం మేరకు భారత ప్రభుత్వం ఇప్పటికే ఫ్రాన్స్‌ సాంకేతిక సహకారంతో 1650 మెగావాట్ల ఆరు అణు విద్యుత్ రియాక్టర్‌లను ఏర్పాటు చేయడానికి 'సూత్రప్రాయంగా' ఆమోదం పొందింది, ఇది మొత్తం 9900 మెగావాట్ల సామర్థ్యంతో అతిపెద్ద అణు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రదేశంగా మారుతుంది.

 

జైతాపూర్లో ఆరు యూరోపియన్ ప్రెజరైజ్డ్ రియాక్టర్లను (ఈపిఆర్లు ) నిర్మించడానికి ఫ్రెంచ్ కంపెనీ ఇడిఎఫ్ గత ఏడాది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ పి సి ఐ ఎల్) కు తన బైండింగ్ టెక్నో-కమర్షియల్ ప్రతిపాదన ను సమర్పించింది. ఈ ఏడాది మేలో, ఇడిఎఫ్ నుండి ఉన్నత స్థాయి బృందం భారతదేశాన్ని సందర్శించి, ఎన్ పి సి ఐ ఎల్ అధికారులతో సమగ్రంగా చర్చలు జరిపింది.

 

2023 ప్రారంభంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటన ఉంటుందని శ్రీమతి క్రిసౌలా జచరోపౌలో ప్రకటించినందున ఈ లోగానే సాంకేతిక, ఆర్థిక, పౌర అణు బాధ్యతల సమస్యలను ఇరు పక్షాలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తాయని  డాక్టర్ జితేంద్ర సింగ్ ఫ్రాన్స్ మంత్రికి హామీ ఇచ్చారు. ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లే మైరే కూడా డిసెంబర్ నెల మధ్య లో భారతదేశంలో పర్యటించనున్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002SX12.jpg

మూడు రోజుల యూరప్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ ఏడాది మేలో పారిస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ను కలసిన విషయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అప్పుడు ఇరువురు నేతలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలతో సహా వివిధ అంశాలపై చర్చించారని, " భారత్- ఫ్రాన్స్ గర్వించదగిన అభివృద్ధి భాగస్వాములు.  ఈ భాగస్వామ్యం వివిధ రంగాలలో విస్తరించి ఉంది" అని శ్రీ మోదీ అన్నారని శ్రీ జితేంద్ర సింగ్ తెలిపారు.

 

ఈ రోజు జరిగిన సమావేశంలో, విశ్వసనీయ , చౌకైన, తక్కువ కార్బన్ శ క్తి ని పొందడం కోసం వ్యూహాత్మకమైన జైతాపూర్ ఇపిఆర్ ప్రాజెక్టు

విజయవంతం కావాలన్న నిబద్ధతను ఇరు పక్షాలూ పునరుద్ఘాటించాయి, పెండింగ్ లో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు

అంగీకరించాయి.

యూనిట్ల నిర్మాణం , కమిషనింగ్ కు

ఎన్ పిసిఐఎల్ బాధ్యత వహిస్తుంది, అదేవిధంగా ప్లాంట్ యాజమాన్య , భవిష్యత్తు ఆపరేటర్ గా భారత రెగ్యులేటర్ ద్వారా ఇ పి ఆర్ టెక్నాలజీ సర్టిఫికేషన్ సహా భారతదేశంలో అవసరమైన అన్ని అనుమతులు, ఆమోదాలు పొందుతుంది.

 

అణువిద్యుత్ పరిశుభ్రంగా, పర్యావరణానికి అనుకూలమైనదని, సుస్థిరమైన ప్రాతిపదికన దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతను నిర్ధారించే భారీ సామర్థ్యాన్ని కలిగి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అణువిద్యుత్ కేంద్రాలు ఇప్పటివరకు 755 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాయి, తద్వారా సుమారు 650 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు ఆదా అయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003KL2N.jpg

న్యూక్లియర్ పవర్ తో సహా వివిధ క్లీన్ ఎనర్జీ వనరుల కలయిక ద్వారా నికర జీరో లక్ష్యాలను చేరుకోవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. నిర్మాణంలో ఉన్న, ఆమోదం పొందిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న 6780 మెగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2031 కల్లా 22480 మెగావాట్లకు పెంచాలని యోచిస్తున్నారు.

 <><><><><>



(Release ID: 1869002) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Hindi , Marathi